సాక్షి, పెరంబూరు: నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ రానున్న శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా మూడవ రాజకీయ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఆయన సహ నటుడు రజనీకాంత్ త్వరలో రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనతో పొత్తు పెట్టుకుని 3వ ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: హీరో ధనుష్‌కి మధురై హైకోర్టు షాక్
ముందుగా నటుడు రజనీకాంత్ కథానాయకుడిగా తన నిర్మాణ సంస్థలో చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలను అధిగమించడం సాధ్యమేనా అన్న ప్రశ్నకు తమిళనాడును పునరుద్ధరించడానికి ఇద్దరం రాజకీయ ఆయుధంగా తయారై వస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తు న్నారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు సంబంధం లేని అవినీతి వ్యతిరేక పార్టీలతో కలిసి మూడో ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడానికి చర్చలు జరుగుతున్నాయని కమల్ చెబుతున్నారు. చదవండి: 24 గంటల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు మృతి
ఏక భావజాలం కలిగిన రజనీకాంత్ వంటి వారితోనూ కూటమి గురించి చర్చలు జరుగుతున్నాయన్నారు. రజనీకాంత్‌తో పొత్తు పెట్టుకుంటే మీలో ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారు? ఎవరి ఆధ్వర్యంలో కూటమి ఏర్పడుతుంది? అన్న ప్రశ్నకు ఎవరు ముఖ్యమంత్రి అయినా తమిళ ప్రజల మేలే ముఖ్యంమని, కూటమి ఏర్పడిన తరువాత నిర్ణ యం తీసుకుంటారని కమల్‌హాసన్ పేర్కొన్నారు. రజనీకాంత్ హీరోగా నిర్మించనున్న చిత్ర కథను త్వరలో తాను విననున్నట్లు కమల్ చెప్పడంతో వీరి కూటమి ఖాయం అని తెలుస్తోంది. చదవండి: శభాష్ మిత్రమా రజనీకాంత్: కమల్‌హాసన్
Comments
Please login to add a commentAdd a comment