MPP positions
-
ఐదు ఎంపీపీ స్థానాలు వైఎస్సార్సీపీకే..
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 5 చోట్ల ఎంపీపీ స్థానాలకు గురువారం ఎన్నికలు నిర్వహించగా.. ఐదు చోట్లా వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. 15 మండలాల పరిధిలో 6 ఎంపీపీ, 11 ఉపాధ్యక్ష, మూడు కో–ఆప్షన్ సభ్యుల ఎంపికకు ఎన్నిక నిర్వహించారు. అయితే చిత్తూరు జిల్లా రామకుప్పం ఎంపీపీ ఎన్నికకు సభ్యులు ఎవ్వరూ హాజరు కాలేదు. దీంతో ఇక్కడ మరోసారి ఎన్నిక వాయిదా పడింది. 11 ఉపాధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉండగా 8 చోట్ల ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. వీటిలో ఐదు స్థానాలను వైఎస్సార్సీపీ, రెండు టీడీపీ, ఒకటి జనసేన కైవసం చేసుకున్నాయి. గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎన్నికలో జనసేన, టీడీపీ ఉమ్మడిగా పాల్గొన్నాయి. పరస్పర మద్దతుతో చెరో ఉపాధ్యక్ష స్థానాన్ని చేజిక్కించుకున్నారు. అయితే ఈ ఇద్దరు అభ్యర్థులు సకాలంలో బీ–ఫామ్ సమర్పించలేదు. పల్నాడు జిల్లా నరసరావుపేట, అన్నమయ్య జిల్లా కలికిరి, చిత్తూరు జిల్లా రామకుప్పంలలో ఉపాధ్యక్ష ఎన్నికలు వాయిదా పడ్డాయి. కో–ఆప్షన్ ఎన్నికలు మూడు చోట్ల నిర్వహించారు. 41 పంచాయతీల్లో ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించగా 13 చోట్ల వాయిదా పడ్డాయి. -
బీసీలకు 94 ఎంపీపీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ)ల రిజర్వేషన్ల లెక్కలు కొలిక్కి వచ్చాయి. మొత్తం 32 జిల్లా ప్రజాపరిషత్‌ల పరిధిలోని 535 మండల ప్రజాపరిషత్ (రాష్ట్రంలోని గ్రామీణ రెవెన్యూ మండలాలు)లలో 33 మండలాలు షెడ్యూల్డ్ ఏరియాల్లో ఉన్నాయి. మిగతా నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని 502 మండలాల్లో 50 శాతం అంటే 251 మండలాల్లోని ఎంపీపీ స్థానాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వాటిలో ఎస్టీలకు 59 రిజర్వ్‌కాగా, ఎస్సీలకు 98, బీసీలకు 94 రిజర్వ్ అయ్యాయి. ఈ కేటగిరిలన్నింటిలోనూ మహిళలకు 50 శాతం స్థానాలు రిజర్వ్ చేశారు. మిగతా 251 అన్ రిజర్వ్డ్గా పరిగణిస్తుండగా అందులోనూ మహిళలకు 50 శాతం ఎంపీపీ స్థానాలు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ కేటగిరీలో మహిళలకు 125, పురుషులు/మహిళలు పోటీపడే విధంగా 126 ఎంపీపీ స్థానాలు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లోని వివిధ మండలాలవారీగా ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన ఈ వర్గాల ఎంపీపీ స్థానాలు రిజర్వ్ చేశాక ఓటర్ల జాబితా ఆధారంగా బీసీలకు ఎంపీపీ స్థానాలు కేటాయించారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సుప్రీంకోర్డు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలోని ఎంపీపీ స్థానాల్లో రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 32 జిల్లాల్లోని మండలాలవారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఖరారు సందర్భంగా ఈ లెక్కలు తేలాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ కుమారీ ప్రసాద్ ఎంపీపీ స్థానాల్లో రిజర్వేషన్లను ఖరారు చేశారు. మహిళలకు 267 ఎంపీపీ స్థానాలు రిజర్వ్ అన్ని కేటగిరిల్లో మహిళలకు 50 శాతం స్థానాలు కేటాయించాలన్న నిబంధన నేపథ్యంలో వివిధ ఎంపీపీల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు సంబంధించి మహిళల ప్రాతినిధ్యం పెరగనుంది. షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాలు కలుపుకుని ఎస్టీ, ఎస్సీ, బీసీలకు సంబంధించి మొత్తం 142 స్థానాలు మహిళలకు రిజర్వ్ చేశారు. షెడ్యూల్డ్ ఏరియాల మండలాల్లోని ఎంపీపీల్లో మహిళలకు 16, నాన్ షెడ్యూల్డ్ మండలాల్లో 30 ఎంపీపీలు ఎస్టీ మహిళలకు, 49 ఎస్సీ మహిళలకు, 47 బీసీ మహిళలకు ఎంపీపీ అధ్యక్ష స్థానాలు రిజర్వయ్యాయి. అంతేకాకుండా అన్ రిజర్వ్డ్ కేటగిరీలో 125 ఎంపీపీ స్థానాలు మహిళలకు కేటాయించారు. మొత్తం కలిపి మహిళలకు 267 ఎంపీపీ అధ్యక్ష స్థానాలు ఖరారయ్యాయి. ఇవే కాకుండా మిగతా అన్ రిజర్వ్డ్ ఎంపీపీ అధ్యక్ష స్థానాల్లోనూ పురుషులతో మహిళలు పోటీ పడే అవకాశాలున్నాయి. పునర్విభజనతో మారిన పలు మండలాల లెక్కలు... జిల్లా, మండల పరిషత్‌ల పునర్విభజన సందర్భంగా షెడ్యూల్డ్ మండలాలుగా ఉన్న బయ్యారం, గార్ల, గంగారంలను సరిగ్గా లెక్కించ లేదు. తాజాగా దాన్ని సరిచేయడంతో వాటిని షెడ్యూల్డ్ మండలాల జాబితాలో చేర్చారు. గతంలో జనగామ జిల్లాలో ఉన్న గుండాల మండలాన్ని యాదాద్రి జిల్లాలో చేర్చడంతో జనగామ జిల్లా నుంచి ఆ మండలాన్ని మినహాయిం చారు. దీంతో ఆ జిల్లాలో మండలాల సంఖ్య 12కు తగ్గింది. కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లాలో బీసీలకు మరో ఎంపీపీ స్థానాన్ని అదనంగా కేటాయించారు. ఆ మేరకు ఆ జిల్లాలో అన్ రిజర్వ్డ్ కేటగిరీలో ఒక స్థానం తగ్గింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీసీ రిజర్వేషన్లలో మార్పుల కారణంగా మహిళా రిజర్వేషన్లలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ఈ మేరకు ఆయా జిల్లాల్లో చోటుచేసుకున్న మార్పుల గురించి పీఆర్ కమిషనర్ తెలియజేశారు. -
‘పెడన’ వైఎస్సార్ సీపీ కైవసం
మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ పదవులు వైఎస్సార్సీపీకే పెడన టౌన్(చిలకలపూడి): కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గ పరిధిలోని పెడన మున్సిపల్ చైర్మన్, మండల పరిషత్ అధ్యక్ష పదవులను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకుంది. వైఎస్సార్ సీపీకి చెందిన కౌన్సిలర్ బండారు ఆనందప్రసాద్ మున్సిపల్ చైర్మన్‌గా, ఎంపీటీసీ సభ్యుడు రాజులపాటి అచ్యుతరావు ఎంపీపీగా ఎన్నికయ్యారు. సాధారణ ఎన్నికల్లో ఈ రెండు స్థానాలు టీడీపీ దక్కించుకుంది. గతంలో మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న యర్రా శేషగిరిరావు మృతి చెందడం, ఎంపీపీగా ఉన్న ముచ్చు నాగేశ్వరమ్మ అనర్హతకు గురికావడంతో ఈ స్థానాలకు ఖాళీ ఏర్పడింది. దీంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారి ప్రసాద్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి బండారు ఆనందప్రసాద్ చైర్మన్‌గా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఇక పెడన మండల పరిషత్‌కు వైఎస్సార్సీపీ అభ్యర్థి రాజులపాటి అచ్యుతరావును అధ్యక్షునిగా ఎన్నిక చేస్తూ ఎన్నికల అధికారి ప్రకటించారు. కాగా, గతంలో టీడీపీ ఎమ్మెల్యే ఎక్స్అఫిషియో ఓటుతో మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ దక్కించుకుంది. అలాగే మండల పరిషత్‌కు సంబంధించి వైఎస్సార్సీపీ ఎంపీటీసీని తన వైపునకు లాక్కొని ఎంపీపీ పదవి చేజిక్కించుకుంది. -
కొలువుదీరిన ఎంపీపీలు.... ఆమే అధికం
సాక్షి, ఖమ్మం: ఎట్టకేలకు మండలాలకు కొత్త పాలకులు వచ్చేశారు. ఎంపీపీ పదవులను దక్కించుకోవడంలో ఎవరి బలాబలాలు ఏంటో తేలిపోయింది. క్యాంపులు, ఎత్తులు, పై ఎత్తులు, బేరసారాలు కొనసాగినప్పటికీ.. చివరకు ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయి. 36 మండలాల్లో బుధవారం ఎంపీపీ ఎన్నికలు నిర్వహించగా అందులో 25 స్థానాలను మహిళలే దక్కించుకోవడం విశేషం. మొత్తం 39 మండలాలకు గాను కోరం లేక, కోఅప్షన్ సభ్యుల ఎన్నిక జరగక కొత్తగూడెం, పాల్వంచ, రఘునాథపాలెంలలో ఎంపీపీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగిలిన 36 మండలాల్లో 17 టీడీపీ, 6 కాంగ్రెస్, సీపీఎం 5, వైఎస్సార్సీపీ 2, సీపీఐ 2, ఎన్డీ 2, స్వతంత్ర అభ్యర్థులు 2 ఎంపీపీలను దక్కించుకున్నారు. ఎంపీపీ ఎన్నికల్లో తొలుత కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. ఆతర్వాత ఎంపీపీ, వైస్ ఎంపీపీల ఎన్నిక జరిగింది. అన్ని పార్టీల్లో అభ్యర్థులు ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవుల కోసం పోటీ పడ్డారు. క్యాంపు రాజకీయాలు, ఎత్తులు.. పైఎత్తులు ఫలించడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు ఉత్కంఠ మధ్య పదవులు కైవసం చేసుకున్నారు. ఇక ఉపాధ్యక్షులుగా టీడీపీ 16, కాంగ్రెస్2, సీపీఎం 5, వైఎస్సార్ సీపీ 8, సీపీఐ 2, ఎన్డీ 2, స్వతంత్ర అభ్యర్థులు ఒకరు దక్కించుకున్నారు. కల్లూరు మండలంలోని 18 ఎంపీటీసీల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ బలం సమానంగా ఉండడంతో టాస్ వేయగా, టీడీపీ అభ్యర్థి అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. సత్తుపల్లి, పెనుబల్లి, తల్లాడ ఎంపీపీ స్థానాలను ఆ పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఇల్లెందు నియోజకవర్గంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాయల, చంద్రన్న వర్గాలు వేర్వేరుగా పోటీ పడ్డాయి. ఇల్లెందు ఎంపీపీ పీఠాన్ని సీపీఐ మద్దతుతో రాయలవర్గం కైవసం చేసుకుంది. బయ్యారం మండలంలో చంద్రన్న వర్గం ఎంపీపీకి తన అభ్యర్థిని బరిలోకి దింపింది. అయితే రాయలవర్గం, కాంగ్రెస్, టీడీపీ కూటమిగా తమ అభ్యర్థిని బరిలోకి దింపాయి. బలాబలాలు సమానంగా ఉండడంతో ఇక్కడ కూడా టాస్ వేయగా, రాయలవర్గం కూటమికి ఎంపీపీ పీఠం దక్కింది. ఇక ముంపు మండలాలైన చింతూరు, కూనవరం, వీఆర్‌పురం ఎంపీపీలను సీపీఎం తన ఖాతాలో వేసుకుంది. నేడు కొత్తగూడెం, పాల్వంచ ఎన్నికలు.. కొత్తగూడెం మండల పరిషత్‌కు తొలుత కో ఆప్షన్ సభ్యుడి ఎన్నిక కోసం నామినేషన్లు వేశారు. అయితే ఎంపీపీ ఎన్నికకు కోరం లేకపోవడంతో ఎన్నికను నిలిపివేశారు. అలాగే పాల్వంచ మండల పరిషత్‌లో నిర్దేశించిన గడువులో కో అప్షన్ సభ్యుని ఎన్నికకు ఎవ రూ నామినేషన్ దాఖలు చేయలేదు. ఈ పరిస్థితితో ఇక్కడా ఎంపీపీ ఎన్నిక నిలిచింది. ఈ రెండు చోట్ల గురువారం ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. రఘునాథపాలెం మండల పరిషత్‌కు కో అప్షన్ సభ్యులుగా ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఎంపీపీ ఎన్నిక నిలిచిపోయింది. ఇక్కడ జరిగిన పరిణామాలపై ఈసీకి ఫ్యాక్స్ ద్వారా తెలియజేశామని, కమిషనర్ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని రఘునాథపాలెం మండల ఎన్నికల అధికారి వేణుమనోహర్ ‘సాక్షి’కి తెలిపారు. -
పక్కబలంతో పీఠమెక్కిన దేశాధ్యక్షులు
సొంత బలం లేకున్నా పక్కపార్టీల జంప్‌జిలానీలతో అడ్డదారిలో పీఠమెక్కిన దేశం ప్రలోభాలతో అత్యధిక ఎంపీపీ స్థానాలను గెలుచుకున్న టీడీపీ మెంటాడలో ఎన్నిక వాయిదా విజయనగరం ఫోర్: మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో తెలు గు దేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకుంది. కుటీలరాజకీయాలు, ప్రలోభాల తో జిల్లాలో అత్యధిక స్థానాలను గెలుచుకుంది. మెజార్టీ లేని చోట సైతం ప్రలోభాలకు గురిచేసి ఎంపీపీ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. ఎంపీటీసీ సభ్యులకు రూ.లక్షల్లో ఆశ చూపి తమవైపు తిప్పుకొంది. కొన్ని చోట్ల ఉపాధ్యక్ష స్థానాల ను ఎరవేసింది. ఒక పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీలోకి జం ప్ అవడం సమంజసం కాదని గతంలో పదేపదే వల్లించిన టీ డీపీ నాయకులు ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించి, త మ దారి అడ్డదారని నిరూపించుకున్నారు. ఎమ్మెల్యేలు సైతం దగ్గర ఉండి మరీ పార్టీ ఫిరాయింపులను ప్రొత్సహించారు. జిల్లాలో 34 మండల్ పరిషత్ స్థానాలు ఉన్నాయి. వీటి అ ధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు శుక్రవారం ఎన్నికలు జరిగాయి. ఇందులో 26 స్థానాలను టీడీపీ కైవసం చేసుకోగా, ఆరు స్థానాలను ైవె ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఒక స్థానాన్ని టీడీపీ రెబల్ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గె లుచుకున్నారు. మెంటాడలో టీడీపీ అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ రిజర్వేషన్లు ప్రకారం ఎంపీపీ పదవిని చేపట్టేడానికి అభ్యర్థి లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేయిం చినట్టు తెలుస్తుంది. టీడీపీ కైవశం చేసుకున్న మండలాలు: విజయనగరం, పార్వతీపురం, చీపురుపల్లి, గరివిడి, గుర్ల, మెరకముడిదాం, బాడం గి, రామభద్రపురం, సాలూరు, మక్కువ,కొమరాడ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, నెల్లిమర్ల, డెంకాడ, భోగాపురం, పూసపాటిరేగ, ఎస్.కోట, వేపాడ, లక్కవరపుకోట, కొత్తవలస, జామి, గజపతినగరం, గంట్యాడ, బొండపల్లి, దత్తిరాజేరు. వైఎస్ఆర్ సీపీ గెలుపొందిన స్థానాలు: బొబ్బిలి, సీతానరం, తెర్లాం, పాచిపెంట, కురుపాం, గుమ్మలక్ష్మీపురం ఇతరులు: బలిజిపేట (వెస్‌ఆర్ సీపీ మద్దతుతో టీడీపీ రెబల్ అభ్యర్థి విజయం సాధించారు. బాడంగి మండలంలో 14 స్థానాలకు తెలుగుదేశం, వైఎ స్సార్ కాంగ్రెస్‌లకు చెరో ఏడు స్థానాల చొప్పున వచ్చాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు చెందిన పాల్తేరు ఎంపీటీసీ స భ్యురాలిని తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు గురిచేసి పార్టీలో చేర్చుకుంది. ఇక్కడ టీడీపీ ఎంపీపీ పీఠాన్ని వశం చేసుకుంది. రామభద్రపురం మండలంలో మొత్తం 14 స్థానాలకు గాను టీడీపీ, వైఎస్ఆర్ సీపీలకు చెరో ఏడు స్థానాలు వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎంపీటీసీ సభ్యులను తెలుగుదేశం పార్టీ ప్రలోభాలకు గురి చేసి, మండలాధ్యక్ష పదవిని సొంతం చేసుకుంది. సాలూరులో 16 స్థానాలలో టీడీపీ ఏడు, వైఎస్ఆర్ కాం గ్రెస్ - ఎనిమిది, ఒక ఇండిపెండెంట్ సభ్యుడు విజయం సా ధించగా, వైఎస్ఆర్ సీపీకి చెందిన ఒక ఎంపీటీసీని టీడీపీ తనవైపు తిప్పుకోవడంతో సాలూరు టీడీపీ ఖాతాలో చేరింది. భోగాపురంలో 17 స్థానాలకు గాను అత్యధికంగా ఏడు స్థా నాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. టీడీపీకి- 5, వైఎస్ఆర్ సీపీకి నాలుగు స్థానాలు దక్కాయి. అయితే బలం లేనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎంపీటీసీ సభ్యులను ప్రలోభాలకు గురిచేసి టీడీపీ పార్టీలో చేర్చుకుంది. దీం తో ఇక్కడ ఎంపీపీ పదవి టీడీపీ వశమైంది. మెరకముడిదాం మండలంలో మొత్తం 16 స్థానాలకు గాను టీడీపీ ఆరు, కాంగ్రెస్ ఏడు, వైఎస్ఆర్ సీపీ రెండు, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు. ఇక్కడ టీడీపీకి ఆధిక్యత లేనప్పటీకీ వైఎస్ఆర్ సీపీకి చెందిన ఇద్దరిని, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎంపీటీసీ సభ్యుడిని ప్రలోభపెట్టి పార్టీలో చే ర్చుకున్నారు. ఎంపీపీ పీఠం టీడీపీ ఖాతాలో పడింది. దత్తిరాజేరు మండలంలో 16 స్థానాలకు గాను టీడీపీ ఐదు, వైఎస్ఆర్సీపీ ఆరు, కాంగ్రెస్ నాలుగు, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత లేనప్పటికీ వైఎస్ఆర్ సీపీకి చెందిన ఇద్దరు సభ్యులను ప్రలోభపెట్టి తన వైపు తిప్పుకుంది. దీంతో ఎంపీపీ పీఠం టీడీపీ వశమయింది. బలిజిపేటలో మొత్తం 17 స్థానాలకు గాను టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ చెరో ఎనిమిది స్థానాలు గెలుచుకోగా, స్వతంత్ర (టీడీపీ రెబల్) అభ్యర్థి పార్వతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకడంతో ఆమె ఎంపీపీగా ఎన్నికయ్యారు. మెంటాడ మండలంలో టీడీపీకి అత్యధిక స్థానాలున్నా, ఎంపీపీ రిజర్వేషన్ కేటగిరీలో ఆ పార్టీకి చెందిన వారు గెలవకపోవడంతో ఎన్నికను వాయిదా వేసుకున్నారు. -
40 మండలాల్లో టీఆర్ఎస్ హవా
మొన్న పట్టణాల్లో.. నిన్న మండలాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుకుంది. అత్యధిక ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకుంది. హంగ్ ఫలితాలు వెలువడ్డ మండలాల్లోనూ అధికార ఎత్తుగడలతో విజయకేతనం ఎగరేసింది. కొన్ని చోట్ల ఉపాధ్యక్ష పదవులను ఎరవేసి ప్రతిపక్ష పార్టీలతో పొత్తు కూడింది. కాంగ్రెస్, బీజేపీ సైతం ఇదే ఎత్తుగడను అనుసరించాయి. పరస్పర సహకారంతో పదవులు పంచుకున్నాయి. జిల్లాలో 57 ఎంపీపీ స్థానాల్లో 55 చోట్ల ఎన్నికలు జరిగాయి. రెండు చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముత్తారం మండలంలో కోరం సభ్యులు లేక ఎన్నిక వాయిదా పడింది. మహాముత్తారంలో కో-ఆప్షన్ సభ్యుడు సకాలంలో నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఎన్నిక జరగలేదు. ఎన్నికలు జరిగిన 55 స్థానాల్లో... టీఆర్ఎస్ 40 చోట్ల ఎంపీపీ స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పది, బీజేపీ, సీపీఐలు చెరో ఎంపీపీ సీటును దక్కించుకున్నాయి. ఆసక్తికర పరిణామాలతో మూడుచోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. -
యథేచ్ఛగా ‘పచ్చ’ ప్రలోభాలు
డోన్: పదవులు దక్కించుకొనేందుకు టీడీపీ నాయకులు.. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఎలాగైనా ఎంపీపీ పదవులు దక్కించుకోవాలని అడ్డదారులు తొక్కుతున్నారు. డోన్ నియోజకవర్గంలో గత రెండురోజులుగా జరుగుతున్న పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. డోన్ మండలంలో మొత్తం 18 ఎంపీటీసీలలో 9 స్థానాలు టీడీపీ, 9 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. దీంతో ఇక్కడ ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠభరితంగా మారింది. అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో కొందరు అధికారపార్టీ నాయకులు డోన్ ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకోనేందుకు ఎత్తులు వేస్తున్నారు. వెంకటాపురం ఎంపీటీసీ (వైఆర్సీపీ మద్దతుతో గెలిచిన) సభ్యున్ని తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేశారు, అయితే ఆయన వారి ఒత్తిళ్లకు తలొగ్గకపోవడంతో దిక్కుతోచని ఆ పార్టీనాయకులు ఉడుములపాడు ఎంపీటీసీ సభ్యురాలిని తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆ గ్రామంలోని టీడీపీ పార్టీ నాయకులతో సంప్రదించారు. పనులు ఇస్తాం, రేషన్ డీలర్‌షిప్‌లు ఇస్తామంటూ ప్రలోభాలు పెట్టి టీడీపీ వైపు తిప్పుకున్నారు. అయితే వైఎస్సార్సీపీ విప్ జారీచేయడంతో ఆఎంపీటీసీ సభ్యురాలు వైఎస్ఆర్సీపీకే ఓటువేయాలని భావిస్తున్నారు. దీంతో దిక్కుతోచని ఆపార్టీ నేతలు ఏమిచేయాలో తోచక మరో ఎంపీటీసీ సభ్యుడి కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలిసింది. ఇక ప్యాపిలి మండలంలో మెజార్టీ ఎంపీటీసీ స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యులను టీడీపీ నాయకులు కిడ్నాప్ చేయడం, ప్రలోభాలకు గురిచేయడం, ఎంపీటీసీ బంధువులను, కుటుంబసభ్యులను బెదిరింపులకు గురిచేస్తున్నారని తెలిసింది. అధికార దాహం కోసం టీడీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు.