Voices
-
చనిపోయినా.. వారి గొంతు వినిపిస్తుంది!
మీకు ఎంతో ఇష్టమైన వారిని కోల్పోయామని బాధపడుతున్నారా? మీ ఆప్తులను తిరిగి మీ ఇంటికి తెస్తామంటోంది అమెజాన్ కంపెనీ. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? అయితే ఓ లుక్కేయండి.. అలెక్సా అసిస్టెంట్ కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) సాంకేతికత సాయంతో చనిపోయిన మీ బంధువులను/ఆప్తులను మీ వద్దకు చేరుస్తామంటోంది! వారిని భౌతికంగా తీసుకురాలేనప్పటికీ వారి గొంతుకను మనకు వినిపిస్తామంటోంది. అమెజాన్‌లో బాగా ప్రాచుర్యం పొందిన అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌కు సంబంధించిన కొత్త ఫీచర్‌ను కంపెనీ ఇటీవల ఆవిష్కరించింది. అది చనిపోయిన వారి గొంతుకతో మాట్లాడుతుంది. రికార్డు చేసిన వారి వాయిస్ ఆధారంగా అలెక్సా అచ్చం వారిలాగే మాట్లాడి మనల్ని మురిపిస్తుంది. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో ఇటీవల నిర్వహించిన వార్షిక సదస్సులో అమెజాన్ దీన్ని ప్రదర్శించింది. ఒక నిమిషం కన్నా తక్కువ నిడివి ఉన్న రికార్డెడ్ వాయిస్‌ను విని ఇది ఎవరి గొంతుతోనైనా ఇట్టే మాట్లాడేయగలదని కంపెనీ వెల్లడించింది. నానమ్మా.. కథ చెప్పవా? వాయిస్ అసిస్టెంట్‌కు సంబంధించిన వీడియోను అలెక్సా ఏఐ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్, హెడ్ సైంటిస్ట్ రోహిత్ ప్రసాద్ ఆ సదస్సులో ప్రదర్శించారు. ఆ వీడియోలో ఏముందంటే ఒక పదేళ్ల బాలుడు ‘అమెజాన్ ఎకో డాట్’తో ‘అలెక్సా.. మా నానమ్మ ద్వారా ‘ది విజార్డ్ ఆఫ్ ఓజ్’ కథను నాకు వినిపించవా’ అని అడుగుతాడు. అప్పుడు అలెక్సా.. ఓకే అని చెప్పి ఆ బాలుడు అడిగినట్లు చనిపోయిన వాళ్ల నానమ్మ గొంతుకతో ఆ కథను చదివి వినిపిస్తుంది. ఈ వీడియో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. జ్ఞాపకాలు పదిలంగా.. ‘ప్రస్తుత ప్యాండెమిక్ సమయంలో మనకెంతో ఇష్టమైన వారిని కోల్పోయాం. ఈ కృత్రిమ మేథ వారిని కోల్పోయామన్న బాధను తప్పించలేనప్పటికీ.. వారి జ్ఞాపకాలను మాత్రం మనకు అందిస్తుంది. అలెక్సా ద్వారా వారి జ్ఞాపకాలను మనం పదిలపరుచుకోవచ్చు’ అని రోహిత్ ప్రసాద్ ఉద్వేగంగా చెప్పారు. అయితే ఈ టెక్నాలజీని ఎప్పుడు అందుబాటులోకి తెస్తారో ఆయన వెల్లడించలేదు. – సాక్షి సెంట్రల్‌డెస్క్ -
గాన గంధర్వుడు బాలు మ్యూజికల్ మ్యాజిక్: వైరల్ వీడియో
సాక్షి, హైదరాబాద్: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తుది శ్వాస విడిచి సంవత్సరం ముగిసినా ఆ అమర గాయకుడిని మర్చి పోవడం అభిమానులకు వశం కావడం లేదు. అమృతగానంతో ఓలలాడించిన బాలుని తలచుకుని ఇప్పటికీ కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన జ్ఞాపకాలను పదే పదే నెమరువేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో బాలుకి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. రావోయి చందమామ అంటూ మధుర గాత్రంలొ అయిదు రకాల గొంతులతో ఆయన చేసిన మ్యాజిక్‌ను మరోసారి ఎంజాయ్ చేస్తున్నారు. బాలు జ్ఞాపకాలుఅనే ట్విటర్ ఖాతా ఈ వీడియోను షేర్ చేసింది. When Balu garu gave us a glimpse of his mimicry talent with the classic "Raavoyi Chandamama", in 5 different voices...#SPBLivesOn ❤🙏#SPBalasubrahmanyam pic.twitter.com/L6NZVRk8Uh — బాలు జ్ఞాపకాలు (@balu_jnapakalu) September 28, 2021 -
ఒక్క పాటలో పది లక్షల గొంతులు
రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కబాలి ఫేం పా రంజిత్ దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 7న రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ వెల్లడించారు. ఈ సినిమాలోని ఒక పాటను ఏకంగా పది లక్షల మందితో రికార్డ్ చేసినట్టుగా తన సోషల్ మీడియా పేజ్ ద్వారా వెల్లడించారు సంతోష్. ‘నాకు ఎప్పటి నుంచో ఒక పాటు పది లక్షల గొంతులను రికార్డ్ చేయాలన్న కల ఉంది. కాలా సినిమాలోని పాటకు ఆ అవకాశం దక్కింది. అన్ని వర్గాలకు చెందిన ప్రజలతో రికార్డింగ్ చేయడం గౌరవంగా భావిస్తున్నా. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం.’ అంటూ ట్వీట్ చేశారు సంతోష్ నారాయణన్. రజనీకాంత్ డాన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నానా పటేకర్, ఈశ్వరీ రావు, హుమా ఖురేషీ, సముద్రఖనిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. I have always had this dream of recording a million voices in a song & have the perfect opportunity in a song from #kaala. It would be a great honour recording people from all walks of life. We are so excited and will update details very shortly.Peace! #kaala1million — Santhosh Narayanan (@Music_Santhosh) 29 April 2018 -
పక్కబలంతో పీఠమెక్కిన దేశాధ్యక్షులు
సొంత బలం లేకున్నా పక్కపార్టీల జంప్‌జిలానీలతో అడ్డదారిలో పీఠమెక్కిన దేశం ప్రలోభాలతో అత్యధిక ఎంపీపీ స్థానాలను గెలుచుకున్న టీడీపీ మెంటాడలో ఎన్నిక వాయిదా విజయనగరం ఫోర్: మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో తెలు గు దేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకుంది. కుటీలరాజకీయాలు, ప్రలోభాల తో జిల్లాలో అత్యధిక స్థానాలను గెలుచుకుంది. మెజార్టీ లేని చోట సైతం ప్రలోభాలకు గురిచేసి ఎంపీపీ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఎంపీటీసీ సభ్యులకు రూ.లక్షల్లో ఆశ చూపి తమవైపు తిప్పుకొంది. కొన్ని చోట్ల ఉపాధ్యక్ష స్థానాల ను ఎరవేసింది. ఒక పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీలోకి జం ప్ అవడం సమంజసం కాదని గతంలో పదేపదే వల్లించిన టీ డీపీ నాయకులు ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించి, త మ దారి అడ్డదారని నిరూపించుకున్నారు. ఎమ్మెల్యేలు సైతం దగ్గర ఉండి మరీ పార్టీ ఫిరాయింపులను ప్రొత్సహించారు. జిల్లాలో 34 మండల్ పరిషత్ స్థానాలు ఉన్నాయి. వీటి అ ధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు శుక్రవారం ఎన్నికలు జరిగాయి. ఇందులో 26 స్థానాలను టీడీపీ కైవసం చేసుకోగా, ఆరు స్థానాలను ైవె ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఒక స్థానాన్ని టీడీపీ రెబల్ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గె లుచుకున్నారు. మెంటాడలో టీడీపీ అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ రిజర్వేషన్లు ప్రకారం ఎంపీపీ పదవిని చేపట్టేడానికి అభ్యర్థి లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేయిం చినట్టు తెలుస్తుంది. టీడీపీ కైవశం చేసుకున్న మండలాలు: విజయనగరం, పార్వతీపురం, చీపురుపల్లి, గరివిడి, గుర్ల, మెరకముడిదాం, బాడం గి, రామభద్రపురం, సాలూరు, మక్కువ,కొమరాడ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, నెల్లిమర్ల, డెంకాడ, భోగాపురం, పూసపాటిరేగ, ఎస్.కోట, వేపాడ, లక్కవరపుకోట, కొత్తవలస, జామి, గజపతినగరం, గంట్యాడ, బొండపల్లి, దత్తిరాజేరు. వైఎస్ఆర్ సీపీ గెలుపొందిన స్థానాలు: బొబ్బిలి, సీతానరం, తెర్లాం, పాచిపెంట, కురుపాం, గుమ్మలక్ష్మీపురం ఇతరులు: బలిజిపేట (వెస్‌ఆర్ సీపీ మద్దతుతో టీడీపీ రెబల్ అభ్యర్థి విజయం సాధించారు. బాడంగి మండలంలో 14 స్థానాలకు తెలుగుదేశం, వైఎ స్సార్ కాంగ్రెస్‌లకు చెరో ఏడు స్థానాల చొప్పున వచ్చాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు చెందిన పాల్తేరు ఎంపీటీసీ స భ్యురాలిని తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు గురిచేసి పార్టీలో చేర్చుకుంది. ఇక్కడ టీడీపీ ఎంపీపీ పీఠాన్ని వశం చేసుకుంది. రామభద్రపురం మండలంలో మొత్తం 14 స్థానాలకు గాను టీడీపీ, వైఎస్ఆర్ సీపీలకు చెరో ఏడు స్థానాలు వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎంపీటీసీ సభ్యులను తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు గురి చేసి, మండలాధ్యక్ష పదవిని సొంతం చేసుకుంది. సాలూరులో 16 స్థానాలలో టీడీపీ ఏడు, వైఎస్ఆర్ కాం గ్రెస్ - ఎనిమిది, ఒక ఇండిపెండెంట్ సభ్యుడు విజయం సా ధించగా, వైఎస్ఆర్ సీపీకి చెందిన ఒక ఎంపీటీసీని టీడీపీ తనవైపు తిప్పుకోవడంతో సాలూరు టీడీపీ ఖాతాలో చేరింది. భోగాపురంలో 17 స్థానాలకు గాను అత్యధికంగా ఏడు స్థా నాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. టీడీపీకి- 5, వైఎస్ఆర్ సీపీకి నాలుగు స్థానాలు దక్కాయి. అయితే బలం లేనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎంపీటీసీ సభ్యులను ప్రలోభాలకు గురిచేసి టీడీపీ పార్టీలో చేర్చుకుంది. దీం తో ఇక్కడ ఎంపీపీ పదవి టీడీపీ వశమైంది. మెరకముడిదాం మండలంలో మొత్తం 16 స్థానాలకు గాను టీడీపీ ఆరు, కాంగ్రెస్ ఏడు, వైఎస్ఆర్ సీపీ రెండు, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు. ఇక్కడ టీడీపీకి ఆధిక్యత లేనప్పటీకీ వైఎస్ఆర్ సీపీకి చెందిన ఇద్దరిని, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎంపీటీసీ సభ్యుడిని ప్రలోభపెట్టి పార్టీలో చే ర్చుకున్నారు. ఎంపీపీ పీఠం టీడీపీ ఖాతాలో పడింది. దత్తిరాజేరు మండలంలో 16 స్థానాలకు గాను టీడీపీ ఐదు, వైఎస్ఆర్సీపీ ఆరు, కాంగ్రెస్ నాలుగు, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత లేనప్పటికీ వైఎస్ఆర్ సీపీకి చెందిన ఇద్దరు సభ్యులను ప్రలోభపెట్టి తన వైపు తిప్పుకుంది. దీంతో ఎంపీపీ పీఠం టీడీపీ వశమయింది. బలిజిపేటలో మొత్తం 17 స్థానాలకు గాను టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ చెరో ఎనిమిది స్థానాలు గెలుచుకోగా, స్వతంత్ర (టీడీపీ రెబల్) అభ్యర్థి పార్వతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకడంతో ఆమె ఎంపీపీగా ఎన్నికయ్యారు. మెంటాడ మండలంలో టీడీపీకి అత్యధిక స్థానాలున్నా, ఎంపీపీ రిజర్వేషన్ కేటగిరీలో ఆ పార్టీకి చెందిన వారు గెలవకపోవడంతో ఎన్నికను వాయిదా వేసుకున్నారు.