భరత్ అను నేను, నా పేరు సూర్య సినిమాలతో వేసవికి టాలీవుడ్ కూడా వేడెక్కబోతోందని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితి మారింది. మొదట ఈ రెండు భారీ సినిమాలను ఒకే రోజున( ఏప్రిల్ 27) విడుదల చేస్తున్నట్లు ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా ఈ రెండు సినిమాలు రెండు వారాల వ్యవధితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. భరత్ అను నేను ఏప్రిల్ 20న , నా పేరు సూర్య మే 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు.
శ్రీమంతుడు లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మహేశ్ బాబు కొరటాల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ‘భరత్ అను నేను’పై మామూలుగానే అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. మహేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తూ వచ్చిన ఆడియో ఇప్పటికే అభిమానులను ఆకట్టుకుంది. ఇక డీజే లాంటి హిట్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. వక్కంతం వంశీ మొదటిసారిగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా టీజర్, సాంగ్స్ అభిమానులను ఉరకలు పెట్టిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment