ప్రశాంత్ హీరోగా స్పెషల్ 26 | Prashant's Special 26 | Sakshi
Sakshi News home page

ప్రశాంత్ హీరోగా స్పెషల్ 26

Published Fri, Dec 25 2015 2:51 AM | Last Updated on Sun, Sep 3 2017 2:31 PM

ప్రశాంత్ హీరోగా స్పెషల్ 26

ప్రశాంత్ హీరోగా స్పెషల్ 26

చార్మింగ్ హీరో ప్రశాంత్ స్పెషల్ 26 చిత్రానికి సిద్ధమతున్నారు. ప్రస్తుతం ఈయన సాహసం అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఆస్ట్రేలియా బ్యూటీ అమండా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. హిందీలో అక్షయ్‌కుమార్, కాజల్‌అగర్వాల్ జంటగా నటించిన చిత్రం స్పెషల్ 26.
 
 సంచలన విజయాన్ని సాధించిన ఈ చిత్ర దక్షిణాది భాషల రీమేక్ హక్కుల్ని ప్రముఖ సీనియర్ నటుడు, దర్శక నిర్మాత త్యాగరాజన్ గట్టి పోటీ మధ్య దక్కించుకున్నారు. ఇప్పుడాయన ఆ చిత్రాన్ని నటుడు ప్రశాంత్ కథానాయకుడిగా తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం  నాలుగు భాషల్లో నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. తమిళంలో ఇరుబదుఆరు పేరును ఖరారు చేశారు.
 
  ఒక ప్రముఖ నటి హీరోయిన్‌గా నటించనున్న ఇందులో సత్యరాజ్, ప్రకాశ్‌రాజ్, నాజర్,తంబిరామయ్య, అభిశరణ్య, రోబోశంకర్, జైఆనంద్, బీసెంట్‌నగర్ రవి, దేవదర్శిని, ముఖ్య పాత్రలు పోషించనున్నారు. గౌరవ పాత్రల్లో నటి దేవయాని, సిమ్రాన్ నటించనుండగా, ఒక ప్రత్యేక పాటలో బాలీవుడ్ భామ జాక్కులిన్ ఫెర్ణాండ్స్ నర్తించనున్నట్లు చిత్రానికి కథనం, సంభాషణలు అందించి నిర్మించనున్న త్యాగరాజన్ వెల్లడించారు. ఢిల్లీ,కోల్‌కతా, ముంబై, చెన్నై ప్రాంతాల్లో త్వరలో చిత్రీకరణ జరపనున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదలకు ప్రణాళకను సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇరుడదు ఆరు చిత్రం తమిళచిత్ర పరిశ్రమకు కొత్తగా ఉంటుందని త్యాగరాజన్ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement