
సాక్షి, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. మునుగోడు ఉప ఎన్నికల బరిలో 47 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 130 మంది నామినేషన్ దాఖలుచేయగా.. 47 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 83 మందిలో 36 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. చివరికి పోటీలో 47 మంది అభ్యర్థులు ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
గత ఎన్నికల్లో మునుగోడులో 15 మంది పోటీ చేయగా.. ఈసారి అభ్యర్థుల సంఖ్య మూడింతలు పెరిగింది. ఇక ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ముగ్గురి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఇదిలా ఉండగా స్వతంత్ర్య అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల కారణంగా ఓట్లు చీలిపోయే అవకాశం ఉండటంతో.. ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో ఒకింత టెన్షన్ నెలకొంది.
చదవండి: టీఆర్‌ఎస్ ఎంపీకి ఈడీ మరో షాక్..
Comments
Please login to add a commentAdd a comment