
40 మండలాల్లో టీఆర్‌ఎస్ హవా
మొన్న పట్టణాల్లో.. నిన్న మండలాల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ సత్తా చాటుకుంది. అత్యధిక ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకుంది. హంగ్ ఫలితాలు వెలువడ్డ మండలాల్లోనూ అధికార ఎత్తుగడలతో విజయకేతనం ఎగరేసింది. కొన్ని చోట్ల ఉపాధ్యక్ష పదవులను ఎరవేసి ప్రతిపక్ష పార్టీలతో పొత్తు కూడింది. కాంగ్రెస్, బీజేపీ సైతం ఇదే ఎత్తుగడను అనుసరించాయి. పరస్పర సహకారంతో పదవులు పంచుకున్నాయి.
జిల్లాలో 57 ఎంపీపీ స్థానాల్లో 55 చోట్ల ఎన్నికలు జరిగాయి. రెండు చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముత్తారం మండలంలో కోరం సభ్యులు లేక ఎన్నిక వాయిదా పడింది. మహాముత్తారంలో కో-ఆప్షన్ సభ్యుడు సకాలంలో నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఎన్నిక జరగలేదు. ఎన్నికలు జరిగిన 55 స్థానాల్లో... టీఆర్‌ఎస్ 40 చోట్ల ఎంపీపీ స్థానాలు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పది, బీజేపీ, సీపీఐలు చెరో ఎంపీపీ సీటును దక్కించుకున్నాయి. ఆసక్తికర పరిణామాలతో మూడుచోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.