బన్నీ సినిమా ఆగిపోలేదు.. కాస్త లేట్ అంతే..! | Lingu saamy Clarity on Project with Allu Arjun | Sakshi
Sakshi News home page

బన్నీ సినిమా ఆగిపోలేదు.. కాస్త లేట్ అంతే..!

Published Sat, Feb 25 2017 10:09 AM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM

బన్నీ సినిమా ఆగిపోలేదు.. కాస్త లేట్ అంతే..!

బన్నీ సినిమా ఆగిపోలేదు.. కాస్త లేట్ అంతే..!

సరైనోడు సినిమా తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్.. తరువాత రెండు సినిమాలను వెంట వెంటనే ప్రారంభించాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే దువ్వాడ జగన్నాథమ్ తో పాటు.. తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో తెలుగు తమిళ బాషల్లో ఓ యాక్షన్ సినిమాను ప్లాన్ చేశాడు. ఈ సినిమా కూడా లాంఛనంగా ప్రారంభమైంది. అయితే కొద్ది రోజులుగా బన్నీ లింగుసామి దర్శకత్వంలో నటించాల్సిన సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది.

కథ కుదరలేదని కొన్ని సార్లు, బన్నీ రెమ్యూనరేషన్ సెట్ కాలేదని కొన్ని సార్లు చెప్తూ సినిమా ఆగిపోయిందని ప్రచారం చేశారు. అయితే ఈ రూమర్స్ పై దర్శకుడు లింగుసామి క్లారిటీ ఇచ్చాడు. బన్నీతో తాను చేస్తున్న ప్రాజెక్ట్ ఆగిపోలేదని.. ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ కారణం గా ఈ సినిమా కాస్త ఆలస్యంగా ప్రారంభమవుతుందని ప్రకటించాడు. ప్రస్తుతం డీజే షూటింగ్ లో బిజీగా ఉన్న బన్నీ ఆ తరువాత రచయిత వక్కంతం వంశీని దర్శకుడి పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న సినిమాకు ఓకె చెప్పాడు. ఈ గ్యాప్ లో లింగుసామి కూడా విశాల్ హీరోగా పందెం కోడి 2 సినిమాను పూర్తి చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement