
విజన్ ఉన్న వ్యక్తి సీయం అయితే ప్రజలంతా బహుత్ ఖుషీగా ఉంటారు. అతని విజన్ భవిష్యత్ తరాలకు భరోసా ఇస్తుంది. ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుతుంది. భరత్ అనే సీయం విజన్ ఎలా ఉంటుందో సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందేనని అంటున్నారు ‘భరత్ అనే నేను’ చిత్రబృందం.
మహేశ్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో డి.పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా ‘భరత్ అనే నేను’. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. సీయం భరత్ పాత్రలో మహేశ్‌బాబు కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ‘ది విజన్ ఆఫ్ భరత్’ను మార్చి 6న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ప్రకాశ్‌రాజ్, శరత్‌కుమార్ ముఖ్య తారలుగా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ స్వరకర్త. ఈ సినిమాను ఏప్రిల్ 20న విడుదల చేయాలనుకుంటున్నారు.