‘విశ్వరూపం’ సినిమాలో కమల్ హాసన్
స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో ఏప్రిల్ నెలలో వెండితెరపై సందడి నెలకొననుంది. తెలుగు, తమిళ టాప్ హీరోల సినిమాలు ఒకే సీజన్ లో రిలీజ్ అవుతుండటంతో థియేరట్ల సమస్యకు ఏర‍్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే భారీ పోటితో సతమతమవుతుంటే తాజాగా లోకనాయకుడు కమల్ కూడా అదే సీజన్‌లో బరిలో దిగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే తెలుగు స్టార్స్ మహేష్ బాబు, అల్లు అర్జున్‌లు ఇబ్బందులు కలగకుండా రెండు వారాల గ్యాప్ ఉండేలా సర్ధుబాటు చేసుకున్నారు. మహేష్ భరత్ అనే నేను, అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాలను ముందుగా ఏప్రిల్ 27న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఒక ఒప్పందానికి వచ్చిన నిర్మాతలు భరత్ అనే నేనును ఏప్రిల్ 20న, నా పేరు సూర్యను మే 4న రిలీజ్ చేయాలని నిర్ణయించారు.
తమిళ చిత్రాలతో మాత్రం ఇబ‍్బందులు తప్పేలా లేవు. ఏప్రిల్ 27న రజనీకాంత్ కాలా రిలీజ్ అవుతున్నట్టుగా ఇప్పటికే ప్రకటించేశారు. తాజాగా కమల్ కూడా విశ్వరూపం 2ను ఏప్రిల్ లోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నాడట. అనుకున్నట్టుగా ఏప్రిల్‌లోనే రిలీజ్ చేస్తే కాలా, భరత్ అనే నేను సినిమాలతో పోటి పడాల్సి ఉంటుంది. మరి కమల్ ఆ రిస్క్ చేస్తాడా.. లేదా..? చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment