స్పెషల్ 26... | Raviteja interested in remake of “Special 26” | Sakshi
Sakshi News home page

స్పెషల్ 26...

Published Mon, Nov 17 2014 11:37 PM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM

స్పెషల్ 26...

స్పెషల్ 26...

 రవితేజ తొలిసారిగా ఓ హిందీ సినిమా రీమేక్‌లో నటించడానికి పచ్చజెండా ఊపినట్టుగా తెలిసింది. ఆ చిత్రం పేరు ‘స్పెషల్ 26’. అక్షయ్‌కుమార్ కెరీర్‌లో మంచి హిట్‌గా నిలిచిపోయిన సినిమా అది. విభిన్న కథాంశంతో రూపొందిన ఆ చిత్రం దక్షిణాది రీమేక్ హక్కులను సీనియర్ నటుడు, దర్శక నిర్మాత త్యాగరాజన్ దక్కించుకున్నారు. తెలుగులో ఆ చిత్రానికి ఎవరు సరిపోతారా అని ఆలోచిస్తే, త్యాగరాజన్‌కు తొలుత తట్టిన పేరు రవితేజ. అక్షయ్‌కుమార్, రవితేజల శారీరక భాష దాదాపు ఒకే రీతిలో ఉంటుంది.
 
 ఇద్దరూ మాస్ ఎంటర్‌టైనర్లు చేయడంలో సిద్ధహస్తులు. ఈ నేపథ్యంలో త్యాగరాజన్, రవితేజను సంప్రదిస్తే ఆయన కూడా ఓకే చెప్పారని సమాచారం. రవితేజకు రీమేక్స్ చేయడం కొత్త కాదు కానీ, హిందీ రీమేక్ చేయడం మాత్రం ఇదే ప్రథమం. రవితేజ ఇమేజ్‌కి అనుగుణంగా తెలుగు చిత్రంలో పలు వాణిజ్య అంశాలను జోడించనున్నారట. రవితేజ ప్రస్తుతం ‘కిక్-2’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ‘బెంగాల్ టైగర్’ ఆరంభమవుతుంది. ఆ తర్వాత ‘స్పెషల్ 26’ సెట్స్ మీదికి వెళ్తుందని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement