DJ duvvada Jagannatham
-
వివాదంలో అల్లు అర్జున్ డీజే
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాపై వివాదంలో చెలరేగుతుంది. ఈ సినిమాలో బ్రాహ్మణుడి పాత్రలో నటిస్తున్న అల్లు అర్జున్ పై చిత్రీకరించిన ఓ పాట వివాదానికి కారణమైంది. ఇటీవల ఈ సినిమాలో బడిలో గుడిలో అనే డ్యూయెట్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ పాటలో బ్రాహ్మణుల మనో భావలు దెబ్బ తినేలా పద ప్రయోగాలు ఉన్నాయంటూ కొంత మంది అభ్యతరం వ్యక్తం చేస్తున్నారు. శివుణ్ని పూజించే సమయంలో వాడే కొన్ని మంత్రాలను ఈ పాటలో తప్పుగా వినియోగించారంటూ ఆరోపిస్తున్నారు. అయితే ఈ వివాదంపై ప్రస్తుతానికి చిత్రయూనిట్ స్పందించలేదు. గతంలో ఇదే తరహాలో రూపొందిన అదుర్స్ సినిమాపై కూడా వివాదం చెలరేగింది. అయితే అప్పుడు చిత్రయూనిట్ అభ్యంతరకర పదాలను మార్చి సినిమాను రిలీజ్ చేశారు. మరి డీజే విషయంలో చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. -
బన్నీకి విలన్‌గా యాక్షన్ హీరో..!
ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్., ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్లో పెట్టాడు. దర్శకుడిగా మారనున్న రచయిత వక్కంతం వంశీతో ఓ మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేయనున్నాడు. ఇప్పటికే కథ కథనాలు రెడీ అయిన సినిమాను వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు వంశీ. అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించాలని భావిస్తున్న ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో అర్జున్ను ప్రతినాయక పాత్రకు ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. డబ్బింగ్ చిత్రాలతో పాటు.. కొన్ని స్ట్రయిట్ సినిమాలతోనూ తెలుగు ప్రేక్షకులకు చేరువైన అర్జున్, బన్నీకి విలన్‌గా నటిస్తే సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాల్లో విలన్ గానూ మెప్పించిన అర్జున్, తెలుగులో బన్నీ సినిమాతో విలన్‌గా పరిచయం అయ్యేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను లగడపాటి శ్రీధర్ లార్స్స్కో ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై తెరకెక్కిస్తున్నాడు. ఏప్రిల్ రెండో వారం షూటింగ్‌ను ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను చిత్రయూనిట్ త్వరలోనే వెల్లడించనున్నారు. -
బన్నీ సినిమా ఆగిపోలేదు.. కాస్త లేట్ అంతే..!
సరైనోడు సినిమా తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్.. తరువాత రెండు సినిమాలను వెంట వెంటనే ప్రారంభించాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథమ్ తో పాటు.. తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో తెలుగు తమిళ బాషల్లో ఓ యాక్షన్ సినిమాను ప్లాన్ చేశాడు. ఈ సినిమా కూడా లాంఛనంగా ప్రారంభమైంది. అయితే కొద్ది రోజులుగా బన్నీ లింగుసామి దర్శకత్వంలో నటించాల్సిన సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది. కథ కుదరలేదని కొన్ని సార్లు, బన్నీ రెమ్యూనరేషన్ సెట్ కాలేదని కొన్ని సార్లు చెప్తూ సినిమా ఆగిపోయిందని ప్రచారం చేశారు. అయితే ఈ రూమర్స్ పై దర్శకుడు లింగుసామి క్లారిటీ ఇచ్చాడు. బన్నీతో తాను చేస్తున్న ప్రాజెక్ట్ ఆగిపోలేదని.. ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ కారణం గా ఈ సినిమా కాస్త ఆలస్యంగా ప్రారంభమవుతుందని ప్రకటించాడు. ప్రస్తుతం డీజే షూటింగ్ లో బిజీగా ఉన్న బన్నీ ఆ తరువాత రచయిత వక్కంతం వంశీని దర్శకుడి పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న సినిమాకు ఓకె చెప్పాడు. ఈ గ్యాప్ లో లింగుసామి కూడా విశాల్ హీరోగా పందెం కోడి 2 సినిమాను పూర్తి చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. -
‘సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని’
-
'డీజే' టీజర్‌కు ముహుర్తం ఫిక్స్
సరైనోడు సినిమాతో బాక్లబస్టర్ సక్సెస్ సాధించిన అల్లు అర్జున్ త్వరలో డీజే దువ్వాడ జగన్నాథమ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కామెడీ యాక్షన్ సినిమాలను తెరకెక్కించే హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. చాలా కాలం తరువాత దిల్ రాజు తన సొంత నిర్మాణ సంస్థలో భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిస్తుండటంతో డీజేపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అందుకు తగ్గట్టుగా ఇటీవల విడుదలైన డీజే ఫస్ట్ లుక్కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ బ్రాహ్మణుడి పాత్రలో కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్‌తో ఆకట్టుకున్న డీజే టీం, త్వరలో టీజర్‌తో ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 24 ఉదయం 9 గంటలకు డీజే టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కొత్త ఉంటుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
స్పీడు పెంచుతున్న దిల్ రాజు
ఈ మధ్య కాస్త బ్రేక్ తీసుకున్న స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మళ్లీ స్పీడు పెంచుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలను రిలీజ్ చేసిన దిల్ రాజు, ప్రతీ నెలా ఒక సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. జనవరిలో శతమానంభవతి, ఫిబ్రవరిలో నేనులోకల్ సినిమాలను రిలీజ్ చేసిన రాజు, మార్చిలో వెల్లిపోమాకే, ఏప్రిల్ లో చెలియా సినిమాల రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాడు. మే నెలలో భారీ బడ్జెట్ తో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న డీజే దువ్వాడ జగన్నాథమ్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాడు. వీటితో పాటు ఇప్పటికే రవితేజ, రాజ్ తరుణ్ లు హీరోలుగా సినిమాలు ప్రారంభించిన దిల్ రాజు, సూపర్ స్టార్ మహేష్ బాబుతోనూ ఓ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. నిర్మాతగానే కాక, డిస్ట్రిబ్యూటర్ గానూ మరిన్ని చిత్రాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. -
స్కూటర్ మీదొచ్చిన జగన్నాథమ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ప్రారంభమైన రోజే ఈ సినిమా టైటిల్‌ను డీజే దువ్వాడ జగన్నాథమ్‌గా ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాలో బన్నీ బ్రాహ్మణుడి పాత్రలో కనిపిస్తున్నాడన్న వార్త బయటికి రావటంతో స్టైలిష్ స్టార్ అభిమానులు బన్నీ లుక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ శనివారం రిలీజ్ అయ్యింది. ఎప్పుడు స్టైలిష్‌గా కనిపించే బన్నీ, ఈ సారి సాంప్రదాయబద్ధంగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నుదుటి మీద నామాలతో పాత కాలం స్కూటర్ నడుపుతూ కూరగాయలు తీసుకెళ్తున్న బన్నీ లుక్కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. సరైనోడు సినిమాతో మాస్ యాక్షన్ హీరోగా రికార్డ్లను తిరగరాసిన అల్లు అర్జున్, ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్లో మాత్రం ఒక్క క్యారెక్టర్‌కు సంబంధించిన లుక్‌ను మాత్రమే రివీల్ చేశారు. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. -
నిర్మాతగా మారుతున్న యువ దర్శకుడు
టాలీవుడ్ దర్శకులు నిర్మాణ రంగం మీద దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న దర్శకులలో చాలా మంది నిర్మాతలుగా మారిపోగా, తాజాగా ఈ లిస్ట్‌లో మరో యువ దర్శకుడు చేరబోతున్నాడు. గబ్బర్‌సింగ్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న హరీష్ శంకర్ త్వరలో తన సొంతం నిర్మాణ సంస్థలో సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న హరీష్, ఆ సినిమా తరువాత, తన ఫ్రెండ్ కృష్ణతో కలిసి స్వీయ దర్శకత్వంలో ఓ బాలీవుడ్ రీమేక్‌ను తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నాడు. బాలీవుడ్ మంచి విజయం సాధించిన స్పెషల్ 26 సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు హరీష్. చాలా రోజులుగా ఈ సినిమా రీమేక్‌పై ప్రచారం జరుగుతున్నా ఇంత వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. ఇటీవల తమిళ నటుడు, దర్శకుడు త్యాగరాజన్ ఈ సినిమాను రీమేక్ చేస్తున్నాడంటూ వార్తలు వచ్చినా తెలుగులో మాత్రం మొదలు కాలేదు. మరి హరీష్ శంకర్ అయినా మొదలు పెడతాడో లేదో చూడాలి.