
ఆలయం వద్ద గల్లా జయదేవ్, మహేశ్‌బాబు, కొరటాల శివ, ఆదిశేషగిరిరావు
సాక్షి, తిరుమల: సినీ హీరో మహేశ్‌బాబు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ‘భరత్ అనే నేను’చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్నానని, ఈ సమయంలో స్వామి వారిని దర్శించుకోవడం మరింత ఆనందం కలిగించిందని అన్నారు.
తన జీవితంలో ఇది చాలా ఆనందకరమైన రోజు అని చెప్పారు. చిత్ర దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ.. ‘భరత్ అనే నేను’చిత్రం భారీ విజయం సాధించటంతో శ్రీవారికి మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చామన్నారు. వారి వెంట వైఎస్సార్‌సీపీ నేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ఎంపీ గల్లా జయదేవ్ ఉన్నారు.