ప్లీజ్.. నా దారికి అడ్డురావద్దు: రజనీ | Please do not stop and disturb, says Rajinikanth | Sakshi
Sakshi News home page

నా దారికి అడ్డురావద్దు: రజనీ

Published Sat, May 27 2017 10:03 PM | Last Updated on Mon, Sep 17 2018 4:56 PM

ప్లీజ్.. నా దారికి అడ్డురావద్దు: రజనీ - Sakshi

ప్లీజ్.. నా దారికి అడ్డురావద్దు: రజనీ

చెన్నై/ముంబై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై కొంత కాలంగా అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రవేశంపై ఇప్పటికే అభిమానులు, సన్నిహితులతో చర్చలు జరిపిన రజనీకాంత్‌ జులైలో పార్టీని ప్రకటిస్తారని ఆయన సోదరుడు సత్యనారాయణరావు గైక్వాడ్‌ చెప్పడం తమిళనాడులో చర్చనీయాంశమైంది. బెంగళూరులో నివాసం ఉంటోన్న సత్యనారాయణ 'అవినీతిని అంతం చేయడానికే నా తమ్ముడు(రజనీ) రాజకీయాల్లోకి వస్తున్నాడు. అది చారిత్రక అవసరం కూడా' శుక్రవారం తెలిపారు. ఈ క్రమంలో శనివారం రజనీ ముంబయి బయలుదేరుతుండగా మీడియా ఆయనను మరోసారి రాజకీయ ప్రవేశంపై ప్రశ్నించింది. ఆ ప్రశ్నతో విసుకుచెందిన తలైవా.. మీ పని మీరు చేసుకుంటున్నారు కదా.. నన్ను ఎవరూ అడ్డుకోవద్దు.. దయచేసి నా పని నన్ను చేసుకోనివ్వండి అంటూ మరోసారి విషయాన్ని దాటవేశారు.

కాలా షూటింగ్ కోసం శనివారం చెన్నై నుంచి రజనీ ముంబయి వెళ్లారు. తన అల్లుడు ధనుష్ నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కాలా’  షూటింగ్‌ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. అయితే రజనీని ముంబైలోనూ రాజకీయ ప్రవేశంపై స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా రాజకీయాల్లోకి వచ్చే విషయమై ఆయనను ప్రశ్నించగా, అందుకు ఇది సమయం కాదు.. 'సమయం వచ్చినప్పుడు నేనే చెబుతా. ఇప్పటికీ ఏ నిర్ణయం తీసుకోలేదు' అంటూ మరోసారి రజనీ సమాధానం దాటవేశారు. పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్లు అభిమానులలో నూతన ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement