రామజోగయ్య శాస్త్రి, కొరటాల శివ, దానయ్య
‘‘భరత్ అనే నేను’ కథ మహేశ్‌బాబు వినగానే ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఇంత స్పాన్ ఉన్న కథ రాయడం కష్టం అన్నారు. మహేశ్ ఇన్‌వాల్వ్ అయి, కేర్ తీసుకొని ఈ సినిమా చేశారు’’ అని కొరటాల శివ అన్నారు. మహేశ్‌బాబు, కియారా అద్వాని జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భరత్ అనే నేను’. డి. పార్వతి సమర్పణలో దానయ్య డీవీవీ నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. కొరటాల శివ మాట్లాడుతూ– ‘‘మిర్చి’ తర్వాత దానయ్యగారికి సినిమా చెయ్యాలి.
‘జనతా గ్యారేజ్’ తర్వాత ఆయనతో మహేశ్‌గారితో సినిమా చేద్దాం అన్నాను. ‘మహేశ్‌తో సినిమా నా కల. బాగా రెస్పెక్ట్ వచ్చే, రిచ్‌గా ఉండే చిత్రం కావాలి’ అన్నారు దానయ్య. అప్పటినుంచి నాకెప్పుడూ ఆయన గురించే టెన్షన్ ఉండేది. ఫ్యాన్స్‌ని ఈజీగా శాటిస్‌ఫై చెయ్యొచ్చు. ఈ సినిమా స్క్రిప్ట్ రాసేటప్పుడు ప్రతి సీన్ రిచ్‌గా, గ్రాండ్‌గా ఉండాలనుకున్నా. ఇది రెగ్యులర్ సినిమా కాదు. కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన పొలిటికల్ టచ్‌తో ఉంటుంది. పెద్ద కంటెంట్ ఉంది.
రెండు పార్ట్‌లుగా తీయాల్సిన చిత్రమిది. నాలుగు గంటలు వచ్చింది. అంత పెద్ద స్పాన్ ఉన్న సినిమాని శ్రీకర్ ప్రసాద్ మూడు గంటలకు అద్భుతంగా ఎడిట్ చేశారు. కథకు తగ్గ పాటలిచ్చిన రామజోగయ్య శాస్త్రికి, మంచి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్‌కి థ్యాంక్స్’’ అన్నారు. దానయ్య మాట్లాడుతూ– ‘‘నేను గర్వంగా చెప్పుకునే సినిమా ఇచ్చారు శివగారు. సినిమా బ్లాక్ బస్టర్ అని అందరూ ముందుగానే కంగ్రాట్స్ చెపుతుంటే హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘ఇది చాలా హానెస్ట్ మూవీ’’ అన్నారు పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి.
Comments
Please login to add a commentAdd a comment