రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కబాలి ఫేం పా రంజిత్ దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 7న రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ వెల్లడించారు. ఈ సినిమాలోని ఒక పాటను ఏకంగా పది లక్షల మందితో రికార్డ్ చేసినట్టుగా తన సోషల్ మీడియా పేజ్ ద్వారా వెల్లడించారు సంతోష్.
‘నాకు ఎప్పటి నుంచో ఒక పాటు పది లక్షల గొంతులను రికార్డ్ చేయాలన్న కల ఉంది. కాలా సినిమాలోని పాటకు ఆ అవకాశం దక్కింది. అన్ని వర్గాలకు చెందిన ప్రజలతో రికార్డింగ్ చేయడం గౌరవంగా భావిస్తున్నా. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం.’ అంటూ ట్వీట్ చేశారు సంతోష్ నారాయణన్. రజనీకాంత్ డాన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నానా పటేకర్, ఈశ్వరీ రావు, హుమా ఖురేషీ, సముద్రఖనిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
I have always had this dream of recording a million voices in a song & have the perfect opportunity in a song from #kaala. It would be a great honour recording people from all walks of life. We are so excited and will update details very shortly.Peace! #kaala1million
— Santhosh Narayanan (@Music_Santhosh) 29 April 2018
Comments
Please login to add a commentAdd a comment