
మహేశ్‌బాబు, అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్
... వస్తున్నారు భరత్ అండ్ సూర్య. మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డి. పార్వతి సమర్పణలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’. ఈ సినిమా షూటింగ్‌కు మార్చి 27న ప్యాకప్ చెప్పనున్నారు చిత్రబృందం. సీయం భరత్ పాత్రలో మహేశ్‌బాబు నటిస్తున్నారు. అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో కె.నాగబాబు సమర్పణలో, శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’. ‘బన్నీ’ వాసు సహనిర్మాత. సైనికుడు సూర్య పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నారు. ‘భరత్ అనే నేను’, ‘నా పేరు సూర్య– నా ఇల్లు ఇండియా’ సినిమాలను ముందుగా ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలనుకున్నారు.
కానీ ఇప్పుడు రెండు సినిమాలు ఏప్రిల్ 26న విడుదల కానున్నాయి. మరి.. ఇద్దరూ ఒకరోజు ముందుకు రావడానికి రజనీకాంత్ ‘కాలా’ కారణం అయ్యుంటుందా? అనే చర్చ జరుగుతోంది. ‘కాలా’ 27న విడుదల కానుంది. ఆ సంగతలా ఉంచితే ‘‘మహేశ్‌బాబు–కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా చేయడం చాలా హ్యాపీ. ఇది మా బేనర్‌కి ప్రెస్టీజియస్ మూవీ అవుతుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న విడుదల చేస్తాం’’ అని డీవీవీ దానయ్య అన్నారు. ‘‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’ ఫెస్టివల్‌ను ఒక్కరోజు ముందుకు తీసుకొస్తున్నాం. ఏప్రిల్ 26న విడుదల చేస్తున్నాం’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమాలోని రెండో సాంగ్ ‘లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో’ను ఈరోజు విడుదల చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment