సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల్లో వందకోట్ల గ్రాస్ సాధించిన ఈ సినిమా ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చూడాలనుకుంటున్నారన్న వార్త ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
త్వరలో పొలిటికల్ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్న రజనీ.. భరత్ అనే నేను సినిమా చూడాలనుకుంటున్నారట. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సీఎంగా మహేష్ తీసుకున్న నిర్ణయాలు ఆలోచింపచేసేవిగా ఉండటంతో పాటు ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులను ప్రతిభింబించేవిగా ఉండటంతో రజనీ ఈ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాను తమిళ్ లో రీమేక్ చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment