
Allu Aravind Comments On Tollywood Celebrities Meeting With AP CM Jagan: సీఎం జగన్‌తో టాలీవుడ్ సినీ ప్రముఖల భేటీపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. 'ఈ భేటీతో టికెట్ల ధరల అంశంపై ఎండ్ కార్డ్ పడుతుందని ఆశిస్తున్నాం. ఇరు పక్షాలకు మంచి జరగుతుందని భావిస్తున్నా. మా కుటుంబం నుంచి చిరంజీవి వెళ్లారు. కాబట్టి నేను వెళ్లాల్సిన అవసరం లేదు.
ఒకే ఇంటి నుంచి ఇద్దరు ఎందుకు? ఇండస్ట్రీకి మేలు జరిగేలా ప్రకటన వస్తుందని ఆశిస్తున్నా' అని పేర్కొన్నారు. కాగా ఉదయం 11 గంటలకు ఏపీ సీఎం జగన్‌తో చిరంజీవి, మహేశ్‌బాబు, కొరటాల శివ, రాజమౌళి వంటి సినీ ప్రముఖులు భేటీ కానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండస్ట్రీ చూపు మొత్తం ఈ భేటీపైనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment