అదేంటీ మహేశ్‌బాబు ఫొటో పెట్టి, ఎన్టీఆర్ సాంగ్ రాశారేంటి అనుకుంటున్నారా? మేటర్‌లోకి వెళ్తే మీకే అర్థం అవుతుంది. మహేశ్ ట్వీటర్‌లో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో మనందరికీ తెలిసిందే. సినిమా అప్‌డేట్స్ దగ్గర నుంచి వాళ్ల పిల్లలు గౌతమ్, సితార ఫొటోల దాకా అన్నీ అభిమానులతో పంచుకుంటుంటారు మహేశ్. లక్షలమంది అభిమానులు ఆయన్ను ఫాలో అవుతుంటారు. ఇటీవలే 6 మిలియన్ (60 లక్షలు) ఫాలోవర్స్‌ను టచ్ చేశారు ఆయన.
కానీ మహేశ్ మాత్రం తన బావ గల్లా జయదేవ్‌ను మాత్రమే ఫాలో అవుతారు. మహేశ్ ట్వీటర్ ఖాతా తెరిచినప్పటినుంచి కేవలం తన బావని మాత్రమే ఫాలో అయ్యారు. ఇప్పుడు మరొకర్ని కూడా ఫాలో అవుతున్నారు. ఈ రెండో వ్యక్తి ఎవరా అనుకుంటున్నారా? మహేశ్‌కు ‘శ్రీమంతుడు, భరత్ అనే నేను’ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివ. మహేశ్ కెరీర్‌లో హిట్స్ కచ్చితంగా డెలివర్ చేయాల్సిన ప్రతిసారీ కొరటాల శివ సినిమా హిట్ అందించారు. సో.. ఆ అభిమానంతోనే కొరటాల శివను మహేశ్ ఫాలో ఫాలో అవుతున్నారని ఊహించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment