భరత్ అనే నేను సినిమాతో ఘనవిజయం సాధించిన దర్శకుడు కొరటాల శివకు సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. దర్శకుడిగా నాలుగు వరుస విజయాలు అందుకొని స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో చేరిపోయిన కొరటాల త్వరలో నిర్మాతగా మారనున్నారట. అయితే నిర్మాణ సంస్థను ఎప్పుడు స్థాపించేది మాత్రం తెలియాల్సి ఉంది.
చాలా కథలు నచ్చినా సమయం సరిపోని కారణంగా ఆ చిత్రాలను తాను డైరెక్ట్ చేయలేకపోతున్నానని, అందుకే నిర్మాతగా మారి యువ దర్శకులకు అవకాశాలివ్వాలని కొరటాల భావిస్తున్నారు. భరత్ అనే నేను తరువాత కొరటాల తన తదుపరి చిత్రాన్ని ఇంతవరకు ప్రకటించలేదు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక్క అల్లు అర్జున్ తప్ప స్టార్ హీరోలెవరు ఖాలీగా లేకపోవటంతో బన్నీతోనే కొరటాల శివ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment