
తమిళసినిమా: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కాలా చిత్రం ఇటీవల తెరపైకి వచ్చి విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న విషయం తెలిసిందే. దీంతో రజనీకాంత్ తన తాజా చిత్రానికి రెడీ అయిపోయారు. కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న కొత్త చిత్రం చిత్రీకరణ జరుపుకుంటోంది కూడా. కాలా చిత్ర దర్శకుడు పా.రంజిత్ నెక్ట్స్ చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. అట్టకత్తి చిత్రంలో మొదలైన ఈ దర్శకుడిగా పయనం ఈ దర్శకుడు మెడ్రాస్, కబాలి, కాలా వరకూ సక్సెస్‌ఫుల్‌గా సాగింది. దీంతో నెక్ట్స్ ఏంటీ అన్నదానికి పా.రంజిత్ ఇటీవల నటుడు శింబును కలిశారు. ఆయనతో చిత్రం చేయనున్నారా అనే ప్రచారం జరిగింది. తాజాగా నటుడు సూర్య హీరోగా చిత్రం చేయనున్నారనే ప్రచారం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది.
నిజానికి పా.రంజిత్ మెడ్రాస్ చిత్రం తరువాతే సూర్యతో చిత్రం చేయాల్సింది. అయితే రజనీకాంత్‌ను దర్శకత్వం చేసే అవకాశం రావడంతో ఆ ప్రపోజల్ ఆగింది. తాజాగా మళ్లీ సూర్య హీరోగా పా.రంజిత్ చిత్రం చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. వీరి కలయికలో చిత్రం వస్తే ఎలా ఉంటుందో ఊహించవచ్చు. సామాజిక అంశాలే పా.రంజిత్ కథా చిత్రాలుగా ఉంటాయనడానికి ఆయన గత చిత్రాలే సాక్ష్యం. అయితే ఈ కాంబినేషన్‌లో చిత్రం గురించి ఇంకా అధికారికపూర్వక ప్రకటన రాలేదు. ప్రస్తుతం సూర్య ఎన్‌జీకే చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తదుపరి కేవీ.ఆనంద్ దర్శకత్వంలో నటించనున్నారు. ఆ తరువాతే పా.రంజిత్ దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment