మహేశ్‌బాబు
అందరికీ అన్ని విషయాలపై అవగాహన ఉండకపోవచ్చు. అందరికీ అన్ని విషయాలు తెలియాల్సిన రూలూ లేదు. కానీ మనకు తెలిసింది కొంత. తెలియాల్సింది ఇంకెంతో అని కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉవ్విళ్లూరుతుంటారు కొంతమంది. అందులో సీయం భరత్ ఒకరు. ‘యూనివర్శ్ అనే ఎన్‌సైక్లోపీడియాలో తెలుసుకున్న కొద్దీ ఉంటాయి ఇంకెన్నో. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్’ అంటున్నారు భరత్. మహేశ్‌బాబు, కియారా అద్వాని జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘భరత్ అనే నేను’. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ ‘ఐ డోంట్ నో’ను ఆదివారం రిలీజ్ చేశారు. పైన చెప్పినదంతా ఈ పాటలోని సారాంశమే. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను బాలీవుడ్ డైరెక్టర్, యాక్టర్, సింగర్ ఫర్హాన్ అక్తర్ పాడటం విశేషం. రామజోగయ్య శాస్త్రి రచించారు. రామజోగయ్య ఇన్‌స్పిరేషనల్ లిరిక్స్, ఫర్హాన్ వాయిస్ బాగా కుదరటంతో సంగీత ప్రియులను ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈనెల 7న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ(ఆడియో విడుదల) నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 20న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: రవి కె.చంద్రన్, తిరు, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment