Hero Prashant
-
ఈ రీమేక్‌లో టబు పాత్రలో ఐశ్వర్య.. కానీ!
బాలీవుడ్ సూపర్ హిట్ థ్రిల్లర్ చిత్రం ‘అంధధూన్’ తమిళ రీమేక్‌లో మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్లో అయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నట్లు సినీయర్ హీరో ప్రశాంత్ తండ్రి, నిర్మాత తియగరాజన్ తెలిపారు. ఈ రీమేక్‌లో ప్రధాన పాత్రలో ప్రశాంత్ నటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే బాలీవుడ్లో బ్లక్‌బస్టర్‌గా నిలిచిన ‘అంధధూన్’లో టబు కీలక పాత్ర పోషించారు. దీంతో తమిళ రిమేక్‌కు టబు పాత్రకు గాను ఐశ్వర్యరాయ్‌ను సంప్రదించినట్లు నిర్మాత తియగరాజన్ చెప్పారు. ఆయన ఓ జాతీయా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో టబు పాత్ర కోసం ఐశ్వర్యరాయ్‌తో చర్చలు జరుపుతున్నాం. అయితే ఇప్పటి వరకు తన నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఒకవేళ తను ఓకే చెబితే మాత్రం దాదాపు 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రశాంత్, ఐశ్వర్యలు కలిసి పని చేస్తారు’ అంటూ చెప్పకోచ్చారు. (చదవండి: నితిన్ రీమేక్ మూవీ: డైరెక్టర్..) 1998లో ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘జీన్స్’ సినిమాలో ప్రశాంత్, ఐశ్వర్యలు హీరో, హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బ్లక్‌బస్టర్‌గా నిలిచింది. ఇటీవల తెలుగులో వచ్చిన ‘వినయ విధేయ రామ’లో ప్రశాంత్ రామ్ చరణ్‌కు అన్నగా నటించిన విషయం తెలిసిందే. అయితే ‘అంధధూన్’ తమిళ రిమేక్‌లో మరో ముఖ్య పాత్రల కోసం ప్రముఖ నటుడు కార్తీక్, హాస్యనటుడు యోగిలను ఖరారు చేసినట్లు వార్తలు వచ్చినప్పటికి కార్తీక్ పాత్ర ఇంకా ఖరారు కాలేదు. ఈ సినిమా కోసం ప్రశాంత్ 23 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ 2018లో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో విడుదలైన ‘అంధధూన్’ చిత్రం బీ-టౌన్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో అంధుడిగా ఆయుష్మాన్ నటనకు విమర్శకు నుంచి ప్రశంసలు అందుకుంది. అంతేగాక తన పాత్రకు ఉత్తమ నటుడిగా కూడా ఎన్నికయ్యాడు. అలాగే తెలుగులో కూడా రీమేక్ కానున్న ‘అంధధూన్’లో హీరో నితిన్ నటిస్తున్నాడు. శ్రేష్ట్ మూవీస్ పతాకంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో తమన్నా, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. (చదవండి: 21 ఏళ్ల చిన్నవాడితో ప్రేమ.. అయితే ఏంటి?!) -
నేను పక్కా లోకల్!
‘‘ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగినా.. నేను తెలుగమ్మాయినే. ఈ సినిమాలో పక్కా లోకల్ అమ్మాయిగా నటించా’’ అన్నారు ప్రసన్న. ప్రశాంత్, సన్ని హీరోలుగా.. ప్రసన్న, అక్ఛిత హీరోయిన్లుగా శివశ్రీ దర్శకత్వంలో మళ్ల విజయప్రసాద్ నిర్మించిన ‘ఇంకేంటి నువ్వే చెప్పు’ ఈ నెల 31న రిలీజవుతోంది. ప్రసన్న మాట్లాడుతూ – ‘‘మా అమ్మ హైదరాబాదీ, నాన్న ఆస్ట్రేలియన్. రెండేళ్లకోసారి హైదరాబాద్ వచ్చి వెళ్తుంటాను. నాలుగేళ్లు భరతనాట్యం నేర్చుకున్నా. ఓ తెలుగు అసోసియేషన్ ఫంక్షన్లో నన్ను చూసిన హీరో ప్రశాంత్ ఫ్యామిలీ దర్శక–నిర్మాతలకు నా పేరు సూచించారు. అప్పటికి హీరోయిన్ పాత్ర కోసం సుమారు 200 మందిని ఆడిషన్ చేశారట! ఇందులో నేను చేసిన నీలు పాత్ర ‘బొమ్మరిల్లు’లో జెనీలియా తరహాలో ఉంటుంది. అందుకని ఆడిషన్స్ టైమ్‌లో నన్ను ‘బొమ్మరిల్లు’లో సీన్ చేసి చూపించమన్నారు. ఆ తర్వాతే సెలక్ట్ చేశారు. సినిమా షూటింగ్ అంతా విశాఖలో చేశారు. తెలుగు డైలాగులు చెప్పడంలో ప్రశాంత్, అతని సిస్టర్ నాకు బాగా హెల్ప్ చేశారు. మంచి ప్రేమకథా చిత్రమిది. నటిగా నాకు పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నా. నాకు చిన్న ఎన్టీఆర్ యాక్టింగ్, డ్యాన్స్ అంటే ఇష్టం. ‘నాన్నకు ప్రేమతో’లో డిఫరెంట్‌గా చేశారు. నాగార్జునగారన్నా ఇష్టమే’’ అన్నారు. -
ప్రశాంత్ హీరోగా స్పెషల్ 26
చార్మింగ్ హీరో ప్రశాంత్ స్పెషల్ 26 చిత్రానికి సిద్ధమతున్నారు. ప్రస్తుతం ఈయన సాహసం అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఆస్ట్రేలియా బ్యూటీ అమండా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. హిందీలో అక్షయ్‌కుమార్, కాజల్‌అగర్వాల్ జంటగా నటించిన చిత్రం స్పెషల్ 26. సంచలన విజయాన్ని సాధించిన ఈ చిత్ర దక్షిణాది భాషల రీమేక్ హక్కుల్ని ప్రముఖ సీనియర్ నటుడు, దర్శక నిర్మాత త్యాగరాజన్ గట్టి పోటీ మధ్య దక్కించుకున్నారు. ఇప్పుడాయన ఆ చిత్రాన్ని నటుడు ప్రశాంత్ కథానాయకుడిగా తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం నాలుగు భాషల్లో నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. తమిళంలో ఇరుబదుఆరు పేరును ఖరారు చేశారు. ఒక ప్రముఖ నటి హీరోయిన్గా నటించనున్న ఇందులో సత్యరాజ్, ప్రకాశ్‌రాజ్, నాజర్,తంబిరామయ్య, అభిశరణ్య, రోబోశంకర్, జైఆనంద్, బీసెంట్‌నగర్ రవి, దేవదర్శిని, ముఖ్య పాత్రలు పోషించనున్నారు. గౌరవ పాత్రల్లో నటి దేవయాని, సిమ్రాన్ నటించనుండగా, ఒక ప్రత్యేక పాటలో బాలీవుడ్ భామ జాక్కులిన్ ఫెర్ణాండ్స్ నర్తించనున్నట్లు చిత్రానికి కథనం, సంభాషణలు అందించి నిర్మించనున్న త్యాగరాజన్ వెల్లడించారు. ఢిల్లీ,కోల్‌కతా, ముంబై, చెన్నై ప్రాంతాల్లో త్వరలో చిత్రీకరణ జరపనున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదలకు ప్రణాళకను సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇరుడదు ఆరు చిత్రం తమిళచిత్ర పరిశ్రమకు కొత్తగా ఉంటుందని త్యాగరాజన్ అన్నారు.