బ్రహ్మాజీ, డీవీవీ దానయ్య, కొరటాల శివ, మహేశ్‌బాబు, కియారా అద్వానీ, దేవిశ్రీ ప్రసాద్, రామజోగయ్య శాస్త్రి
‘‘రెండేళ్లుగా నాకు చాలా ఎమోషనల్‌గా, ఒత్తిడిగా ఉండేది. ఇప్పుడు రిలీఫ్. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు. చాలా ఆనందంగా ఉంది. ‘భరత్ అనే నేను’ని హిట్ చేసిన ప్రేక్షకులు, నాన్నగారి, నా ఫ్యాన్స్‌కు థ్యాంక్స్’’ అని మహేశ్‌బాబు అన్నారు. మహేశ్‌బాబు, కియారా అద్వాని జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’. డి. పార్వతి సమర్పణలో దానయ్య డీవీవీ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన థ్యాంక్స్ మీట్‌లో మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘బ్రహ్మాజీ నాతో యాక్ట్ చేసినప్పుడల్లా 99 పర్సెంట్ బ్లాక్‌బస్టర్సే. తెలుగు చిత్ర పరిశ్రమకి కియారా లాంటి ఇంకో పెద్ద హీరోయిన్ వచ్చినందుకు హ్యాపీగా ఉంది. శివగారికి ఎప్పుడూ రుణపడి ఉంటా. ‘శ్రీమంతుడు’ సినిమాకి ముందు కూడా ఇదే ఫేజ్ ఉండేది నాకు. ‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చారు. తర్వాత అదే రిపీట్ చేశారు. నేను పడుతున్న టెన్షన్ ఆయనకు తెలుసు. మళ్లీ ఓ బ్లాక్‌బస్టర్ ఇచ్చారు.
‘ఐ యామ్ ఆల్వేస్ గ్రేట్‌ఫుల్ టు యు సర్’. నేనెప్పుడూ ఏ సినిమాకీ ఇంత కష్టపడి పనిచేయలేదు. మా సినిమా రిలీజ్ ముందు ఏప్రిల్ 27న అనుకున్నాం. 20కి వచ్చాం. అది మా అమ్మగారి పుట్టినరోజు. ఆ రోజు రిలీజ్ డేట్ ప్రకటించిన నిర్మాతకి, యూనిట్‌కి థ్యాంక్స్. ఆ రోజు సినిమా విడుదల అవడం వల్లే ఇన్ని బ్లెసింగ్స్ వచ్చాయేమో మాకు. 20న సినిమా రిలీజ్ అంటే పదో తారీఖు నా డబ్బింగ్ పూర్తయింది. ఈ టెన్షన్ తట్టుకోలేక ఫ్యామిలీతో కలిసి ఐదు రోజులు వెకేషన్ వెళ్లా. దేవి ఈజ్ నాట్ ఏ మ్యూజిక్ డైరెక్టర్.
నేపథ్య సంగీతంతో స్టోరీ చెప్పేశారు. ఎప్పటి నుంచో నాతో సినిమా చేయాలని దానయ్యగారికి ఉండేది. ‘భరత్ అనే నేను’ చేశాం. పెద్ద హిట్ అయింది. రిలీజ్ రోజు సాయంత్రం ఆయన్ని కలిసి.. ‘కొట్టేశాం దానయ్యగారు పెద్ద హిట్’ అంటే.. ‘అవ్వుద్దండీ.. ఎందుకు అవ్వదు.. అవ్వాలి కదా!’ అన్నారు. ‘మీతో మళ్లీ మళ్లీ సినిమా చేస్తాను సార్’. థ్యాంక్యూ. సినిమాలో ఇంకా చాలా ఎగై్జటింగ్ సీన్స్ ఉన్నాయి. అవన్నీ పెట్టలేకపోయా మనే బాధ ఉంది. నాన్నగారికి (కృష్ణ) సినిమా విపరీతంగా నచ్చింది.
ఈ చిత్రం ఫస్ట్ ఓత్ విడుదలైనప్పుడు ‘అరే.. ఇది నా వాయిస్‌లా ఉందే’ అన్నారు. రమేశ్ అన్నయ్య చెన్నైలోనే ఎక్కువగా పెరిగారు. శివాజీ గణేశన్, ఎంజీఆర్‌గార్లంటే ఆయనకి ఇష్టం. వారికి బిగ్ ఫ్యాన్. ‘భరత్ అనే నేను’ సినిమా చూడగానే నాకు వాళ్లు గుర్తొచ్చారు అని చెప్పారు. అది నా లైఫ్‌లో బిగ్ కాంప్లిమెంట్’’ అన్నారు. నిర్మాత దానయ్య మాట్లాడుతూ– ‘‘మా సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌లో కృషగారు, మహేశ్ అభిమానులకు ఓ హామీ ఇచ్చా. అది నిలబెట్టుకున్నందుకు హ్యాపీగా ఉంది.
ఈ మూవీ చూసి, చిరంజీవి గారు ఫోన్ చేసి మంచి సినిమా తీశావని అభినందించారు. నా బంధువులు, ఫ్రెండ్స్ గొప్ప సినిమా తీశావని ఫోన్లు, మెసేజ్‌లు చేశారు. గొప్ప సినిమా ఇచ్చిన శివగారికి, మహేశ్‌గారికి థ్యాంక్స్. హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. 27న శుక్రవారం తిరుపతిలో సక్సెస్ మీట్ నిర్వహిస్తాం’’ అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ– ‘‘నేను నా స్క్రిప్ట్‌ని ఎంత ప్రేమిస్తానో నా నటీనటులు, టెక్నీషియన్స్ కూడా అంతే ప్రేమిస్తారు. మహేశ్‌లాంటి యాక్టర్ ఉన్నప్పుడు ఇంకా ఇంకా ఏదో రాయాలనే ఉంటుంది.
ఆయన మంచి సపోర్ట్, కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఆయనతో ఎప్పుడెప్పుడు సినిమా చేద్దామా అని ఉంటుంది. గొప్ప సినిమా తీయాలని చెప్పిన దానయ్యగారి నమ్మకాన్ని నిలబెట్టాననుకుంటున్నా. మా కష్టం అంతా మరచిపోయేలా చేసినందుకు జీవితాంతం ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. ‘శ్రీమంతుడు, భరత్ అనే నేను’ సినిమాలను మించిన లైన్ దొరికినప్పుడు మహేశ్‌గారి ఇంటికెళ్లి కాలింగ్ బెల్ నొక్కుతా’’ అన్నారు. ‘‘సక్సెస్, బ్లాక్ బస్టర్ హిట్స్ ఇండస్ట్రీలో అందరికీ వస్తుంటాయి.
ఈ సినిమా ఎందుకు ప్రత్యేకం అంటే.. సమాజంలో ఏదైతే జరగాలో.. ఇలాంటోడు ఒకడు రావాలనుకుంటామో అలాంటి వాడు రావడంతో అందరూ కనెక్ట్ అయ్యారు’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. ‘‘ఈ మూవీలో భాగమైనందుకు గర్వంగా ఉంది. మహేశ్ సార్‌లాంటి కో–స్టార్‌తో పనిచేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. మిమ్మల్ని చూసి ఇన్‌స్పైర్ అవుతున్నా. నన్ను ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు కియారా. నటుడు బ్రహ్మాజీ, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment