పక్కబలంతో పీఠమెక్కిన దేశాధ్యక్షులు | tdp wins all mpp seats | Sakshi
Sakshi News home page

పక్కబలంతో పీఠమెక్కిన దేశాధ్యక్షులు

Published Sat, Jul 5 2014 4:14 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

పక్కబలంతో పీఠమెక్కిన దేశాధ్యక్షులు - Sakshi

పక్కబలంతో పీఠమెక్కిన దేశాధ్యక్షులు

  •     సొంత బలం లేకున్నా పక్కపార్టీల జంప్‌జిలానీలతో
  •       అడ్డదారిలో పీఠమెక్కిన దేశం
  •      ప్రలోభాలతో అత్యధిక ఎంపీపీ స్థానాలను
  •      గెలుచుకున్న టీడీపీ
  •      మెంటాడలో ఎన్నిక వాయిదా  
  •  విజయనగరం ఫోర్:  మండల పరిషత్  అధ్యక్ష ఎన్నికల్లో తెలు గు దేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకుంది. కుటీలరాజకీయాలు, ప్రలోభాల తో జిల్లాలో అత్యధిక స్థానాలను గెలుచుకుంది. మెజార్టీ లేని చోట సైతం  ప్రలోభాలకు గురిచేసి ఎంపీపీ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఎంపీటీసీ సభ్యులకు రూ.లక్షల్లో  ఆశ చూపి తమవైపు తిప్పుకొంది.
     కొన్ని చోట్ల ఉపాధ్యక్ష స్థానాల ను ఎరవేసింది.

    ఒక పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీలోకి జం ప్ అవడం సమంజసం కాదని గతంలో పదేపదే వల్లించిన టీ డీపీ నాయకులు ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించి, త మ దారి అడ్డదారని నిరూపించుకున్నారు.  ఎమ్మెల్యేలు సైతం దగ్గర ఉండి మరీ  పార్టీ ఫిరాయింపులను ప్రొత్సహించారు. జిల్లాలో 34  మండల్ పరిషత్ స్థానాలు ఉన్నాయి. వీటి అ ధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు శుక్రవారం ఎన్నికలు జరిగాయి.

    ఇందులో 26 స్థానాలను టీడీపీ కైవసం చేసుకోగా, ఆరు స్థానాలను ైవె ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఒక స్థానాన్ని టీడీపీ రెబల్ అభ్యర్థి వైఎస్‌ఆర్  కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గె లుచుకున్నారు. మెంటాడలో  టీడీపీ అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ రిజర్వేషన్లు ప్రకారం ఎంపీపీ పదవిని చేపట్టేడానికి అభ్యర్థి లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేయిం చినట్టు తెలుస్తుంది.
     
    టీడీపీ కైవశం చేసుకున్న మండలాలు: విజయనగరం, పార్వతీపురం, చీపురుపల్లి, గరివిడి, గుర్ల, మెరకముడిదాం, బాడం గి, రామభద్రపురం, సాలూరు, మక్కువ,కొమరాడ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, నెల్లిమర్ల, డెంకాడ, భోగాపురం, పూసపాటిరేగ, ఎస్.కోట, వేపాడ, లక్కవరపుకోట, కొత్తవలస, జామి, గజపతినగరం, గంట్యాడ, బొండపల్లి, దత్తిరాజేరు.
     
    వైఎస్‌ఆర్ సీపీ గెలుపొందిన స్థానాలు: బొబ్బిలి, సీతానరం, తెర్లాం, పాచిపెంట, కురుపాం, గుమ్మలక్ష్మీపురం
     
    ఇతరులు: బలిజిపేట (వెస్‌ఆర్ సీపీ మద్దతుతో టీడీపీ రెబల్ అభ్యర్థి విజయం సాధించారు.
    బాడంగి మండలంలో 14 స్థానాలకు  తెలుగుదేశం, వైఎ స్సార్ కాంగ్రెస్‌లకు చెరో ఏడు స్థానాల చొప్పున వచ్చాయి. అయితే  వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు చెందిన  పాల్తేరు  ఎంపీటీసీ స భ్యురాలిని తెలుగుదేశం పార్టీ  ప్రలోభాలకు గురిచేసి పార్టీలో చేర్చుకుంది. ఇక్కడ టీడీపీ ఎంపీపీ పీఠాన్ని వశం చేసుకుంది.  
     
    రామభద్రపురం మండలంలో మొత్తం 14 స్థానాలకు గాను టీడీపీ, వైఎస్‌ఆర్ సీపీలకు చెరో ఏడు స్థానాలు వచ్చాయి.   వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎంపీటీసీ సభ్యులను  తెలుగుదేశం పార్టీ  ప్రలోభాలకు గురి చేసి, మండలాధ్యక్ష పదవిని సొంతం చేసుకుంది.
       
    సాలూరులో 16 స్థానాలలో టీడీపీ ఏడు,  వైఎస్‌ఆర్ కాం గ్రెస్ - ఎనిమిది, ఒక  ఇండిపెండెంట్ సభ్యుడు విజయం సా ధించగా,  వైఎస్‌ఆర్ సీపీకి చెందిన ఒక ఎంపీటీసీని టీడీపీ తనవైపు తిప్పుకోవడంతో సాలూరు టీడీపీ ఖాతాలో చేరింది.
       
    భోగాపురంలో 17 స్థానాలకు గాను  అత్యధికంగా ఏడు స్థా నాలను  కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. టీడీపీకి- 5, వైఎస్‌ఆర్ సీపీకి నాలుగు స్థానాలు దక్కాయి. అయితే బలం లేనప్పటికీ  వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎంపీటీసీ సభ్యులను ప్రలోభాలకు గురిచేసి  టీడీపీ పార్టీలో చేర్చుకుంది. దీం తో ఇక్కడ  ఎంపీపీ పదవి టీడీపీ వశమైంది.  
     
    మెరకముడిదాం మండలంలో మొత్తం 16 స్థానాలకు గాను టీడీపీ ఆరు, కాంగ్రెస్ ఏడు, వైఎస్‌ఆర్ సీపీ రెండు, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు.  ఇక్కడ టీడీపీకి ఆధిక్యత లేనప్పటీకీ వైఎస్‌ఆర్ సీపీకి చెందిన ఇద్దరిని, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎంపీటీసీ సభ్యుడిని ప్రలోభపెట్టి పార్టీలో చే ర్చుకున్నారు. ఎంపీపీ పీఠం టీడీపీ ఖాతాలో పడింది.
     
    దత్తిరాజేరు మండలంలో 16 స్థానాలకు గాను టీడీపీ ఐదు, వైఎస్‌ఆర్‌సీపీ ఆరు, కాంగ్రెస్ నాలుగు, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు. అయితే ఇక్కడ  తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత లేనప్పటికీ వైఎస్‌ఆర్ సీపీకి చెందిన ఇద్దరు సభ్యులను ప్రలోభపెట్టి తన వైపు తిప్పుకుంది.   దీంతో ఎంపీపీ పీఠం టీడీపీ వశమయింది.
     
    బలిజిపేటలో మొత్తం 17 స్థానాలకు గాను  టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ చెరో ఎనిమిది స్థానాలు గెలుచుకోగా, స్వతంత్ర (టీడీపీ రెబల్) అభ్యర్థి పార్వతికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకడంతో ఆమె ఎంపీపీగా ఎన్నికయ్యారు.   
    మెంటాడ మండలంలో టీడీపీకి అత్యధిక స్థానాలున్నా, ఎంపీపీ రిజర్వేషన్ కేటగిరీలో ఆ పార్టీకి చెందిన వారు గెలవకపోవడంతో ఎన్నికను వాయిదా వేసుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement