రజనీకాంత్‌, ధనుష్‌లకు ఊరట | Court Judgment on Kaala Controversy | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌, ధనుష్‌లకు ఊరట

Published Wed, Nov 1 2017 10:31 AM | Last Updated on Wed, Nov 1 2017 10:31 AM

Court Judgment on Kaala Controversy

సౌత్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా ఆయన అల్లుడు కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ నిర్మాతగా తెరకెక్కిస్తున్న సినిమా కాలా. రజనీకాంత్‌ తో కబాలి సినిమాను తెరకెక్కించిన పా రంజిత్‌ ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాపై కథలో రాజశేఖర్‌ అనే వ్యక్తి కేసు వేసిన సంగతి తెలిసిందే. తాను కరికాలన్‌ పేరుతో తయారు చేసుకున్న కథను తన అనుమతి లేకుండా కాలా పేరుతో తెరకెక్కిస్తున్నారని. తాను రిజిస్టర్‌ చేయించుకున్న కరికాలన్‌ అనే పేరులోని కాలా అన్న పదాన్ని కూడా తన అనుమతి లేకుండానే వినియోగించుకుంటున్నారని కాలా యూనిట్‌ పై రాజశేఖర్‌ కేసు వేశారు. ఈ పిటీషన్‌ను విచారించిన న్యాయస్థానం హీరో రజనీకాంత్‌, నిర్మాత ధనుష్‌, దర‍్శకుడు పా రంజిత్‌ లకు నోటీసులు జారీ చేసింది.

ఈ నోటీసులపై స్పందించిన చిత్రయూనిట్‌, తాము ఎవరి కథను తీసుకోలేదని పా రంజిత్‌ స్వయంగా రాసుకున్న కథతోనే కాలాను తెరకెక్కిస్తున్నామని తెలిపారు. టైటిల్‌ పూర్తి చాలా రోజుల క్రితమే రిజిస్టర్‌ చేయించామని క్లారిటీ ఇచ్చారు. కేవలం వ్యక్తిగత లాభం కోసమే రాజశేఖర్‌ తమ చిత్రంపై ఆరోపణలు చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. టైటిల్‌ రిజిస్టర్‌ చేయించిన సంవత్సరం లోపు చిత్రాన్ని ప్రారంభించాలని కానీ రాజశేఖర్‌ కరికాలన్‌చిత్రాన్నిఇంత వరకు ప్రారంబించలేదు. 2006లో టైటిల్‌ రెన్యువల్‌ కూడా చేయలేదని తెలిపారు. కాలా యూనిట్‌ వాదనతో ఏకభవించిన న్యాయస్థానం రాజశేఖర్‌ పిటీషన్‌ను కొట్టివేస్తూ తీర్పు నిచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement