Special 26
-
సినిమా ప్రేరణతో.. భారీ చోరి
న్యూఢిల్లీ : బాలీవుడ్ సినిమా ‘స్పెషల్ చబ్బీస్’ ప్రేరణతో ఐటీ అధికారులుగా నమ్మబలికి. దాదాపు 48 లక్షల రూపాయల డబ్బును దోచుకెళ్లిన సంఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాలు.. రాజౌరీ గార్డెన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఇంట్లో లెక్కలో చూపించని సొమ్ము పెద్ద మొత్తంలో ఉందని తెలుసుకున్న నలుగురు వ్యక్తులు దాన్ని కాజేయాలని భావించారు. అందుకోసం ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారులమని చెప్పి.. నకిలీ గుర్తింపు కార్డులు చూపించి.. ఆ ఇంటిలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో దాదాపు రూ.48 లక్షల సొమ్మును సీజ్ చేస్తున్నట్లు చెప్పి దోచుకెళ్లారు. డబ్బును సీజ్ చేసినట్లు మెమో జారీ చేయడమే కాక.. రెండు రోజుల్లో ఇన్‌కమ్‌ట్యాక్స్ ఆఫీస్‌కు వచ్చి సరైన ఆధారాలు చూపించి సొమ్ము తీసుకెళ్లాల్సిందిగా తెలిపారు. దాంతో పాటు ఇంటికి సంబందించిన సీసీటీవీ కెమరా రికార్డింగ్స్‌ను కూడా నిందితులు తమతో పాటు తీసుకెళ్లారు. తదుపరి విచారణలో ఈ రికార్డింగ్స్ పనికొస్తాయని తెలిపారు. దాంతో బాధితులు ఇన్‌కమ్‌ట్యాక్స్ కార్యాలయానికి వెళ్లి జరిగింది చెప్పగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తమ కార్యలయానికి చెందిన అధికారులు ఎవరూ సదరు ప్రాంతంలో ఎలాంటి దాడులు చేయలేదని అధికారులు పేర్కొన్నారు. మోసపోయినట్లు తెలుసుకున్న బాధితులు పోలీసస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు సదరు ప్రాంతం సీసీటీవీ కెమరా ఫుటేజ్‌ని పరిశీలించగా.. కారులోంచి ఓ నలుగురు వ్యక్తులు దిగడం.. బాధితుల ఇంటికి వెళ్లడం వంటి అంశాలు రికార్డయ్యాయి. వీటి ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు వారిలో ఇద్దరిని అరెస్ట్ చేసి రూ. 22.45లక్షల సొమ్మును రికవరీ చేసుకున్నారు. మిగతా ఇద్దరి నిందితుల కోసం గాలిస్తున్నారు. -
రీమేకే గాని.. కొత్తగా తీశాం..!
కోలీవుడ్ టాప్ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గ్యాంగ్. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ సమయంలో ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా స్పెషల్ 26కు రీమేక్ అన్న ప్రచారం జరిగింది. అయితే ఇటీవల ప్రచార కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఎక్కడా.. రీమేక్ అన్న విషయం ప్రస్తావించకపోవటంపై చర్చ మొదలైంది. ఈ విషయంపై స్పందించిన చిత్ర దర్శకుడు విఘ్నేష్ శివన్.. గ్యాంగ్ కథపై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను స్పెషల్ 26 రీమేక్ రూపొదించినప్పటికీ పూర్తిగా కొత్త టేకింగ్ తో తెరకెక్కించామని.. సినిమా చూసిన వారికి ఎక్కడా ఇది స్పెషల్ 26 కు రీమేక్ అన్న భావన కలగదని తెలిపారు. అందుకే రీమేక్ అన్న విషయాన్ని ప్రచారం చేయటం లేదన్నారు. అయితే స్పెషల్ 26 రీమేక్ హక్కులు తీసుకునే ఈ సినిమాను రూపొందించామని క్లారిటీ ఇచ్చారు. -
నిర్మాతగా మారుతున్న యువ దర్శకుడు
టాలీవుడ్ దర్శకులు నిర్మాణ రంగం మీద దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న దర్శకులలో చాలా మంది నిర్మాతలుగా మారిపోగా, తాజాగా ఈ లిస్ట్‌లో మరో యువ దర్శకుడు చేరబోతున్నాడు. గబ్బర్‌సింగ్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న హరీష్ శంకర్ త్వరలో తన సొంతం నిర్మాణ సంస్థలో సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న హరీష్, ఆ సినిమా తరువాత, తన ఫ్రెండ్ కృష్ణతో కలిసి స్వీయ దర్శకత్వంలో ఓ బాలీవుడ్ రీమేక్‌ను తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నాడు. బాలీవుడ్ మంచి విజయం సాధించిన స్పెషల్ 26 సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు హరీష్. చాలా రోజులుగా ఈ సినిమా రీమేక్‌పై ప్రచారం జరుగుతున్నా ఇంత వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. ఇటీవల తమిళ నటుడు, దర్శకుడు త్యాగరాజన్ ఈ సినిమాను రీమేక్ చేస్తున్నాడంటూ వార్తలు వచ్చినా తెలుగులో మాత్రం మొదలు కాలేదు. మరి హరీష్ శంకర్ అయినా మొదలు పెడతాడో లేదో చూడాలి. -
ప్రశాంత్ హీరోగా స్పెషల్ 26
చార్మింగ్ హీరో ప్రశాంత్ స్పెషల్ 26 చిత్రానికి సిద్ధమతున్నారు. ప్రస్తుతం ఈయన సాహసం అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఆస్ట్రేలియా బ్యూటీ అమండా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. హిందీలో అక్షయ్‌కుమార్, కాజల్‌అగర్వాల్ జంటగా నటించిన చిత్రం స్పెషల్ 26. సంచలన విజయాన్ని సాధించిన ఈ చిత్ర దక్షిణాది భాషల రీమేక్ హక్కుల్ని ప్రముఖ సీనియర్ నటుడు, దర్శక నిర్మాత త్యాగరాజన్ గట్టి పోటీ మధ్య దక్కించుకున్నారు. ఇప్పుడాయన ఆ చిత్రాన్ని నటుడు ప్రశాంత్ కథానాయకుడిగా తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం నాలుగు భాషల్లో నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. తమిళంలో ఇరుబదుఆరు పేరును ఖరారు చేశారు. ఒక ప్రముఖ నటి హీరోయిన్గా నటించనున్న ఇందులో సత్యరాజ్, ప్రకాశ్‌రాజ్, నాజర్,తంబిరామయ్య, అభిశరణ్య, రోబోశంకర్, జైఆనంద్, బీసెంట్‌నగర్ రవి, దేవదర్శిని, ముఖ్య పాత్రలు పోషించనున్నారు. గౌరవ పాత్రల్లో నటి దేవయాని, సిమ్రాన్ నటించనుండగా, ఒక ప్రత్యేక పాటలో బాలీవుడ్ భామ జాక్కులిన్ ఫెర్ణాండ్స్ నర్తించనున్నట్లు చిత్రానికి కథనం, సంభాషణలు అందించి నిర్మించనున్న త్యాగరాజన్ వెల్లడించారు. ఢిల్లీ,కోల్‌కతా, ముంబై, చెన్నై ప్రాంతాల్లో త్వరలో చిత్రీకరణ జరపనున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదలకు ప్రణాళకను సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇరుడదు ఆరు చిత్రం తమిళచిత్ర పరిశ్రమకు కొత్తగా ఉంటుందని త్యాగరాజన్ అన్నారు. -
స్పెషల్ 26...
రవితేజ తొలిసారిగా ఓ హిందీ సినిమా రీమేక్‌లో నటించడానికి పచ్చజెండా ఊపినట్టుగా తెలిసింది. ఆ చిత్రం పేరు ‘స్పెషల్ 26’. అక్షయ్‌కుమార్ కెరీర్లో మంచి హిట్‌గా నిలిచిపోయిన సినిమా అది. విభిన్న కథాంశంతో రూపొందిన ఆ చిత్రం దక్షిణాది రీమేక్ హక్కులను సీనియర్ నటుడు, దర్శక నిర్మాత త్యాగరాజన్ దక్కించుకున్నారు. తెలుగులో ఆ చిత్రానికి ఎవరు సరిపోతారా అని ఆలోచిస్తే, త్యాగరాజన్‌కు తొలుత తట్టిన పేరు రవితేజ. అక్షయ్‌కుమార్, రవితేజల శారీరక భాష దాదాపు ఒకే రీతిలో ఉంటుంది. ఇద్దరూ మాస్ ఎంటర్టైనర్లు చేయడంలో సిద్ధహస్తులు. ఈ నేపథ్యంలో త్యాగరాజన్, రవితేజను సంప్రదిస్తే ఆయన కూడా ఓకే చెప్పారని సమాచారం. రవితేజకు రీమేక్స్ చేయడం కొత్త కాదు కానీ, హిందీ రీమేక్ చేయడం మాత్రం ఇదే ప్రథమం. రవితేజ ఇమేజ్‌కి అనుగుణంగా తెలుగు చిత్రంలో పలు వాణిజ్య అంశాలను జోడించనున్నారట. రవితేజ ప్రస్తుతం ‘కిక్-2’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ‘బెంగాల్ టైగర్’ ఆరంభమవుతుంది. ఆ తర్వాత ‘స్పెషల్ 26’ సెట్స్ మీదికి వెళ్తుందని సమాచారం. -
అక్షయ్‌కుమార్ పాత్రలోవిక్రమ్...
పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం అంత సులువు కాదు. ముఖ్యంగా శారీరక, మానసిక వైకల్యం ఉన్న పాత్రల్లో ఒదిగిపోవడం చాలా కష్టం. కానీ, విక్రమ్‌లాంటి నటులు సునాయాసంగా చేసేస్తారు. తమిళ ‘కాశి’ సినిమాలో గుడ్డివాడిగా, ‘సేతు’లో మానసిక ఎదుగుదల లేని వ్యక్తిగా, ‘అపరిచితుడు’లో మూడు రకాల పాత్రల్లో.. ఇలా విక్రమ్ పలు వైవిధ్యమైన పాత్రలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఐ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో పలు రకాల లుక్స్‌లో కనిపిస్తారట విక్రమ్. ఓ గెటప్ కోసం అయితే బాగా సన్నబడ్డారు కూడా. ఈ సినిమా పూర్తి కావచ్చిన నేపథ్యంలో విక్రమ్ తదుపరి చిత్రాలు అంగీకరించే పని మీద ఉన్నారట. వాటిలో హిందీ చిత్రం ‘స్పెషల్ 26’ కూడా ఉంది. ఈ చిత్రం తమిళ రీమేక్ హక్కులను తిరుపతి బ్రదర్స్ పొందారు. ముందుగా ఈ సినిమాని కమల్‌హాసన్‌తో చేయాలనుకుంటున్నారనే వార్త వచ్చింది. అది నిజం కాలేదు. ప్రస్తుతం విక్రమ్‌తో చేయాలనుకుంటున్నారట. హిందీలో ఈ పాత్రను అక్షయ్‌కుమార్ చేశారు. అలాగే, అనుపమ్ ఖేర్ పోషించిన పాత్రకు సత్యరాజ్‌ని తీసుకున్నారని సమాచారం.