Vakkantam Vamsi
-
మాస్ హీరో.. వంశీకి చాన్స్ ఇస్తాడా..?
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన రచయిత వక్కంతం వంశీ. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన వంశీ దర్శకుడిగా మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాడు. నా పేరు సూర్య రిలీజ్ తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న వక్కంతం వంశీ ఇంత వరకు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. తాజాగా వంశీ చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మాస్ మహరాజ్ రవితేజ హీరోగా ఓ సినిమా చేసేందుకు వంశీ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ.. శ్రీనువైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఎక్కడి పోతావు చిన్నవాడా ఫేం వీఐ ఆనంద్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో పాటు వక్కంతం వంశీ దర్శకత్వంలోనూ సినిమా చేయనున్నాడట. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. -
నా పేరు సూర్య ప్రీ రిలీజ్ హైలైట్స్
-
ఇండియా టీమ్
-
భరత్..సూర్య..లో ఎవరు ముందు?
భరత్ అను నేను, నా పేరు సూర్య సినిమాలతో వేసవికి టాలీవుడ్ కూడా వేడెక్కబోతోందని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితి మారింది. మొదట ఈ రెండు భారీ సినిమాలను ఒకే రోజున( ఏప్రిల్ 27) విడుదల చేస్తున్నట్లు ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా ఈ రెండు సినిమాలు రెండు వారాల వ్యవధితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. భరత్ అను నేను ఏప్రిల్ 20న , నా పేరు సూర్య మే 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. శ్రీమంతుడు లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మహేశ్ బాబు కొరటాల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ‘భరత్ అను నేను’పై మామూలుగానే అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. మహేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తూ వచ్చిన ఆడియో ఇప్పటికే అభిమానులను ఆకట్టుకుంది. ఇక డీజే లాంటి హిట్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. వక్కంతం వంశీ మొదటిసారిగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా టీజర్, సాంగ్స్ అభిమానులను ఉరకలు పెట్టిస్తున్నాయి. -
అర్జున్ అండ్ అర్జున్!
స్టైల్‌కి యాక్షన్ తోడైతే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో త్వరలోనే మెగాఫోన్ పట్టనున్న రచయిత వక్కంతం వంశీ చూపిస్తారట! అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. దేశభక్తి కథతో రూపొందే ఈ చిత్రానికి ‘నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. తాజా ఖబర్ ఏంటంటే... ఇందులో కీలక పాత్రను ‘యాక్షన్ కింగ్’ అర్జున్ చేయనున్నారట! ‘ఒకే ఒక్కడు’, ‘జెంటిల్మన్’, ‘జైహింద్’ వంటి దేశభక్తి సినిమాల్లో పవర్ఫుల్ పాత్రలు చేశారాయన. ఇప్పుడీ దేశభక్తి సినిమాలో అర్జున్ చేయబోయే పాత్ర కూడా అంతే పవర్‌ఫుల్‌గా, కథలో కీలకంగా ఉంటుందట. అర్జున్ అండ్ అర్జున్ కాంబినేషన్లో సీన్స్ ప్రేక్షకులకు సూపర్ కిక్ ఇస్తాయట. ప్రస్తుతం బన్నీ ‘దువ్వాడ జగన్నాథమ్’ (డీజే) చేస్తున్నారు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న డీజే పూర్తయిన తర్వాత జూన్‌లో వక్కంతం వంశీ ‘నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా’ చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నారు. -
బన్నీకి విలన్‌గా యాక్షన్ హీరో..!
ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్., ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్లో పెట్టాడు. దర్శకుడిగా మారనున్న రచయిత వక్కంతం వంశీతో ఓ మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేయనున్నాడు. ఇప్పటికే కథ కథనాలు రెడీ అయిన సినిమాను వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు వంశీ. అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించాలని భావిస్తున్న ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో అర్జున్ను ప్రతినాయక పాత్రకు ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. డబ్బింగ్ చిత్రాలతో పాటు.. కొన్ని స్ట్రయిట్ సినిమాలతోనూ తెలుగు ప్రేక్షకులకు చేరువైన అర్జున్, బన్నీకి విలన్‌గా నటిస్తే సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాల్లో విలన్ గానూ మెప్పించిన అర్జున్, తెలుగులో బన్నీ సినిమాతో విలన్‌గా పరిచయం అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను లగడపాటి శ్రీధర్ లార్స్స్కో ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై తెరకెక్కిస్తున్నాడు. ఏప్రిల్ రెండో వారం షూటింగ్‌ను ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను చిత్రయూనిట్ త్వరలోనే వెల్లడించనున్నారు. -
జూ,, ఎన్టీఆర్‌తో వక్కాంతం వంశీ చిట్ ఛాట్
-
అన్నదమ్ముల కలయికలో సినిమా
ఎన్టీఆర్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. ఈ సినిమాను ఫలానా నిర్మాత నిర్మించనున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే... అవేవీ నిజం కాలేదు. వంశీ మాత్రం ఈ ప్రాజెక్ట్ విషయంలో ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. తన నమ్మకాన్ని నిజం చేస్తూ... ఎట్టకేలకు ఈ సినిమా సెట్స్‌కి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ అన్నయ్య కల్యాణ్‌రామ్ నిర్మించనుండడం విశేషం. ‘అతనొక్కడే, హరేరామ్’ చిత్రాలతో హీరోగానే కాక, నిర్మాతగా కూడా తన అభిరుచిని చాటారు కల్యాణ్‌రామ్. ఇప్పుడు తమ్ముడు ఎన్టీఆర్‌తో నిర్మించనున్న ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు కల్యాణ్‌రామ్. త్వరలో మొదలు కానున్న ఈ సినిమా గురించి వక్కంతం వంశీ మాట్లాడుతూ -‘‘రచయితగా ఎన్నో కథలు రాశాను. ‘ఎవడు, రేసుగుర్రం’ విజయాలు నాకు మరింత ఉత్సాహాన్నిచ్చాయి. త్వరలో దర్శకుడిగా మారనున్నాను. రచయితగా ఆదరించినట్లుగానే, దర్శకునిగా కూడా ఆదరిస్తారని నా నమ్మకం. ఎన్టీఆర్ నుంచి ప్రేక్షకులు ఏమి కోరుకుంటున్నారో అన్నీ ఉండే కథ సిద్ధం చేసుకున్నాను. ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలో దర్శకునిగా నా తొలి చిత్రం రూపొందడం ఆనందంగా ఉంది. పది రోజుల్లో స్క్రిప్ట్ వర్క్ పూర్తవుతుంది. ఇతర విశేషాలు త్వరలో తెలియజేస్తాం’’ అని చెప్పారు.