మహేశ్‌బాబు, రజనీకాంత్
వార్ తప్పదు. సూర్య, భరత్‌కు బాక్సాఫీసు వార్ తప్పదనుకున్నారంతా. ఈ వార్ రెండు కాంపౌండ్‌ల మధ్య గొడవకు దారి తీస్తుందని, వినోదం చూడొచ్చని ఔత్సాహికరాయుళ్లు ఆసక్తిగా ఎదురు చూశారు. అది మాత్రం జరగకూడదని ఇండస్ట్రీ మేలు కోరుకునేవాళ్లు ఆకాంక్షించారు. చివరికి వాళ్లు అనుకున్నదే జరిగింది. ఔత్సాహికుల ఆసక్తి మీద బిందెడు నీళ్లు చల్లినట్లయింది. మహేశ్‌బాబు ‘భరత్ అనే నేను’, అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’ సినిమాల మధ్య వార్ లేదు. రెండు చిత్రాల నిర్మాతలు ఫ్రెండ్లీగా మాట్లాడుకుని, ఒక అండర్‌స్టాండింగ్‌కి వచ్చారు.
భరత్.. సూర్య.. కాలా
కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమతి డి. పార్వతి సమర్పణలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా ‘భరత్ అనే నేను’. వక్కంతం వంశీ దర్శకత్వంలో కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న సినిమా ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’. తొలుత ఈ రెండు సినిమాలను ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సడన్‌గా మధ్యలో ‘కాలా’ దూసుకొచ్చాడు.
అంతే ముక్కోణపు వార్ స్టారై్టంది. ఎందుకంటే.. రజనీకాంత్ హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ‘కాలా’ చిత్రాన్ని కూడా ఏప్రిల్ 27నే రిలీజ్ చేయనున్నట్లు ఎనౌన్స్ చేశారు. అంతే.. డబుల్.. ట్రిపుల్ అయ్యింది. అంటే.. బాక్సాఫీసు వద్ద ముక్కోణపు పోటీ అన్నమాట. అయితే ‘కాలా’తో రాకుండా భరత్, సూర్య ఒక్కరోజు ముందుకొచ్చారు. ఏప్రిల్ 26న ‘భరత్ అనే నేను’, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందాలు ప్రకటించాయి.
కానీ, రెండు సినిమాల మధ్య పోటీ కూడా సరికాదని చాలామంది భావించారు. ఇప్పుడా చింత లేదు. ఎందుకుంటే.. భరత్, సూర్య చిత్రబృందాలు కూడా స్నేహపూర్వకంగానే వార్‌కు ప్యాకప్ చెప్పారు. రెండు సినిమాల రిలీజ్ డేట్స్‌ను మార్చుకున్నట్లు గురువారం నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఫైనల్‌గా ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని ఏప్రిల్ 20న, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రాన్ని మే 4న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు చెప్పారు. ఇప్పుడు బాక్సాఫీస్ వార్ లేదు. ఉన్నదల్లా స్నేహపూర్వకమైన వాతావరణం మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment