
చాలా ఏళ్ల తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్, ఒకే ఏడాదిలో రెండు సినిమాలను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ముందుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 2.ఓ సినిమాను జనవరి 25న తరువాత మూడు నెలల విరామం తీసుకొని వేసవి కానుకగా కాలా సినిమాను రిలీజ్ చేయాలని భావించారు. అయితే నిర్మాణాంతర కార్యక్రమాలు ఆలస్యమవుతుండటంతో 2.ఓ సినిమా అనుకున్నట్టుగా జనవరిలో కాకుండా ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నారన్న ప్రచారం జరుగుతోంది.
దీంతో కోలీవుడ్‌లో మరో ప్రచారం మొదలైంది. 2.ఓ ఆలస్యం అవుతుంది కనుక ఈ లోగా జనవరిలో పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాలా సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని కాలా చిత్ర నిర్మాత, హీరో ధనుష్ ఖండించారు. ఇంకా కాలా షూటింగ్ పూర్తి కాలేదని జనవరిలోనే రిలీజ్ అంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. దీంతో మరో సారి సూపర్ స్టార్ అభిమానులకు నిరాశే ఎదురైంది.
Contrary to rumours and articles, #Kaala would not be ready for a January nor Pongal release. @dhanushkraja @vinod_wunderbar
— Wunderbar Films (@WunderbarFilms_) 30 October 2017
Comments
Please login to add a commentAdd a comment