సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన నటులు రజనీకాంత్, కమల్‌హాసన్‌లకు తమిళనాడులో కనీసం పది శాతం ప్రజాదరణ కూడా లేదని తేలింది. ఇటీవల చేపట్టిన తమ సర్వేలో ఈ విషయం వెల్లడైందని ప్రముఖ తమిళ న్యూస్ చానల్ ‘దినతంతి’ ప్రకటించింది. ఈ న్యూస్ చానల్ గ్రూపునకు చెందిన ‘మాలైమలర్’ పత్రిక సర్వే వివరాలను సోమవారం ప్రచురించింది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కన్నుమూసిన తరువాత కమల్, రజనీ రాజకీయ అరంగేట్రం చేశారు.
మక్కల్ నీది మయ్యం పేరుతో పార్టీని స్థాపించిన కమల్ రాష్ట్రంలో పర్యటిస్తుండగా రజనీ మాత్రం పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో ఉన్నారు. అయితే, వచ్చే ఏడాది ఎన్నికల నేపధ్యంలో రజనీ, కమల్ రాజకీయ ప్రవేశంపై ‘దినతంతి’ న్యూస్‌చానల్ ఇటీవల పుదుచ్చేరి, తమిళనాడుల్లో సర్వే జరిపింది. ఈ సర్వేలో.. కమల్, రజనీ రాజకీయాల్లో ఏమీ సాధించలేరని 51 శాతం మంది చెప్పగా, వారి రాజకీయ ప్రవేశంపై పది శాతం మంది కూడా సానుకూలంగా లేరని ఆ పత్రిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment