సూపర్‌స్టార్ మహేశ్ బాబు యమ హ్యాపీగా ఉన్నాడనీ ఇట్టే అర్థమైపోతోంది. సక్సెస్ మీట్‌లో భావోద్వేగంగా మాట్లాడటం, కొరటాల శివను హత్తుకోవడం, తన శ్రీమతి నమ్రతను ముద్దుపెట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇవన్నీ చూస్తే మహేశ్ ఎంత సంతోషంగా ఉన్నాడో తెలుస్తోంది. రెండు భారీ డిజాస్టర్స్ తరువాత కసితో తీసిన ‘భరత్ అనే నేను’ సినిమా సూపర్‌హిట్ టాక్‌తో రికార్డుల వేటను కొనసాగిస్తోంది. గతంలో శ్రీమంతుడు లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కొరటాల శివతో మళ్లీ అదే రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మహేశ్.
మహేశ్‌ను ట్వీటర్‌లో ఎంతో మంది ఫాలో అవుతున్నా...మహేశ్ మాత్రం ఇంతకాలం ఒక్కడినే ఫాలో అయ్యేవాడు. ఆయనే మహేశ్ బావ గల్లా జయదేవ్. అంటే తన మనసులో ఎంతో ప్రేమ ఉంటే తప్ప ట్వీటర్‌లో ఫాలో అయ్యేవాడు కాదని తెలుస్తోంది. అయితే ఈ జాబితాలో కొత్తగా ఒక పేరు వచ్చి చేరింది. అది ఎవరూ అనేది ఈపాటికే తెలిసుంటుంది. తన కెరీర్ గ్రాఫ్ పడిపోతున్న సమయంలో మళ్లీ పీక్స్‌లో నిలబెట్టిన దర్శకుడు కొరటాల శివనే మహేశ్ ఫాలో అవుతున్న రెండో వ్యక్తి. సో...మహేశ్‌కు కొరటాల అంటే ఎంత ప్రేమనో చెప్పకనే చెప్పాడు కదా.
Comments
Please login to add a commentAdd a comment