నిర్మాతగా మారుతున్న యువ దర్శకుడు | Harish Shankar To Produce and Direct Special 26 telugu Remake | Sakshi
Sakshi News home page

నిర్మాతగా మారుతున్న యువ దర్శకుడు

Published Tue, Sep 13 2016 1:25 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM

నిర్మాతగా మారుతున్న యువ దర్శకుడు

నిర్మాతగా మారుతున్న యువ దర్శకుడు

టాలీవుడ్ దర్శకులు నిర్మాణ రంగం మీద దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న దర్శకులలో చాలా మంది నిర్మాతలుగా మారిపోగా, తాజాగా ఈ లిస్ట్లో మరో యువ దర్శకుడు చేరబోతున్నాడు. గబ్బర్సింగ్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న హరీష్ శంకర్ త్వరలో తన సొంతం నిర్మాణ సంస్థలో సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు.

ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న హరీష్, ఆ సినిమా తరువాత, తన ఫ్రెండ్ కృష్ణతో కలిసి స్వీయ దర్శకత్వంలో ఓ బాలీవుడ్ రీమేక్ను తెరకెక్కించే ప్లాన్లో ఉన్నాడు. బాలీవుడ్ మంచి విజయం సాధించిన స్పెషల్ 26 సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు హరీష్.

చాలా రోజులుగా ఈ సినిమా రీమేక్పై ప్రచారం జరుగుతున్నా ఇంత వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. ఇటీవల తమిళ నటుడు, దర్శకుడు త్యాగరాజన్ ఈ సినిమాను రీమేక్ చేస్తున్నాడంటూ వార్తలు వచ్చినా తెలుగులో మాత్రం మొదలు కాలేదు. మరి హరీష్ శంకర్ అయినా మొదలు పెడతాడో లేదో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement