survey calculations
-
ఇండియా కూటమి ఎఫెక్ట్..! కన్ప్యూజన్లో ఎగ్జిట్ పోల్స్
సార్వత్రిక ఎన్నికల్లో ఆరు విడుతల పోలింగ్ పూర్తయ్యేసరికి ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. అసలు పోటీలో లేదనుకున్న ఇండియా కూటమి కొన్ని రాష్ట్రాల్లో గట్టిపోటీ ఇస్తోందనే వార్తలొస్తున్నాయి. దీంతో జూన్ ఒకటిన జోస్యం చెప్పబోయే ఎగ్జిట్ పోల్ సంస్థలు కన్ప్యూజన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ‘అబ్కీ బార్ చార్సౌ పార్’ నినాదంతో.. ఈసారి బీజేపీ ప్రచారంలో అందరికంటే ముందు నిలిచింది. మోదీ చరిష్మాతో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలనే పక్కా ప్రణాళికతో బీజేపీ ఎన్నికల ప్రచారం కొనసాగించింది. ఓ వైపు మోదీ మరోవైపు అమిత్ షా దేశాన్ని చుట్టేశారు. నాలుగు వందల సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే మొదటి రెండు విడతల పోలింగ్ ముగిసిన తరువాత ఇండియా కూటమి సైతం కాస్త పోటీపడినట్లు కనిపించింది. బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూటమి బలం పుంజుకుందనే వార్తలు వచ్చాయి. దీంతో ఎన్నికలు ఏకపక్షం కాదనే వాదనలు ప్రారంభమయ్యాయి. యూపీలో సైతం తాము చాలా సీట్లు గెలుస్తామని ఇండియా కూటమి ప్రకటించడంతో.. ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. ఎలక్షన్ చివరి అంకానికి చేరుకున్న నేపధ్యంలో ఎన్నికలు నువ్వా.. నేనా.. అన్నట్లు జరిగాయనే అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. దీంతో అసలు దేశంలో ఏం జరగబోతుందనే కొత్త చర్చ ప్రారంభం అయింది. చాలామంది ఎలక్షన్ పండితులు బీజేపీ సీట్లు తగ్గుతాయనే అభిప్రాయం చెబుతున్నా.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా అనే విషయంపై మాత్రం ఏ ఒక్కరూ కాన్ఫిడెంట్‌గా లేరు.400సీట్ల టార్గెట్‌తో రంగంలోకి దిగిన బీజేపీ.. నిజంగా తన లక్ష్యాన్ని సాధిస్తుందా అనే చర్చతో ఈ సారి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 2019లో సింగిల్‌గా 303సీట్లు సాధించిన బీజేపీ చరిత్రను తిరగరాసింది. ఇందిరాగాంధి మరణానంతంరం వచ్చిన సానుభూతితో 1984లో కాంగ్రెస్ పార్టీ 300 మార్కును దాటింది. ఆ తరువాత మళ్లీ ఏ పార్టీ కూడా సింగిల్‌గా 300మార్కు దాటలేదు. కూటమిగా ఎన్డీయే 2019లో ఏకంగా 353 స్థానాలు సాధించింది. ఇది నిజంగా భారీ రికార్డు. తన రికార్డునే తానే తిరగరాస్తానంటూ మోదీ 400 సీట్లు సాధిస్తామని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ కూటమి ప్రచారం కంటే ముందే కుదేలైపోయింది. బీజేపీ ట్రాప్‌లో పడిపోయిన ఇండియా కూటమి నాయకులు.. బీజేపీ 400 సాధించలేదంటూ ప్రకటనలు చేసేశారు. కాని బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడానికి 272 సీట్లు చాలన్న చిన్న లాజిక్‌ను కాంగ్రెస్ కూటమి మరిచిపోయింది. తప్పును ఆలస్యంగా తెలుసుకున్న ఇండియా కూటమి నాయకులు తరువాతి కాలంలో అసలు బీజేపి అధికారంలోకి రాలేదంటూ ప్రకటనలు చేయడం ప్రారంభించారు. అయితే అప్పటికే కీలకమైన రెండు విడతల పోలింగ్ పూర్తైపోయింది. ఈ రెండు విడతల్లో జాతీయ స్థాయిలో మోదీ ఉండాలా వద్దా అనే విషయంపై రెఫరెండంగా ఎన్నికలు జరిగినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అందుకే మొదటి రెండు విడతల్లో.. పోలింగ్ జరిగిన 190 స్థానాల్లో బీజేపీ హవా కొనసాగినట్లు పోల్ పండిట్లు అంచనా వేస్తున్నారు. మోదీ హాట్రిక్ నినాదంతో ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందే బీజేపీ గెలిచేసిందనే వాదనలు ప్రారంభమయ్యాయి. అయితే మూడు, నాలుగు విడతల పోలింగ్ జరిగే సరికి లోక్‌సభ ఎన్నికల్లో లోకల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ప్రభావితం చూపించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 40 స్థానాలున్న బీహార్‌లో తేజస్వీ యాదవ్ తన ప్రచారంలో ఎక్కువగా నిరుద్యోగం అంశాన్ని హైలైట్ చేశారు. 2019లో బీహార్‌లో ఎన్డీయే కూటమి 39 స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ కూటమి కొన్ని స్థానాలు గెలుస్తుందనే వార్తలు వస్తున్నాయి. యూపీలో అఖిలేష్ మీటింగ్‌లకు సైతం భారీగా జనం హాజరవడం ఎన్నికల సరళిపై కొత్త చర్చకు తెరలేపింది. 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో బీఎస్పీ ఈసారి తన ప్రాభవాన్ని కోల్పోతుందని.. దీనివల్ల లాభపడేది ఎవరనే దానిపై యూపీ రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయనేది విశ్లేషకుల అంచనా. ఇక యూపీ తరువాత అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో మరాఠా అస్మితా పేరుతో ఉద్ధవ్ ఠాక్రే తీసుకొచ్చిన ఆత్మగౌరవం నినాదంపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అటు కర్ణాటకలోనూ ప్రజ్వల్ రేవన్న అంశం బీజేపీ కూటమికి వ్యతిరేకంగా పనిచేసినట్లు తెలుస్తోంది. దీంతో మూడునాలుగు విడతల పోలింగ్ పూర్తయ్యేసరికి ఇండి కూటమి పోటీలోకి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ 400 సీట్ల నినాదం కేవలం ప్రతిపక్షాలను ట్రాప్ చేయడానికే అనేది స్పష్టమైపోయింది. అయితే బీజేపీ మాత్రం ఇప్పటికీ 400 సీట్లు సాధ్యమనే అంటోంది. 2019లో 353 సీట్లు సాధించిన ఎన్డీయే మరో 40 సీట్లు సాధించడం కష్టమేమి కాదని కొంతమంది ఎన్నికల విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షం బలహీనంగా ఉండటం వల్ల బీజేపీకి పోటీలేకుండా పోయిందని.. కొంతమంది పోల్స్టర్స్ విశ్లేషిస్తున్నారు. మోదీకి ప్రత్యామ్నాయం లేకపోవడం… విదేశీవిధానం, ఆర్ధిక పురోగతిలాంటి అంశాలు బీజేపీకి కలిసివచ్చే అంశాలనే వీరు వాదిస్తున్నారు. నాలుగు వందల సీట్లు సాధ్యమే అని… ఒకవేళ 400సాధ్యం కాకపోయినా… గతం కంటే బీజేపీ సీట్లు పెరుగుతాయని వీరు వాదిస్తున్నారు. ఇక బీజేపీ ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని… బీజేపీ సొంతంగా 300 సీట్లు గెలుస్తుందని సీఎస్డీఎస్ సంస్థకు చెందిన సంజీవ్ కుమార్ అంటున్నారు.అయితే బీజేపీ మిత్రపక్షాలు మాత్రం చాలా ఘోరంగా ఓడిపోతారని దీంతో నాలుగు వందల సీట్లు సాధ్యం కాదని సంజీవ్ అంచనా వేస్తున్నారు. రాక్ఫెల్లర్ ఇంటర్నేషనల్ చైర్మన్ రుచిర్ శర్మ ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ… ఈసారి పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉందని.. అయితే ఇప్పటికీ బీజేపీకే ఎక్కువ అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. అమెరికాలో స్థిరపడ్డ రుచిర్ శర్మ గత పాతికేళ్లుగా భారత ఎన్నికల సరళిపై అధ్యయనం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి కాస్త అనుకూలంగా వ్యవహరించే యోగేంద్రయాదవ్ లాంటి సెఫాలజిస్టులు కాస్త డిఫరెంట్ వాదన ముందుకు తెస్తున్నారు. ముఖ్యంగా యూపీ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్రలో బీజేపీదాని మిత్రపక్షాలు గతంతో పోలిస్తే 60 నుంచి 70స్థానాలు కోల్పోతారని యాదవ్ అంటున్నారు. బీజేపీ సొంతంగా 250 సీట్లకు పరిమిత అవుతుందని యోగేంద్రయాదవ్ బాంబు పేలుస్తున్నారు. ఇదే నిజం అయితే బీజేపీ కూటమి మద్దతు లేకుండా ప్రభుత్వం నడపలేదని స్పష్టం అవుతోంది. ఎన్నికల చివరి అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు.. ఎగ్జిట్ పోల్స్‌పై చాలా సర్వే సంస్థలు గుంభనంగా ఉన్నాయి. డేటాను విశ్లేషించడంలో తలమునకలైన కీలక సంస్థలన్నీ ఈ సారి ఎన్నికల సరళిపై ఎగ్జిగ్ పోల్స్ ఇవ్వడం అంత ఆశామాషీ కాదనే అభిప్రాయానికి వచ్చాయి. 2019లో కొంత ఈజీగా అనిపించిన ఎగ్జిట్ పోల్స్ ఈసారి మాత్రం కత్తిమీద సాము అని పొలిటికల్ పండిట్లు అంటున్నారు.:::: ఇస్మాయిల్, ఇన్పుట్ ఎడిటర్, సాక్షి -
'అనందంలో'.. ఫిన్‌ల్యాండ్ మొదటి స్థానం! మరి ఇండియా..??
"అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం.." అని ఎప్పుడో 70 ఏళ్ళ క్రితం సముద్రాల రామానుజాచార్య ఓ పాట రాశారు. ఆ గీతాన్ని అద్భుతంగా స్వరపరిచి, ఆలపించారు ఘంటసాల. ఇది 1973లో వచ్చిన 'బతుకుతెరువు' సినిమాలోనిది. పాట చివర్లో "జీవితమే ఒక నాటకరంగం" అంటారు. నాటకం వంటి జీవితంలో ప్రతి మనిషికి ఏదో ఒకరోజు తెరపడుతుంది. అది తప్పదు. పుట్టినప్పటి నుంచి పోయేంత వరకూ సాగే బతుకు నడుమ ఆనందాన్ని పోగుచేసుకొని అనుభవిస్తేనే ఆనందం. లేకపోతే, అంతా అయోమయం, విషాదం. ఈ జీవనసారాన్ని మన మహర్షులు, మహర్షుల వంటి మహాకవులు, మహనీయులు, మాననీయ మూర్తులు తెలుసుకున్నారు, మనసారా అనుభవించారు, ఆచరించండని మనకు అనేక రూపాల్లో, మార్గాల్లో చెప్పారు. మార్చి, 20 'అంతర్జాతీయ ఆనంద దినోత్సవం'. మనుషులంతా సంతోషంగా ఉండండి, అది అందరికీ పంచండి, అది ఎక్కుడుందో వెతికి పట్టుకోండి, పట్టుకొని వదలకండి.. అంటూ ఐక్యరాజ్య సమితి అంటోంది. సుమారు ఓ పుష్కరం క్రితం (2013) తొలిసారిగా, సమితిలోని సభ్యదేశాలన్నీ ఈ వేడుకను జరుపుకున్నాయి. అప్పటి నుంచి ప్రతి ఏడూ జరుపుకుంటున్నాయి. బుధవారం నాడు అందరం జరుపుకున్నాం. కానీ, అందరికీ ఈ ఉత్సవం గురించి పెద్దగా అవగాహన లేదు. ఆ స్థాయిలో ప్రచారం జరుగలేదు. మనదేశంలో ఎన్నికల వేడి మొదలైన నేపథ్యంలో.. మనం ఈ ఆనంద సంబరాన్ని సంపూర్ణంగా అనుభవించలేకపోయాం. ఈ అంతర్జాతీయ ఆనంద దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడూ కొన్ని నివేదికలు అందుతూ వుంటాయి. ఏ ఏ దేశాలలో సంతోష, ఆనందాల స్థాయి ఎట్లా వుందని కొలుస్తారు. ఆ కొలతలకు కొన్ని నియమాలు పెట్టుకున్నారు. ఈ నియమాల ప్రకారం నివేదిక ద్వారా మనకు అర్థమవుతున్నదేంటంటే? అనందంలో మనదేశం 126 వ స్థానంలో వుంది. మనకంటే ఎంతో పేద దేశాలు ముందు వరుసలో వున్నాయి. మన పొరుగు దేశాలైన చైనా, నేపాల్, పాకిస్తాన్, మయన్మార్ మనకంటే ఆనందంగా వున్నాయి. మొత్తం దేశాలలో ఫిన్ ల్యాండ్ అందరికంటే ఆనందమైన దేశంగా మొదటి స్థానంలో నిలిచింది. దాదాపు ఏడేళ్ల నుంచి ఫిన్ ల్యాండ్ తన అగ్రతను కాపాడుకుంటూ వస్తోంది. 60 వ ర్యాంక్ తో మనకంటే చైనా చాలా ఆనందంగా ఉన్నట్లు ఈ నివేదిక చెబుతోంది. క్షేత్రస్థాయిలో, నిజజీవితంలో వాస్తవాలు మనకు పూర్తిగా తెలియదు కానీ, ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపిన సంస్థ చెప్పే నివేదికలో మాత్రం విషయాలు అలాగే వున్నాయి. ప్రపంచ మానవాళికి శాంతిని, ఆనందమయ జీవితాన్ని చాటి చెప్పామని చెప్పుకుంటున్న మన దేశం ఈ సూచీలో వెనుకబడి పోవడం వివిధ ఆలోచనలను రేకెత్తిస్తోంది. అంతర్ముఖంగా మళ్ళీ అలోచించుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తోంది. ఏది ఆలోచిస్తే, ఏది చేస్తే, ఏది చూస్తే ఆనందం కలుగుతుందో? అవన్నీ మన మహర్షులు మనకు ఎన్నడో చెప్పేశారు. భగవద్గీత నుంచి సంగీతం వరకూ, ధ్యానం నుంచి యోగాభ్యాసం వరకూ, మౌనం నుంచి ఆధ్యాత్మిక సాధన వరకూ, శాంతి నుంచి స్థితప్రజ్ఞత వరకూ మనకు బోధించారు. వాటిని కొందరు ఆచరించారు, కొందరు ఆచరించే ప్రయత్నం చేస్తూనే వున్నారు. కొందరు ఇవ్వేమీ తెలియకుండానే సహజంగా ప్రవర్తిస్తూ వస్తున్నారు. మొత్తంగా చూస్తే ఎక్కువమంది ఆనందంగా లేరు. అసంతృప్తితో అలమటిస్తున్నారు, అయోమయంలో వున్నారు. ఐక్యరాజ్య సమితి పెట్టిన నియమాలను ఒకసారి వీక్షిద్దాం. ఆత్మతృప్తి, జీవనకాలం (లైఫ్ స్పాన్), సామాజిక మద్దతు, తలసరి ఆదాయం, దాతృత్వం, స్వేచ్ఛ, అవినీతి మొదలైన వాటిల్లో ఆయా దేశాలు, ఆయా దేశ ప్రజలు ఎలా వున్నారన్నది ప్రాతిపదికగా దేశాలకు ర్యాంకులను కేటాయించారు. అగ్రరాజ్యం అమెరికా, జర్మనీ వంటి దేశాలలో కూడా సంతోషం సన్నగిల్లుతోందని ఈ నివేదిక చెబుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే చిన్న దేశాలే ఎక్కువ ఆనందంగా వున్నాయి. "చిన్న కుటుంబం - చింతలులేని కుటుంబం " అన్న పాత సామెత గుర్తుకువస్తోంది. అనందాన్ని అనుభవించేవారి వయసుల్లోనూ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క తీరు నడుస్తోంది. పెద్ద వయస్సు వారికంటే చిన్నవాళ్లే ఆనందంగా ఉన్నారని నివేదికలు చెబుతున్నా, అన్నిచోట్లా అట్లా లేదు. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ వంటి దేశాల్లో యువత కంటే పెద్దలే ఎక్కువ ఆనందంగా వున్నారు. ఐరోపా వాసుల్లో ఆనందం కాస్త పెరుగుతున్నట్లు, పశ్చిమ యూరప్ లో అందరూ సమానమైన సంతోషకర వాతావరణంలో వున్నారని తెలుస్తోంది. ఒక్క ఐరోపా దేశాల్లో తప్ప మిగిలిన అన్ని దేశాలలోనూ ఆనందంలో అసమానతలు పెరిగిపోతూ ఉండడం బాధాకరం. అందులో మనదేశం కూడా వుండడం ఇంకా బాధాకరం. అందరి కంటే అత్యంత ఆనందంగా వున్న ఫిన్ ల్యాండ్ ప్రజలను గమనిస్తే వారి లక్షణాలు, ఆలోచనలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి, స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ప్రకృతితో ఎక్కువ మమేకమై ఉండడం, వృత్తిని - జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ, సమతుల్యత పాటిస్తూ సాగడం, విజయంపై స్పష్టమైన అవగాహన కలిగివుండడం, అవినీతి తక్కువగా ఉండడం, ప్రభుత్వాల పట్ల ఎక్కువ విశ్వాసం కలిగి వుండడం, ఆరోగ్యం, విద్య, సంరక్షణలో ప్రభుత్వం సక్రమంగా పరిపాలన, సేవలు అందించడం మొదలైనవి ఫిన్ ల్యాండ్ వారి ఆనందమయ జీవితానికి కారకాలుగా, ప్రేరకాలుగా కనిపిస్తున్నాయి. 'అంతర్జాతీయ ఆనంద దినోత్సవం' లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఎజెండా పెట్టుకుంటున్నాం. "అనందానికి తిరిగి దగ్గర కావడం - స్థితప్రజ్ఞత కలిగే, పెరిగే సమాజాలు నిర్మించుకోవడం" ఈ 2024 సంవత్సరానికి పెట్టుకున్నాం. ఇది సాధించడం పెద్ద కష్టమైన విషయం కాదు. ఆనందం ఎక్కడో లేదు, మనలోనే వుంది. మన ఆలోచనలలో వుంది, మన ఆచరణలో, నడవడికలో వుంది. రమణమహర్షి నుంచి రామానుజాచార్యులు (సముద్రాల) వరకూ, మహాత్మాగాంధీ నుంచి మార్క్ ట్వైన్ వరకూ, ఆదిశంకరాచార్యుల నుంచి అబ్రహం లింకన్ వరకూ, లియో టాల్ స్టాయ్ నుంచి జాన్ కీట్స్ వరకూ చెప్పింది ఒక్కటే! "ఆనందంగా ఉండండి, తోటివారిని అనందంగా ఉంచండి ". ఈ క్రమంలో, మనకు బోలెడు సారస్వతం వుంది, కళలు వున్నాయి, భగవద్గీత, మహాభారత రామాయణాది కావ్యాలు, ఇతిహాసాలు, వేదవేదాంగాలు అందించిన జ్ఞానభాండాగారం మన దేశానికి మెండుగా అండగా వుంది. పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి నిద్రలోకి జారుకొనేంత వరకూ ఏమేమి చెయ్యాలో, ఏమేమి చెయ్యకూడదో ఆచార్యులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు చెబుతూనే వున్నారు. ఆహారం, నిద్ర, వ్యాయామ నియమాలు, శాంతి, విశ్రాంతిని ఆచరించడం మన చేతుల్లోనే వుంది. ప్రతి మనిషి కోరుకొనేది ఒక్కటే.. ప్రతి క్షణం ఆనందంగా ఉండడం. అదే జీవిత మకరందం. ఈ ఆనంద సూచీలో మనం ఫిన్ ల్యాండ్ ను దాటి మొదటి స్థాయిని అందుకోవాలి. అందరూ అనందంగా ఉండాలని అనుకుందాం. — మా శర్మ, సీనియర్ జర్నలిస్టు -
సర్వం సర్వేమయం!.. అయితే ప్రామాణికత ఎంత..?
ఖమ్మం: ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక మొదలు బలాబలాలు తెలుసుకునేందుకు సర్వే చేయించుకోవడం పరిపాటిగా మారింది. సర్వేల్లో వచ్చిన ఫలితాలను సమీక్షించుకుంటూ ఎక్కడ బలహీనంగా ఉన్నామో సరిచేయించుకోవడంలో ఆశావహులు నిమగ్నమయ్యారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండడంతో ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థులు, ఆశావహులు నెలకు రెండు, మూడు సార్లు సర్వే చేయించుకుంటూ గెలుపోటములను బేరీజు వేసుకుంటున్నారు. ఫలానా పార్టీ, ఫలానా అభ్యర్థి బలం గత నెలలో ఇలా ఉండగా.. ఈసారి పెరిగింది, లేదంటే తగ్గింది అని ఎదుటి వర్గం వారు ప్రచారం చేస్తున్నారు. ఇక సొంత పార్టీల వారైతే తమ అభ్యర్థి, నేత బలం పెరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఎన్నికల రంగంలో దూసుకెళ్తున్నారు. సొంత సర్వేలతో బిజీ ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కో సంస్థకు సర్వే బాధ్యతలను అప్పగించింది. అయితే, పోటీ చేసే అభ్యర్థులు సైతం సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీ నుంచి ఫలానా అభ్యర్థి పోటీకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది.. అధికార పార్టీ అభ్యర్థి అనుకూల అంశాలు ఏమిటి... పోటీలో ఎవరెవరు ఉంటారు, ఎవరికి గెలిచే అవకాశముందందనే అంశాలపై సర్వే చేయిస్తూ నివేదికలు తెప్పించుకుంటున్నారు. సమాచారం ఉంది... సర్వే చేయించుకున్న నేతలు ఏ గ్రామంలో ఏ పార్టీ, ఏ నాయకుడికి ఎంత ఇమేజ్ ఉందో తెలుసుకుంటున్నారు. అనంతరం ఆ గ్రామానికి వెళ్లినప్పుడు సమాచారం తన వద్ద ఉందని చెబుతూ సర్వే చేసిన వారికి ఎవరెవరు ఏం చెప్పారో కూడా తెలుసు.. ఇకనైనా సీరియస్‌గా పని చేయకపోతే ఫలితాలు మారనున్నందున తీరు మార్చుకోవాలని సూచనలు చేస్తున్నట్లు తెలిసింది. జర జాగ్రత్త సర్వే కోసం ఎవరైనా వస్తే వారు అడిగిన ప్రశ్నలకు ఇష్టముంటే సమాధానం చెప్పడం లేదంటే దాటవేయడమే మంచిదని పలువురు సూచిస్తున్నారు. అలాకాకుండా ఏదో ఒక మాట అంటే సరిపోతుందిగా అనే భావనతో సమాధానమిస్తే సదరు వ్యక్తి ఫలానా పార్టీకి అనుకూలమనే ముద్ర వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక నలుగురు కూడిన చోట రాజకీయాలపై చర్చించడం.. అదికాస్తా పెద్దదై నిందించుకోవడం ఇటీవల సాధారణమైందని తెలుస్తోంది. ఎవరైనా అతి ఉత్సాహంతో మాట్లాడితే సెల్ఫోన్లో రికార్డు చేసి సంబంధిత నాయకులకు చేరవేస్తున్నట్టు సమాచారం. ప్రామాణికత ఉందా? ఒకప్పుడు సర్వేలకు ప్రాధాన్యత ఉండగా.. నివేదికలకు ఒక కచ్చితత్వం ఉంటుందని నమ్మేవారు. కానీ రానురాను ఏ పార్టీకి ఆ పార్టీ అనుకూలంగా సర్వే నివేదికలు వస్తుండడంతో ప్రజలు విశ్వసించడం లేదు. సర్వే చేయించిన వ్యక్తికి అనుకూలంగా నివేదిక ఇవ్వకపోతే ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందనే భావనతో నిర్వాహకులు అదే మాదిరి చేస్తున్నట్లు సమాచారం. ఇక 2019లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఓ సంస్థ ఇచ్చిన సర్వే నివేదిక ఆధారంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలువురు పందేలు కాసి భారీగా నష్టపోయి ఇప్పటికీ కోలుకోలేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయి మానసికంగా కుంగిపోయిన వారు పలువురు కనిపిస్తారు. -
రైతు ప్రాణం తీసిన 'హెచ్ఎండీఏ' సర్వే..
మెదక్: హెచ్ఎండీఏ అధికారులు సర్వే చేసి హద్దులు పాతారనే సమాచారం తెలిసి భూమి ఎక్కడ పోతుందోనని ఆందోళనతో ఓ రైతు గుండె ఆగిపోయింది. ఈ సంఘటన పెద్దశంకరంపేటలో గురువారం తెల్లవారుజాము చోటుచేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన డాగ్గారి నారాయణ(75)కు పట్టణ శివారులో కొన్ని ఎకరాల భూమి ఉంది. ఇందులో అతడి తమ్ముడికి కూడా కలిపి 3 ఎకరాల అసైన్డ్ భూమి ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. బుధవారం హెచ్ఎండీఏ అధికారులు సర్వే చేసి హద్దులు పాతారనే సమాచారం తెలియడంతో భూమి ఎక్కడ పోతుందోనని ఆందోళనతో గుండెపోటుకు గురై మృతిచెందాడని తెలిపారు. రైతుల ఆందోళన.. అధికారులు సర్వే సక్రమంగా చేపట్టకుండా తమ భూముల్లో హద్దులు పాతారాని సుమారు 70 మంది రైతులు తహసీల్దార్ కార్యాలయం వద్దకు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై తహసీల్దార్ గ్రేస్బాయి, ఎస్ఐ బాలరాజు, ఎంపీపీ జంగం శ్రీనివాస్, ఎంపీటీసీ వీణసుభాష్గౌడ్లు వారికి నచ్చజెప్పారు. రైతులు సాగు చేసుకుంటున్న అసైన్డ్, పట్టా భూముల విషయంపై ఉన్నతాధికారులకు, కలెక్టర్‌కు నివేదించి వారికి న్యాయం చేస్తామని తహసీల్దార్ రైతులకు హామీ ఇచ్చారు. విషయానికొస్తే.. పట్టణ శివారులో గత ఏడాది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)కు 217 సర్వే నంబర్లో 257 ఎకరాల 18 గుంటల భూమిలో.. 85 ఎకరాల సాగుకు పనికిరాని భూమిని అభివృద్ధి కోసం రెవెన్యూ అధికారులు అప్పగించారు. ఈ విషయమై కొంతకాలంగా రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ భూమిని సర్వే చేపట్టేందుకు బుధవారం హెచ్ఎండీఏ అధికారులు జేసీబీలతో వచ్చి పలు చోట్ల హద్దులను గుర్తించి జెండాలను పాతారు. -
ఏపీ: ప్రతి 100 మందిలో 30 మందికి అప్పుడే పెళ్లిళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 29.3 శాతం మంది అమ్మాయిలకు 18 సంవత్సరాలలోపే పెళ్లిళ్లు (బాల్య వివాహాలు) అయిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 18 సంవత్సరాలు నిండకముందే 32.9 శాతం మంది అమ్మాయిలకు పెళ్లిళ్లు అవుతుండగా, పట్టణ ప్రాంతాల్లోనూ 21.7 శాతం మంది అమ్మాయిలకు 18 సంవత్సరాలలోపే పెళ్లిళ్లు అవుతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. గతంలో కంటే ఈ తరహా పెళ్లిళ్ల శాతం కొంత మేర తగ్గినట్లు సర్వే పేర్కొంది. గతంలో 18 ఏళ్లలోపు అమ్మాయిల పెళ్లిళ్లు 33 శాతం ఉండగా, ఇప్పుడు 29.3 శాతంగా ఉన్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే సమయంలో రాష్ట్రంలో 15 ఏళ్ల నుంచి 19 ఏళ్ల వయస్సుగల పెళ్లి చేసుకున్న మహిళలు అప్పటికే తల్లి కావడం కానీ, గర్భంతో ఉండటం గానీ గుర్తించారు. వీరి శాతం పట్టణాల్లో 9.3 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో 14.1గా ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో 18 ఏళ్లకన్నా ముందుగానే 37.3 శాతం మంది అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకున్నట్లు సర్వే తెలిపింది. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 22.1 శాతం ఈ తరహా పెళ్లిళ్లు నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా పశ్చిమబెంగాల్లో 41.6 శాతం, బీహార్‌లో 40.8 శాతం 18 ఏళ్లు నిండకుండానే అమ్మాయిలకు పెళ్లిళ్లు అయినట్లు సర్వే పేర్కొంది. -
టిప్పన్ నక్ష.. రాష్ట్రంలో భూముల సర్వేకు ఈ పేరుకు సంబంధం ఏంటి?
సాక్షి, హైదరాబాద్: టిప్పన్ నక్ష..... ఇప్పుడు రాష్ట్రంలో అందరి నోటా నానుతున్న పేరు ఇది. దీని ప్రాతిపదికనే రాష్ట్రంలో భూముల సర్వే చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అసలు ఈ టిప్పన్ నక్ష అంటే ఏమిటి? ఆ పేరు ఎలా వచ్చింది? ఎవరు పెట్టారు అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో టిప్పన్ నక్ష గురించి తెలసుకుందాం. పటమే నక్ష.. శిస్తు వసూలు కోసం ఎవరి దగ్గర ఎంత భూమి ఉందనే లెక్క తేల్చేందుకు నాటి నిజాం సర్కారు భూముల సర్వేకు నడుం బిగించింది. అప్పట్లోనే శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా, గ్రామీణ ప్రజానీకానికి అర్థమయ్యే రీతిలో ఈ సర్వే సాగింది. సర్వే కోసం ఇనుప లింకులను అప్పట్లో వాడుకలో ఉన్న అణాల లెక్కన లెక్కగట్టారు. ఏక్ అణా... దో అణా పేరుతో 16 అణాలకు 50 లింకులు కలిపి ఒక గొలుసు (అణాకు మూడు లింకులు+2 అధికం) తయారు చేశారు. ఈ గొలుసులతో భూములను కొలిచి హద్దులు నిర్ణయించి కొలత రికార్డు నమోదు చేసి నంబర్ ఇచ్చారు. దీన్నే సర్వే నంబర్‌గా, ప్రతి సర్వే నంబర్లోని కొలత రికార్డును (పేపర్) టిప్పన్‌గా వ్యవహరించే వారు. ఇలా గ్రామంలోని అన్ని సర్వే నంబర్ల టిప్పన్ రికార్డుల ఆధారంగా ఒక గ్రామ పటం తయారు చేశారు. దీనికి నక్ష అని పేరు పెట్టారు. అంటే ఒక గ్రామంలోని భూ రికార్డులను సంక్షిప్తం చేసిన గ్రామ పటమే టిప్పన్ నక్ష అన్నమాట. ఈ నక్ష రికార్డులను మార్చడానికి లేదా ట్యాంపర్ చేయడానికి అవకాశం లేదు. దీని ఆధారంగానే ఇప్పుడు రాష్ట్రంలోని గ్రామీణ భూముల సర్వే జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. చదవండి: ‘డాడీ.. లేడాడీ.. నాతో మాట్లాడు... ఏమైంది అంకుల్ నాన్నకు..’ -
సర్వే: చైనా వస్తువుల బ్యాన్‌కే మొగ్గు!
న్యూఢిల్లీ : గల్వాన్ లోయ వద్ద చైనా సైనికుల దాడి ఘటన తరువాత భారత్‌లో చైనా వస్తువుల బహిష్కరణ నినాదం ఊపందుకుంది. చైనా వస్తువులను ఇండియా బహిష్కరిస్తే ఆ దేశానికి ఆర్థికంగా నష్టం వస్తుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈనెల 16న జరిగిన చైనా-భారత్ సంఘటనలో 20 మంది భారత జవాన్లు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో చైనా తయారు చేసిన వస్తువులను, ఉత్పత్తులను బహిష్కరించాలని కేంద్ర పిలుపునివ్వడంతో అనేక రాష్ట్రాల్లో చైనా వస్తువులకు వ్యతిరేకంగా నిరసనలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో చైనాపై భారత్ ప్రజల అభిప్రాయాలను అంచనా వేయడానికి న్యూస్ 18 నెట్వర్క్ డిజిటల్ తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో కలిసి ఆన్లైన్ పోల్‌ను నిర్వహించింది. ఇది శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం మధ్యాహ్నం(24 గంటలు) వరకు చేపట్టింది. తొమ్మిది ప్రశ్నలతో కూడిన ఈ సర్వేలో సుమారు 6,000 వేల మంది తమ స్పందనలను తెలియజేశారు. ఇందులో కనీసం 70 శాతం మంది భారతీయులు చైనా వస్తువులను బహిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తేలింది. వీరు చైనా వస్తువులకు బదులు ఎక్కువ మొత్తంలో చెల్లించి వేరే వస్తువులను కొనేందుకు సైతం ఆసక్తి చూపుతున్నారు. వీరిలో 91 శాతం మంది చైనా యాప్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించడం మానేస్తామని తెలిపినట్లు వెల్లడైంది. అంతేగాక ఇతరులను ఇందుకు ప్రోత్సాహిస్తామని తేలింది. 92 శాతం మంది చైనా ఉత్పత్తులపై తమకు నమ్మకం లేదని తెలిపారు. కాగా వీరిలో ఎక్కువ మందికి చైనాపై వ్యతిరేక వాదన ఉంది. ఎక్కువగా 97 శాతం ప్రజలు చైనా ఉత్పత్తులను భారతీయ సెలబ్రిటీలు ఉపయోగించడం మానేయాలని సూచించారు. 92 శాతం మంది భారత్‌కు పాకిస్తాన్ కంటే చైనా భారత్‌కు పెద్ద ముప్పుగా తయారైందని భావిస్తున్నారు. అలాగే 52 శాతం మంది భారత్‌కు మిత్రదేహాలు లేవని దేశం తనను తాను రక్షించుకోవాల్సి ఉందని హితవు పలికారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (18.12 శాతం) కంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (19.32 శాతం) భారత్‌కు మంచి సన్నిహితుడిగా పేర్కొన్నారు. చైనీయుల ఆహారం మరియు రెస్టారెంట్లను బహిష్కరించాలని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే ఇంతకుముందు పిలుపునిచ్చినప్పటికీ, చాలా మంది భారతీయులు దీని గురించి ఇంకా తెలియదన్నారు. 43 శాతం మంది తాము చైనీస్ ఆహారాన్ని తినబోమని, 31 శాతం మంది ఆ ఆహారంతో తమకు సంబంధం లేదని చెప్పారు. కాగా గత 15 రోజుల్లో చైనాపై మనోభావాలను అంచనా వేయడానికి న్యూస్ 18 నిర్వహించిన రెండవ పోల్ ఇది. మొదటి పోల్ ఫలితాలు జూన్ 5న వెల్లడించింది. -
ముంబై నీళ్లు అమోఘం
న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ నగరాల్లో నల్లా నీళ్ల నాణ్యతపై కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఆ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) చేసిన ఈ సర్వేలో దేశం మొత్తం మీద ముంబై నగర నల్లా నీళ్లే స్వచ్ఛమైనవని తేలింది. మెట్రో నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబైతోపాటు 20 రాష్ట్రాల రాజధానుల్లో ఈ సర్వే నిర్వహించారు. దీనిపై మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ స్పందిస్తూ.. సర్వే జరిపిన అన్ని నగరాల్లోకెల్లా ఒక్క ముంబై నగర నమూనాల్లోనే అవసరమైన 11 బీఎస్ఐ పరామితుల నాణ్యత ఉన్నట్లు తేలిందన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో తాగునీటి సరఫరా అయ్యే పైపులు, నల్లాల నాణ్యతను పెంచడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని పేర్కొన్నారు. బీఐఎస్ ప్రమాణాలు అందుకోవడంలో ఢిల్లీ, కోల్‌కతా, చెన్నైలు విఫలమయ్యాయని తేలగా, తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్, అమరావతి, భువనేశ్వర్, రాంచీ, రాయ్‌పూర్, సిమ్లా, చండీగఢ్, గుహవాటి, బెంగళూరు, గాంధీనగర్, లక్నో, జమ్మూ, డెహ్రాడూన్ కూడా ఈ ప్రమాణాలు అందుకోలేకపోయాయని తెలుస్తోంది. సర్వే జరిపిన బీఐఎస్ సంస్థ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ మాట్లాడుతూ.. మూడో దశ సర్వేను ఈశాన్య రాష్ట్రాల రాజధానులు, 100 స్మార్ట్ సిటీల్లో జరపనున్నట్లు తెలిపారు. -
సర్వే.. సవాలే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతు సమగ్ర సమాచార సేకరణ సర్వే వ్యవసాయ శాఖకు సవాల్‌గా మారింది. క్షేత్రస్థాయిలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకురావడం.. ఇంకా స్వల్ప సమయమే మిగిలి ఉండటంతో సర్వే సకాలంలో పూర్తవుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు ఎండలు మండిపోతుండడంతో రైతుల సమగ్ర వివరాలు రాబట్టడం వ్యవసాయ సిబ్బందికి అగ్నిపరీక్షగా మారింది. ఉద్దేశమిదీ.. రైతులకు అన్ని ప్రయోజనాలు చేకూరేందుకు వీలుగా వారి సమగ్ర వివరాలు రాబట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి రైతును కలిసి అన్ని వివరాలు సేకరించాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది. పంట కాలనీల ఏర్పాటు, భవిష్యత్‌లో రైతులకు వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు ఈ వివరాలు కీలకంగా మారుతాయని సర్కారు భావించింది. వ్యవసాయ యాంత్రీకరణ, సూక్ష్మ సేద్యం, పంటలకు కనీస మద్దతు ధర కల్పించడం, ఆన్లైన్లో చెల్లింపులు, ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటు, సబ్సిడీ చెల్లింపులు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల అమలుకు రైతు సమగ్ర సమాచారాన్ని ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. వివరాల సేకరణ బాధ్యతలను వ్యవసాయ విస్తీర్ణాధికారుల(ఏఈఓ)కు అప్పగించింది. సాధ్యమేనా..? వాస్తవంగా లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే జిల్లాలో సమగ్ర సర్వే ప్రారంభమైంది. ఆ వెంటనే నోటిఫికేషన్ వెలువడటంతో సర్వే నిలిచిపోయింది. వ్యవసాయ శాఖ అధికారులకు ఎన్నికల విధులు కేటాయించడంతో ముందుకు సాగలేదు. తాజాగా ఎన్నికలు ముగియడంతో.. ఈనెల 15 నుంచి సర్వేను వేగవంతం చేశారు. జిల్లాలో 2.75 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరందరి నుంచి వివరాలు తీసుకోవాల్సిన బాధ్యత జిల్లాలోని 80 మంది ఏఈఓలది. ప్రభుత్వ నిర్దేశించిన ప్రొఫార్మా ప్రకారం అన్ని వివరాలు తీసుకోవడానికి వీరు ప్రతి రైతును విధిగా కలవాల్సిందే. ఒక్కో రైతు నుంచి వివరాలు సేకరించడానికి 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతోంది. ఈ లెక్కన ఒక్కో ఏఈఓ రోజుకు సగటున 25 నుంచి 30 మంది రైతులను మాత్రమే కలవగలుగుతున్నారు. అంటే జిల్లా అంతట కలుపుకుంటే రోజుకు 2,400 మంది వివరాలు మాత్రమే తీసుకోగలుగుతున్నారు. వచ్చేనెల 15లోపు సర్వేను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీని ప్రకారం గడువు తేదీ వరకు 60 వేల మంది రైతుల వివరాలు మాత్రమే తీసుకునేందుకు అవకాశం ఉంది. వేగం మరింత పెంచినా... ఈ సంఖ్య లక్ష దాటదని క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి తెలుస్తోంది. ఈ బాధ్యతలు కూడా.. రైతుల నుంచి రబీ ధాన్యం సేకరించే బాధ్యతలను కూడా ఏఈఓలకు అప్పగించారు. ఇప్పటికే సర్వే పనిభారంతో సతమతమవుతున్న ఏఈఓలకు.. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తయారైంది. జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్ తదితర వాటి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొను గోలుకేంద్రాల వద్ద కూడా వీరు విధులు నిర్వహించాల్సి ఉంది. దీనికితోడు స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను కూడా ఏఈఓలకు అప్పగించారు. కొందరు ఎన్నికల శిక్షణకు కూడా హాజరవుతున్నారు. దీంతో వీరికి పనిభారం పెరిగింది. 39 కాదు.. 44 అంశాలపై వివరాలు రైతు సమగ్ర సమాచార సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తొలుత 39 అంశాలతో కూడిన ప్రొఫార్మాను రూపొందించింది. తాజాగా ఈ జాబితాలో మరో 5 అంశాలను చేర్చి 44కు పెంచడంతో ఏఈ ఓలు రైతుల వివరాల సేకరణ కోసం మరికొంత సమయాన్ని అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. ఇది కూడా జాప్యానికి కొంత కారణమవుతోంది. ఠారెత్తిస్తున్న భానుడు ఎండలు మండిపోతున్నాయి. పగలు సగటున 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉదయం పదిన్నర గంటలు దాటితే కాలు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉదయం 11 గంటలోపు, ఆ తర్వాత సాయంత్రం 4 గంటల తర్వాతే రైతుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మొత్తం మీద రోజుకు ఏడు గంటలపాటు ఏఈఓలు క్షేత్రస్థాయిలో తిరుగుతూ వివ రాలు సేకరిస్తున్నారు. ఇలా అన్నీ ప్రతికూల పరిస్థితులు చుట్టుముడుతుండటంతో సర్వే సకాలంలో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. గడువులోగా పూర్తిచేస్తాం స్థానిక సంస్థల ఎన్నికల విధుల నుంచి ఏఈఓలను మినహాయించాలని జిల్లా ఎన్నికల అధికారిని కోరుతున్నాం. ఈ విధులను సడలిస్తే కొంత ఊరట కలుగుతుంది. ఇలా దాదాపు ఐదు రోజులు మాకు కలిసివస్తాయి. సకాలంలో రైతుల సమగ్ర సర్వే పూర్తి చేయడంలో ఇవి కీలకంగా మారుతాయి. సాధ్యమైనంత వరకు గడువులోపు రైతులందరి వివరాలు సేకరిస్తాం. అవసరమైతే ఏఈఓలకు సహాయకులుగా మరికొంత మంది సిబ్బంది సేవలను తీసుకోవాలని యోచిస్తున్నాం. – గీతారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారిణి సేకరిస్తున్న వివరాలు ఇవీ.. రైతు భూమి విస్తీర్ణం, విద్యార్హతలు, సాగునీటి వసతి, సూక్ష్మనీటి పారుదల విస్తీర్ణం, నేల స్వభావం, సర్వే నంబర్ల వారీగా భూ విస్తీర్ణం, ఖరీఫ్–యాసంగి సీజన్లలో వేసిన పంటలు, తదుపరి సాగుచేయాలనుకుంటున్న పంట, తోటల సాగు, పంటరుణం, రైతుబంధు, రైతుబీమా, పంట బీమా, ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం, సాగు చేయడానికి రైతులు ఇష్టపడుతున్న పంటలు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, ఫోన్ సౌకర్యం, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన ఉందా? కిసాన్ పోర్టల్ నుంచి సలహాలు అందుతున్నాయా? తదితర అంశాలకు çసంబంధించి వివరాలను రైతుల నుంచి సేకరిస్తున్నారు. -
బడి‘బాట’ పట్టేనా..
ఆదిలాబాద్‌టౌన్: బడీడు పిల్లలకు బడి ‘బాట’ వేసేందుకు విద్యాశాఖ సర్వే చేపట్టనుంది. బాలకార్మికులు పని లోకాదు..బడిలో ఉండాలనే లక్ష్యంతో ఏటా చేపడుతున్న సర్వే ఆశించిన మేర ఫలితం ఇవ్వడం లేదనే విమర్శలు లేకపోలేదు. నివేదిక సమర్పించి అధికారులు చేతులుదులుపుకుంటున్నారు తప్పితే పిల్లలను బడిలో చేర్పించడానికి శ్రద్ధచూపడం లేదు. ఏటా బడిబయట పిల్లలకోసం విద్యాశాఖ సర్వే చేపడుతోంది. ఈసారి కూడా బడిదూరంగా ఉన్న వారి లెక్కతేల్చేందుకు మళ్లీ వివరాలు సేకరించనుంది. ఈ ప్రక్రియ ఈనెల 24 నుంచి 28 వర కు నిర్వహించనుంది. అయితే ఏటా సర్వే చేపడుతున్నా బడిబయట పిల్లల్ని బడిబాట పట్టించడంలో అధికా రులు విఫలమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది మెప్మా, సెర్ప్ సిబ్బందితో బడిబయట ఉన్న పిల్లల సర్వే చేపట్టారు. అయితే వారు పూర్తిస్థాయిలో సర్వే చేçపట్టకుండా ముగించేశారు. బడిబయట పిల్లలు చెత్తకుప్పల్లో ప్లాస్టిక్ ఏరుతూ, హోటళ్లలో పని చేస్తూ కనిపించారు. ఈఏడాది మళ్లీ విద్యాశాఖ బడిబయటి పిల్లల సర్వేకు సిద్ధమైంది. ఈనెల24 నుంచి 28వ తేదీ వరకు సర్వే కొనసాగించనున్నారు. సర్వేలో గుర్తించిన పిల్లల్ని పాఠశాలల్లో, కేజీబీవీల్లో, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో, రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్, నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లలో చేర్పించి విద్యాబోధన చేయిం చేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. ఈసారైనా సర్వే పకడ్బందీగా నిర్వహిస్తే బడిబయటి పిల్లలు బడిలో చేరి అక్షరాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. గాలి లెక్కలు..ఐకేపీ, సెర్ప్ సిబ్బంది పూర్తిస్థాయిలో సర్వే చేపట్టకుండా ఇళ్లకే పరిమితమై లెక్కలు వేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో కేవలం 196 మంది పిల్లలు బడిబయట ఉన్నారని వారు నివేదిక సమర్పించారు. అయితే జిల్లాలో దాదాపు వందలసంఖ్యలో బడిబయట పిల్లలు దర్శనమిస్తున్నారు. ఇటుకబట్టీలు, లాడ్జీలు, హోటళ్లు తదితర వ్యాపార సముదాయాల్లో పనులు చేస్తున్నారు. వారు నిర్వహించిన సర్వే వివరాల ప్రకారం.. తాంసి మండలంలో ఒకరు, గాదిగూడలో ఒకరు, మావలలో నలుగురు, నార్నూర్‌లో ఐదుగురు, బోథ్‌లో ఐదుగురు, ఆదిలాబాద్ రూరల్ మండలంలో ఆరుగురు, భీంపూర్‌లో 8, గుడిహత్నూర్‌లో 22, ఇచ్చోడలో 8, నేరడిగొంలో 14, ఉట్నూర్‌లో 23, ఆదిలాబాద్ పట్టణంలో 85 మంది, బజార్హత్నూర్లో 14 మంది మొత్తం 196 మంది చిన్నారులు బడిబయట ఉన్నట్లు సర్వే నివేదిక సమర్పించారు. ఇందులో బాలురు 100 మంది, బాలికలు 96 మంది ఉన్నట్లు తేల్చారు. వారంరోజులపాటు సర్వే జిల్లాలో గతేడాది నిర్వహించిన సర్వేలో 196 మంది బడిబయట పిల్లలు ఉండగా, వారిలో 58 మంది బడిబాటపట్టించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వీరిలో ఆడపిల్లలు 31 మంది, మగపిల్లలు 27 మందిని చేర్పించినట్లు చెబుతున్నారు. అయితే మిగతా 132 మంది పిల్లలు బడిలో ఉన్నారా..బడి బయట ఉన్నారా.. పాఠశాలల్లో నెలరోజుల కంటే ఎక్కువ హాజరుకాని విద్యార్థుల వివరాలు సేకరించనున్నారు. నెలరోజుల నుంచి బడికి రానట్లయితే వారిని కూడా బడిబయట పిల్లలుగానే పరిగణించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సర్వేను సీఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, ఎంఈవో కార్యాలయంలో పని చేసే డాటాఎంట్రీ ఆపరేటర్లు, భవిత రిసోర్స్ సెంటర్లలో పని చేసే ఐఈఆర్పీలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో పని చేసే సీఆర్టీలతో సర్వే చేపడతారు. ఈ వివరాలు సేకరించిన అనంతరం బడిబయట పిల్లల్ని బడిలో చేర్పించనున్నారు. 11 నుంచి 14 ఏళ్లలోపు ఉన్న ఆడపిల్లల్ని కేజీబీవీలో, మగపిల్లల్ని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించి విద్య బోధించనున్నారు. కాగా కొత్తగా నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు, రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి బడిబయటి పిల్ల లకు విద్యాబోధన చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈసారైనా సక్రమంగా జరిగేనా.. జిల్లావ్యాప్తంగా దాదాపు వెయ్యి మందికిపైగా బడిబయట పిల్లలు ఉండగా సర్వేలు సక్రమంగా నిర్వహించకపోవడంతో ఆయామండలాల్లో పదు ల సంఖ్యలోనే పిల్లలు ఉన్నట్లు నివేదిక సమర్పిం చారు. బడిలో చేర్పించిన అనంతరం ఆ పిల్లల గురించి పట్టించుకోకపోవడంతో చాలా మంది మధ్యలోనే డ్రాపౌట్ అవుతున్నారు. పిల్లలను బడిబాటపట్టించే లక్ష్యం నీరుగారుతోంది. -
సిరిసిల్ల: సర్వేలపై ఆసక్తి చూపుతున్న ప్రజానీకం
సాక్షి, సిరిసిల్ల: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జిల్లాలో అత్యధికంగా 80.39 శాతం పోలింగ్ నమోదైంది. ఫలితమే మిగిలి ఉంది. ఈనెల 11న గెలుపు ఎవరిని వరించనుందో తేలనుంది. అప్పటివరకు సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్లో భద్రంగా ఉంటుంది. లెక్క తేలేదాక అభ్యర్థులు, నాయకులతోపాటు అందరిలో ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంది. అందరి నోటా ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ అధికారం చేపడుతుంద?నే మాటలే వినిపిస్తున్నాయి. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు విజయావకాశాలపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నా పోలింగ్ కేంద్రాల వారీగా తమ గెలుపుపై లెక్కలు వేసుకుంటున్నారు. నియోజకవర్గంలోని బూత్‌ల వారీగా ఏజెంట్లు, నాయకులతో సమాచారం తెలుసుకుంటూ తమకు లభించే ఓట్లపై లెక్కలేసుకుంటున్నారు. ఎవరి ధీమా వారిదే.. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్, కూటమి అభ్యర్థులు ఎవరికి వారు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజల నుంచి లభించిన సానుభూతి తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. బీజేపీ, బీఎల్ఎఫ్ నాయకులు ఈసారి ఓట్లు శాతం పెరగనుందని, ప్రత్యర్థి పార్టీలకు గట్టి సవాల్ విసిరామని భావిస్తున్నారు. ఈవీఎంలకు పటిష్ట భద్రత శుక్రవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను బద్దెనపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలోకి అధికారులు భద్రంగా చేర్చారు. ఈవీఎంలు, వీవీప్యాట్లను రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, ఎస్పీ, డీఎస్పీల సమక్షంలో పరిశీలించిన తర్వాత స్ట్రాంగ్‌రూముకు సీల్‌వేశారు. స్ట్రాంగ్‌రూం వద్ద మూడెంచల వ్యవస్థతో పోలీసులు పటిష్ట భద్రత కల్పించారు. మొదటి వరుసలో బీఎస్ఎఫ్ జవాన్లు, రెండోవరుసలో రాష్ట్రసాయుధ బలగాలు, మూడో అంచెలో సివిల్ ఫోర్స్‌తో గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. వీరితోపాటు 24 గంటలపాటు సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. పెరిగిన పోలింగ్ శాతం.. జిల్లాలో ఈసారి అత్యధిక పోలింగ్‌శాతం నమోదైంది. గత ఎన్నికల్లో కంటే ఈసారి వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో 7 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ జరిగింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడలో 73.04 శాతం, సిరిసిల్లలో 73.24 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి వేములవాడలో 80.30 శాతం, సిరిసిల్లలో 80.48 శాతం నమోదైంది. మొత్తంగా జిల్లాలో ఈసారి ఎన్నికల్లో 80.39 శాతం పోలింగ్ నమోదైంది. అసెంబ్లీ రద్దు నుంచి ఎన్నికల సంఘం, వివిధ పార్టీల నాయకులు పెద్దఎత్తున ఓటు నమోదు గురించి అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయడంతో పోలింగ్ శాతం పెరిగినట్లు అధికారులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటింగ్‌శాతం పెరగడం ఎవరికి లాభం చేకూరుతుందనేది ఈనెల 11న తేలనుంది. లెక్కల్లో అభ్యర్థులు.. నియోజకవర్గంలోని భూత్‌ల వారీగా నమోదైన పోలింగ్ శాతంతో ఎక్కడ ఎవరికి ఓట్లు పడ్డాయన్న లెక్కల్లో నేతలు ఉన్నారు. భూత్‌లో ఉన్న ఓటర్లులో మనపార్టీ వారు ఎందరు? ఇతర పార్టీలోని ఓటర్లు ఎందరు? తటస్థ ఓటర్లు ఎవరు? అందులో ఎంతమంది ఓటింగ్‌లో పాల్గొన్నారు? అనే లెక్కలు వేస్తున్నారు. ఎక్కడ పార్టీకి కలిసి వచ్చింది? ఎక్కడ దెబ్బతిన్నదో? సమీక్ష చేయటంతోపాటు, పార్టీలో ఉంటూ పోలింగ్ ముందురోజు ప్రత్యర్థి పార్టీలకు కోవర్టుగా పనిచేసిన నాయకులను గుర్తించే పనిలో పడ్డారు. ఓటింగ్ సరళిని బట్టి భూత్‌ల వారీగా తమకు దక్కిన మద్దతును లెక్కగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఎక్కడ చూసినా ఇదే చర్చ పోలింగ్ ముగిసిన వెంటనే ప్రకటించిన సర్వేలతో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? మళ్లీ ఏ పార్టీ అధికారంలోకి రానుంది? అనే అంశాలపై పోటీ చేసిన అ భ్యర్థులతోపాటు పార్టీల నాయకులు, జనం చ ర్చించుకుంటున్నారు. అందరి నోటా ఇదేమాట వినిపిస్తోంది. దీనిపైనే బెట్టింగులు, సవాళ్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల చివరి ఘట్టమైన ఫలి తాలు వెలువడే ఈనెల 11వ తేదీపైనే ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
కేసీఆర్ ముందే సర్వేచేయించుకుండు
నల్లగొండ: కేసీఆర్ నల్లగొండలో ముందే సర్వే చేయించుకొని ఓడిపోతానని తెలిసి ఒక బకరాకు టికెట్ ఇచ్చి అప్పుల పాలు చేశారని కాంగ్రెస్ నల్లగొండ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నల్లగొండలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ, కేసీఆర్ మాయ మాటలతో తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. మొదట దళితుడిని సీఎం చేస్తానని చెప్పి తనే íసీఎం అయి మొదటిమోసం చేశారని ఆరోపించారు. గత ఎన్నికల ముందు నల్లగొండ బహిరంగ సభలో ప్రాజెక్టులన్నీ కుర్చీవేసుకొని కట్టిస్తానని చెప్పి నాలుగేళ్లు గాలికి వదిలారన్నారు. మళ్లీ ఎన్నికలు రావడం తో ఇప్పుడు ‘నల్లగొండను దత్తత తీసుకుంటా ను, ఇక్కడ ఒకరోజు పండుకొని అయినా పను లు మంజూరు చేయిస్తా’ అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లు అధికారంలో ఉండి ఏం చేశారని కేసీఆర్‌నుద్దేశించి ప్రశ్నించారు. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి 11 రోజు లు నిరాహార దీక్ష చేశానని చెప్పారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమని, అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ జైలుకు పోక తప్పదని అన్నారు. -
వారికి 10% ప్రజాదరణ కూడాలేదు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన నటులు రజనీకాంత్, కమల్‌హాసన్‌లకు తమిళనాడులో కనీసం పది శాతం ప్రజాదరణ కూడా లేదని తేలింది. ఇటీవల చేపట్టిన తమ సర్వేలో ఈ విషయం వెల్లడైందని ప్రముఖ తమిళ న్యూస్ చానల్ ‘దినతంతి’ ప్రకటించింది. ఈ న్యూస్ చానల్ గ్రూపునకు చెందిన ‘మాలైమలర్’ పత్రిక సర్వే వివరాలను సోమవారం ప్రచురించింది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కన్నుమూసిన తరువాత కమల్, రజనీ రాజకీయ అరంగేట్రం చేశారు. మక్కల్ నీది మయ్యం పేరుతో పార్టీని స్థాపించిన కమల్ రాష్ట్రంలో పర్యటిస్తుండగా రజనీ మాత్రం పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో ఉన్నారు. అయితే, వచ్చే ఏడాది ఎన్నికల నేపధ్యంలో రజనీ, కమల్ రాజకీయ ప్రవేశంపై ‘దినతంతి’ న్యూస్‌చానల్ ఇటీవల పుదుచ్చేరి, తమిళనాడుల్లో సర్వే జరిపింది. ఈ సర్వేలో.. కమల్, రజనీ రాజకీయాల్లో ఏమీ సాధించలేరని 51 శాతం మంది చెప్పగా, వారి రాజకీయ ప్రవేశంపై పది శాతం మంది కూడా సానుకూలంగా లేరని ఆ పత్రిక పేర్కొంది. -
ట్రాఫిక్ రద్దీతో ఏటా 2,200 కోట్ల డాలర్ల నష్టం
సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశంలో ట్రాఫిక్ రద్దీ పెరగడం వల్ల ఏటా 2,200 కోట్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోతున్నాం. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో తోటి ఆసియా నగరాల కన్నా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కతా మెట్రో నగరవాసులు గంటన్నర సేపు ఎక్కువ సమయాన్ని ట్రాఫిక్ రద్దీలో గడుపుతున్నట్లు ఉబర్ టాక్సీ సర్వీసు సంస్థ ఏర్పాటు చేసిన బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వెల్లడించింది. నగర వాసులు ఒక చోటు నుంచి గమ్యస్థానానికి వెళ్లాలంటే పట్టే సరాసరి సగటు సమయం కన్నా ఆసియా నగరాల్లో 67 శాతం పడుతుంటే భారత్ మెట్రోపాలిటిన్ నగరాల్లో 149 శాతం ఎక్కువ పడుతుంది. ట్రాఫిక్ రద్దీ కారణంగా కూడా దేశానికి ఏటా 2,200 కోట్ల డాలర్ల నష్ట వాటిల్లుతోందని ఆ సంస్థ తెలియజేసింది. ట్రాఫిక్‌లో అదనపు సమయానికి అయ్యే ఇంధనం ఖర్చు, ఆ సమయానికి మ్యాన్ పవర్‌కు అయ్యే ఖర్చు, కాలుష్యం, ప్రమాదాలకు ఖర్చు తదితర అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఏడాదికి అయ్యే ఖర్చును అంచనావేసి ఈ లెక్క తేల్చినట్లు సంస్థ వెల్లడించింది. 1980 సంవత్సరంతో పోలిస్తే భారత దేశంలో ట్రాఫిక్ అవసరాలు ఎనిమిదింతలు పెరిగాయి. దేశం ఆర్థికంగా ఎంతో పురోభివద్ధి చెందడం, ప్రజల్లో ఎక్కవ మంది సొంత కారులు కొనుగోలు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దేశంలో జనాభా పెరగడం, జన సాంద్రత ఎక్కువగా ఉండడం, మెట్రో రైళ్ల లాంటి ప్రభుత్వ రవాణా వ్యవస్థ ఆశించిన మేరకు విస్తరించకపోవడమే కారణమని ఆ సంస్థ పేర్కొంది. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలోని ఇతర నగరాలకన్నా ముంబై , ఢిల్లీ నగరాల్లో ట్రాఫిక్ పరిస్థితి కాస్త మెరగుపడినప్పటికీ ఇంకా ఎంతో మెరుగుపడాల్సి ఉంది. బెంగుళూరు, కోల్‌కతా నగరాల్లోనైతే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. -
ఈ ఏడాది వేతన పెంపు ఎంతంటే..
సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది పలు రంగాల్లో ఉద్యోగుల వేతనాలు సగటున 9.4 శాతం మేర పెరుగుతాయని ఏఓఎన్ ఇండియా కన్సల్టింగ్ నిర్వహించిన వేతన పెంపు సర్వే వెల్లడించింది. 20 భిన్న పరిశ్రమలకు చెందిన 1000 కంపెనీలను ఈ సర్వే పలుకరించింది. గత ఏడాది తరహాలోనే ఈ సంవత్సరం కూడా ఉద్యోగుల వేతనాలు పెరుగుతాయని ఈ సర్వే తేల్చింది. ఇక గత ఏడాది దేశవ్యాప్తంగా ఉద్యోగుల వేతనాలు 9.3 శాతం పెరుగుతాయని ఈ సర్వే అంచనా వేసింది. ఇక మెరుగైన సామర్థ్యం కనబరిచేవారికి కంపెనీలు ఎప్పుడూ పెద్దపీట వేస్తాయని, వారికి సగటు వేతన పెంపు 15.4 శాతంగా ఉంటుందని సర్వే పేర్కొంది. ఈ ఏడాది ప్రొఫెషనల్ సేవలు అందించే సంస్థల్లో వేతన పెంపు అత్యధికంగా 10.6 శాతంగా ఉంటుందని, కన్జూమర్ ఇంటర్నెట్ కంపెనీల్లో 10.4 శాతం, లైఫ్సైన్సెస్లో 10.3 శాతం, ఆటోమేటివ్, వాహన తయారీ కంపెనీల్లో 10.1 శాతం, కన్జూమర్ ఉత్పాదక సంస్థల్లో 10.2 శాతం, ఐటీ అనుబంధ సంస్ధల రంగంలో 9.6 శాతం మేర వేతనాల పెంపు ఉంటుందని అంచనా వేసింది. హైటెక్, ఐటీ పరిశ్రమలో వేతన పెంపు 9.5 శాతం ఉంటుందని పేర్కొంది. నిర్మాణరంగంలో 9.3 శాతం, వినోద, ప్రచురణలు, కమ్యూనికేషన్ రంగంలో 9.1 శాతం మేర వేతనాలు పెరుగుతాయని తెలిపింది. ఆతిధ్య రంగం, రెస్టారెంట్లలో 9 శాతం, ఇంధన, రవాణా రంగాల్లో 9 శాతం, ఇంజనీరింగ్ సేవల్లో 8.9 శాతం, ఆర్థిక సంస్థల్లో 8.5 శాతం, సిమెంట్ రంగంలో 8.4 శాతం చొప్పున వేతన పెంపు ఉంటుందని సర్వే అంచనా వేసింది. -
60 వస్తాయనుకుంటే.. 99 వచ్చాయి
సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికలపై తొలుత జరిపిన అంతర్గత సర్వేలో కేవలం 60 సీట్లే గెలుస్తామని తేలినట్లు బీజేపీ పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ ఫలితాలతో ఆందోళన చెందకుండా అప్పటికప్పుడు తీసుకున్న నష్ట నివారణ చర్యలతో విజయం సాధించగలిగామని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు శనివారం తెలిపారు. 22 ఏళ్లుగా పార్టీ అధికారంలో ఉండడం, ప్రధాని మోదీ గుజరాత్లో లేకపోవడం, రాష్ట్రంలో కులసమీకరణాలు బీజేపీకి ప్రతికూలంకావచ్చొని అంచనా వేశామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం లేకపోవడం తమకు కలిసొచ్చిందని పేర్కొన్నారు. ఏపీలో టీడీపీతో పొత్తుపై స్పందిస్తూ...ఆ పార్టీతో బీజేపీకి పొసగని సంగతిని అంగీకరించారు. ఇక తెలంగాణలో ఒంటరిగానే పోటీచేయాలని భావిస్తున్నట్ల చెప్పారు. -
ఓనమాలు.. ఒట్టిమాటే..!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ఓనమాలు దిద్దాల్సిన చేతులు పార, పలుగు పడుతున్నాయి. చాలా మంది పిల్లలు హోటళ్లు, పరిశ్రమల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. జిల్లాలో డీఆర్డీఏ, మోప్మా సమన్వయంతో జిల్లాలో బడిబయట పిల్లలపై సర్వే నిర్వహించింది. డీఆర్డీఏ లెక్కల ప్రకారం 1062 మంది బడిబయట ఉన్నారని తేలింది. మోప్మా ఆధ్వర్యంలో చేస్తున్న సర్వే లెక్కలు ఇంకా తేలాల్సి ఉండగా 500పైనే ఉంటారన్నది అంచనా. ఇదీ కేవలం గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించిన సర్వే లెక్కల ప్రకారం మాత్రమే. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, కాగజ్‌నగర్, మందమర్రి, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో చదువులకు దూరంగా ఉన్న పిల్లల లెక్కలు తేలాల్సి ఉంది. రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) ద్వారా ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా, దీనిపై క్షేత్రస్థాయి అధికారులు అంతగా పట్టించుకోకపోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఫలితంగా బడిబయట పిల్లల సంఖ్య పెరుగుతోంది. దహెగాం, ఉట్నూరు, దహెగాం, కౌటాలలో అత్యధికం బడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలనేది విద్యాహక్కు చట్టం నిబంధన. ఇందుకోసం ఆర్వీఎం ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు స్కూల్‌గ్రాంట్స్ నుంచి రూ.500, ప్రాథమికోన్నత పాఠశాలలు రూ.750 ఖర్చు చేసే వీలుంది. వీటిపై పర్యవేక్షణ ఆర్వీఎం అధికారులకు ఉంటుంది. ప్రత్యేకించి విద్యా సంవత్సరం ఆరంభంలో విద్యార్థులను బడిలో చేర్పించటం, హెచ్ఎంలు ఉపాధ్యాయులను సమన్వయం చేసుకొని ప్రచారం చేయించాలి. ప్రత్యేకంగా అంగన్వాడీల్లో ఉన్న పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పాఠశాలల్లో చేర్పించేలా ప్రయత్నించాలి. అయితే ఇది ఏటా మొక్కుబడిగా మారగా, ఏడు మున్సిపాలిటీలు మినహాయించి గుర్తించిన 34 మండలాల్లో 1,062 మంది బడిబయట ఉన్నారు. ఇందులో అత్యధికంగా దహెగాం మండలంలో 138, కెరమెరిలో 128, ఉట్నూరులో 124, కౌటాలలో 102 మంది బాల బాలికలు చదువులకు దూరంగా ఉన్నారు. మొక్కుబడిగా విద్యాచట్టం అమలు ఆర్వీఎం లెక్కల ప్రకారం గతేడాది 4,856 మందిని గుర్తించిన అధికారులు, అందులో 2,556 మంది 14 ఏళ్ల పైబడిన వారిగా తేల్చారు. 1,232 మందిని బడుల్లో చేర్పించినట్లు చెప్తుండగా ఇటీవల చేసిన సర్వేలో 34 మండలాల్లో 1,062 మంది బడిబయటే ఉన్నట్లు తేలింది. అధికారులు బడిఈడు పిల్లలు రోడ్ల వెంబడి తిరిగినా అంతగా శ్రద్ధ చూపడం లేదు. గతంలో గుర్తించన పిల్లలు పలువురు పాఠశాలలకే వెళ్లలేదు. ఇదిలా వుంటే ఆర్వీఎం, బాలకార్మిక నిర్మూలన వ్యవస్థ, కార్మిక శాఖలు సంయుక్తంగా కలిసి పనిచేయాల్సి ఉండగా.. ఇవేమీ పట్టించుకోవడం లేదు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యానికి అంతగా ప్రయోజనం లేకుండా పోతుంది.