బన్నీకి విలన్గా యాక్షన్ హీరో..! | Arjun to play villain opposite Allu Arjun | Sakshi
Sakshi News home page

బన్నీకి విలన్గా యాక్షన్ హీరో..!

Published Tue, Mar 28 2017 11:12 AM | Last Updated on Tue, Sep 5 2017 7:20 AM

బన్నీకి విలన్గా యాక్షన్ హీరో..!

బన్నీకి విలన్గా యాక్షన్ హీరో..!

ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్., ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్లో పెట్టాడు. దర్శకుడిగా మారనున్న రచయిత వక్కంతం వంశీతో ఓ మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేయనున్నాడు. ఇప్పటికే కథ కథనాలు రెడీ అయిన సినిమాను వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు వంశీ.

అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించాలని భావిస్తున్న ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో అర్జున్ను ప్రతినాయక పాత్రకు ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. డబ్బింగ్ చిత్రాలతో పాటు.. కొన్ని స్ట్రయిట్ సినిమాలతోనూ తెలుగు ప్రేక్షకులకు చేరువైన అర్జున్, బన్నీకి విలన్గా నటిస్తే సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

ఇప్పటికే పలు చిత్రాల్లో విలన్ గానూ మెప్పించిన అర్జున్, తెలుగులో బన్నీ సినిమాతో విలన్గా పరిచయం అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను లగడపాటి శ్రీధర్ లార్స్స్కో ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై తెరకెక్కిస్తున్నాడు. ఏప్రిల్ రెండో వారం షూటింగ్ను ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను చిత్రయూనిట్ త్వరలోనే వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement