స్కూటర్ మీదొచ్చిన జగన్నాథమ్ | Allu arjun DJ duvvada Jagannatham First look | Sakshi
Sakshi News home page

స్కూటర్ మీదొచ్చిన జగన్నాథమ్

Published Sat, Feb 18 2017 10:08 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM

స్కూటర్ మీదొచ్చిన జగన్నాథమ్

స్కూటర్ మీదొచ్చిన జగన్నాథమ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ప్రారంభమైన రోజే ఈ సినిమా టైటిల్ను డీజే దువ్వాడ జగన్నాథమ్గా ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాలో బన్నీ బ్రాహ్మణుడి పాత్రలో కనిపిస్తున్నాడన్న వార్త బయటికి రావటంతో స్టైలిష్ స్టార్ అభిమానులు బన్నీ లుక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ శనివారం రిలీజ్ అయ్యింది. ఎప్పుడు స్టైలిష్గా కనిపించే బన్నీ, ఈ సారి సాంప్రదాయబద్ధంగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నుదుటి మీద నామాలతో పాత కాలం స్కూటర్ నడుపుతూ కూరగాయలు తీసుకెళ్తున్న బన్నీ లుక్కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

సరైనోడు సినిమాతో మాస్ యాక్షన్ హీరోగా రికార్డ్లను తిరగరాసిన అల్లు అర్జున్, ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్లో మాత్రం ఒక్క క్యారెక్టర్కు సంబంధించిన లుక్ను మాత్రమే రివీల్ చేశారు. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement