సూపర్ స్టార్ సినిమాలో మెగాస్టార్..? | mammootty to play an important role in rajinikanths kaala | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్ సినిమాలో మెగాస్టార్..?

Published Sun, Jun 4 2017 12:42 PM | Last Updated on Tue, Sep 5 2017 12:49 PM

సూపర్ స్టార్ సినిమాలో మెగాస్టార్..?

సూపర్ స్టార్ సినిమాలో మెగాస్టార్..?

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా కాలా. కబాలి లాంటి భారీ చిత్రాన్ని అందించిన రజనీకాంత్, పా రంజిత్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను రజనీ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే రజనీతో పాటు బాలీవుడ్ నటుడు నానా పటేకర్ నటిస్తుండటంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి.

తాజాగా మరో ఆసక్తికరమైన వార్త కోలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. రజనీ మాఫీయా డాన్గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. గతంలో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన దళపతి సినిమాలో కలిసి నటించిన ఈ స్టార్స్ లాంగ్ గ్యాప్ తరువాత మరోసారి తెరను పంచుకోవటం హాట్ టాపిక్ మారింది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement