Santhosh Narayanan
-
నా పాటను మార్చేశారు, రూపాయి కూడా అక్కర్లేదు: కల్కి మ్యూజిక్ డైరెక్టర్
ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను అందించిన అంధగన్ సినిమా టైటిల్ సాంగ్‌ను ఇష్టమొచ్చినట్లుగా మార్చేశారని ఆగ్రహించాడు. కాగా బాలీవుడ్ హిట్ మూవీ అంధదున్ను తమిళంలో అంధగన్గా రీమేక్ చేస్తున్నారు. హీరో ప్రశాంత్ అంధుడిగా నటిస్తున్న ఈ సినిమా నుంచి అంధగన్ యాంథెమ్ రిలీజ్ చేశారు. దళపతి విజయ్ చేతుల మీదుగా ఈ పాటను విడుదల చేశారు.అంతా మార్చేశారు: సంతోష్ నారాయణన్ఈ సాంగ్‌కు సంతోష్ నారాయణన్ సంగీతం అందించినట్లుగా క్రెడిట్స్ ఇచ్చారు. అయితే ఈ మ్యూజిక్ డైరెక్టర్ తన సాంగ్‌ను ఇష్టారీతిన మార్చేశారంటున్నాడు. 'చరిత్రలో మొట్టమొదటిసారి.. ఒక ఆడియో సంస్థ కళ్లులేనట్లుగా నటిస్తోంది. ఈ పాటలో ఉన్న సంగీతం, లిరిక్స్, అరేంజ్మెంట్, ఆ మిక్సింగ్ అన్నీ కూడా నేను కంపోజ్ చేసినట్లుగా లేనే లేదు. కాబట్టి ఈ సాంగ్‌కు ఒక్క రూపాయి కూడా తీసుకోను' అని ట్వీట్ చేశాడు. అప్పుడే రిలీజ్ఇకపోతే చెన్నైలో జరిగిన ప్రమోషనల్ సాంగ్ ఈవెంట్‌కు సంతోష్ నారాయణన్ హాజరవలేదు. అంధగన్ సినిమా విషయానికి వస్తే సిమ్రాన్, ప్రియా ఆనంద్,కార్తీక్, సముద్రఖని, ఊర్వశి, యోగి బాబు, కేఎస్ రవికుమార్, వనితా విజయకుమర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది. సంతోష్ నారాయణన్ చివరగా కల్కి 2898 ఏడీ సినిమాకు సంగీతం అందించాడు. For the first time in history, the audio label is also playing a blind character - method acting ? . FYI I don’t charge a fee to check if the actual music/lyric/arrangement/mix/master is actually mine . All The Best Of Luck 😂😂 https://t.co/i7rWKBFQ9N pic.twitter.com/iMq0dhxmfj— Santhosh Narayanan (@Music_Santhosh) July 24, 2024 చదవండి: మందు తాగితే నాలోని రాక్షసుడు బయటకు వస్తాడు: సినీరచయిత -
కుక్కూ కుక్కూ పాటకు 487 మిలియన్ల వ్యూస్.. కానీ ఒక్క పైసా..!
సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్.. తమిళం, తెలుగు తదితర భాషా చిత్రాలకు సంగీతాన్ని అందిస్తూ బహుళ ప్రాచుర్యం పొందారు. ఈయన దర్శకుడు పా.రంజిత్ చిత్రాలకు సంగీతాన్ని అందించి వెలుగులోకి వచ్చారు. అలా వీరి కాంబినేషన్లో అట్టకత్తి, కాలా, కబాలి వంటి పలు చిత్రాలు రూపొందాయి. అయితే ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయనే ప్రచారం వైరల్ అయ్యింది. ఫేమస్ సాంగ్.. ఇటీవలే చైన్నెలో సంగీత కచేరిని భారీ ఎత్తున నిర్వహించిన సంతోష్ నారాయణన్ పలు ప్రైవేట్ ఆల్బమ్‌లను రూపొందించారు. అలా ఆయన సంగీతాన్ని అందించిన ప్రైవేట్ పాట ఎంజాయ్ ఎన్సామి.. 2021లో విడుదలవగా బాగా పాపులర్ అయ్యింది. ఎంతగా అంటే యూట్యూబ్ ఛానల్లో ఇప్పటి వరకూ 487 మిలియన్లకు పైగా వ్యూస్‌ను, 5 మిలియన్ లైక్స్‌ను పొందింది. అది సరే ఇప్పుడెందుకు దీని గురించి చెబుతున్నారు? అనిపిస్తోందా? దీనికి కారణం సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్నే. ఇప్పటివరకు ఎక్కడా చెప్పలే.. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేశారు. అందులో ఎంతో పాపులర్ అయిన ఎంజాయ్ ఎన్. సామి (కుక్కూ కుక్కూ..) పాట నిమిత్తం తనకు ఇప్పటి వరకూ ఒక్క పైసా ఆదాయం రాలేదని, అంతా ఆ పాటను తెరకెక్కించిన మ్యూజిక్ సంస్థకే చేరిందని పేర్కొన్నారు. ఈ విషయం గురించి తాను ఇప్పటి వరకూ ఎక్కడా చెప్పలేదని, ఇప్పుడు చెప్పాలనిపించిందన్నారు. కాగా ప్రస్తుతం సంగీత కళాకారులకంటూ ప్రైవేట్ పాటల కోసం ఒక ప్లాట్‌ఫామ్ అవసరం ఉందని, అందుకే తాను ఒక మ్యూజిక్ స్టూడియోను ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇకపై సంగీత కళాకారులు బాధ పడాల్సిన అవసరం ఉండదని, మీకు చేరాల్సింది కచ్చితంగా చేరుతుందని సంతోష్ నారాయణన్ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Santhosh Narayanan (@musicsanthosh) చదవండి: మా అత్తమ్మే నాకు స్ఫూర్తి : రాంచరణ్ సతీమణి ఉపాసన -
టాలీవుడ్‌కి స్వరాలందిస్తున్న పరభాష సంగీత దర్శకులు!
తెలుగు తెరపై పరభాషా తారలు చాలామంది కనిపిస్తుంటారు. తెరవెనక పరభాషా సాంకేతిక నిపుణులు పని చేస్తుంటారు. ముఖ్యంగా పలువురు పరభాషా సంగీతదర్శకులు టాలీవుడ్‌కి ట్యూన్ అయ్యారు. ఈ ఏడాది తెలుగు చిత్రాలకు ఎక్కువగా ఇతర భాషల సంగీతదర్శకులు ట్యూన్లు ఇస్తున్నారు. వారి గురించి తెలుసుకుందాం. ‘కేజీఎఫ్ 1, 2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నారు రవి బస్రూర్ (కన్నడ). ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’ చిత్రానికి, అలాగే సీనియర్ నటుడు హరనాథ్ సోదరుడు, నటుడు వెంకట సుబ్బరాజ్ తనయుడు హీరోగా పరిచయమవుతున్న ‘సీతామనోహర శ్రీరాఘవ’ చిత్రానికి కూడా రవి బస్రూర్ స్వరాలందిస్తున్నారు. ∙గతంలో ‘బిల్లా రంగా, గురు’ ఇటీవల ‘దసరా’ చిత్రాలకు సంగీతం అందించారు సంతోష్ నారాయణన్ (తమిళ్). ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’కి, వెంకటేశ్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్లో ప్రారంభమైన ‘సైంధవ్’ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. హీరోగా, సంగీత దర్శకునిగా కొనసాగుతున్న జీవీ ప్రకాశ్‌కుమార్ (తమిళ్) ఇప్పటికే తెలుగులో పలు చిత్రాలకు సంగీతం అందించారు. ప్రస్తుతం రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’కి, నితిన్ హీరోగా వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న చిత్రానికి స్వరాలందిస్తున్నారు. మాతృభాష మలయాళంలో ‘నోట్ బుక్’ (2006) ద్వారా సంగీతదర్శకుడిగా కెరీర్ ఆరంభించిన గోపీసుందర్ ‘మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు’ (2015) చిత్రంతో తెలుగుకి వచ్చారు. ఆ తర్వాత ‘భలే భలే మగాడివోయ్’, ‘మజ్ను’, ‘ప్రేమమ్’, ‘గీత గోవిందం’, ‘మజిలీ’ తదితర చిత్రాలకు స్వరాలందించారు. ఇటీవల రిలీజైన ‘18 పేజెస్’, ‘బుట్ట బొమ్మ’ చిత్రాలకు గోపీయే సంగీతదర్శకుడు. ∙‘అజ్ఞాతవాసి’ (2018), నాని ‘గ్యాంగ్‌లీడర్’ (2019) వంటి చిత్రాలకు తనదైన శైలిలో సంగీతం అందించారు అనిరుధ్ రవిచంద్రన్. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి స్వరాలందిస్తున్నారు. ‘జర్నీ’ (2011), ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’ (2013), ‘సిటిజన్’ (2013) వంటి డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్‌కి పరిచయమైన సి.సత్య (తమిళ్) ప్రస్తుతం స్ట్రెయిట్ తెలుగు చిత్రం చేస్తున్నారు. పవన్ కల్యాణ్– సాయిధరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి సత్యనే స్వరకర్త. తమిళ చిత్రాలతో పాటు తెలుగు సినిమాలకూ తనదైన శైలిలో సంగీతం అందిస్తున్నారు హారీస్ జయరాజ్ (తమిళ్). ప్రస్తుతం ఆయన నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి, నాగశౌర్య కథానాయకుడుగా చేస్తున్న చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ∙‘కిరాక్ పార్టీ’ (2018) చిత్రంతో తెలుగులోకి సంగీత దర్శకునిగా ఎంట్రీ ఇచ్చారు అజనీష్ లోక్‌నాథ్ (కన్నడ). ఆ తర్వాత ‘నన్ను దోచుకుందువటే’ (2018) మూవీకి స్వరాలు అందించారు. నాలుగేళ్ల విరామం తర్వాత ఆయన తెలుగులో చేస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’. సాయిధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హేషమ్ అబ్దుల్ వహాబ్ ‘ఖుషి’ సినిమాతో తెలుగుకి వస్తున్నారు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. అలాగే నాని హీరోగా సౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి, శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న చిత్రానికి హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నారు. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా పాటలను 1980ల నుంచి తెలుగు శ్రోతలు వింటున్నారు. తెలుగు పరిశ్రమతో సుదీర్ఘ అనుబంధం ఇళయరాజాది. ఇటీవల విడుదలైన ‘రంగ మార్తాండ’కు ఆయనే స్వరకర్త. అలాగే త్వరలో విడుదల కానున్న ‘మ్యూజిక్ స్కూల్’కి కూడా స్వరాలందించారు. ఇక ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా టాలీవుడ్ కెరీర్ ‘శేషు’ (2002) సినిమాతో ప్రారంభమై, కొనసాగుతోంది. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ‘కస్టడీ’ చిత్రానికి తండ్రి ఇళయరాజాతో కలిసి స్వరాలు అందించారు యువన్. అలాగే శర్వానంద్ హీరోగా చేయనున్న ఓ చిత్రానికి యువన్ శంకర్ స్వరాలందిస్తున్నారు. వీరే కాదు.. మరికొందరు ఇతర భాషల సంగీత దర్శకులు తెలుగు చిత్రాలకు ట్యూన్లు ఇస్తున్నారు. -
సినిమా నుంచి అనిరుధ్‌ను సైడ్ చేశారు!
చియాన్ విక్రమ్ 60వ సినిమా షూటింగ్ నేడు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్‌కు స్వాగతం చెప్తూ ట్వీట్ చేశాడు. కానీ ఈ ట్వీట్ అభిమానులను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. కారణం.. ఈ చిత్రానికి గతంలో అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తాడని ప్రకటించారు. కానీ ఏమైందో ఏమోకానీ సడన్‌గా అతడిని సైడ్ చేస్తూ సంతోష్ పేరును ప్రకటించారు. "అవును, ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. మమ్మల్ని అర్థం చేసుకుని అండగా నిలిచినందుకు అనిరుధ్‌కు కృతజ్ఞతలు. ఈ రోజే చిత్రీకరణ ప్రారంభమవుతోంది" అంటూ కార్తీక్ సుబ్బరాజు ట్వీట్ చేశాడు. చిత్రయూనిట్ తీసుకున్న ఈ నిర్ణయంపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం అనిరుధ్ మాస్ బీజీఎమ్ మిస్ అవుతామని కామెంట్లు చేస్తున్నారు. Yes... It's A Santosh Narayanan Musical!! Welcome to the Gang @Music_Santhosh Thanks @anirudhofficial for your understanding & Support ... #Chiyaan60 shoot starts from TODAY... Need all your Support, Blessings and Love 🙏 More updates to follow.... pic.twitter.com/ZqmFKU6J86 — karthik subbaraj (@karthiksubbaraj) March 10, 2021 ఇక మీ సినిమాలో సిమ్రాన్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లలిత్ కుమార్ తన సొంత నిర్మాణ సంస్థ సెవర్ స్క్రీన్ స్టూడియోపై ఈ సినిమా నిర్మిస్తున్నాడు. మరోవైపు విక్రమ్ 'పొన్నియిన్ సెల్వన్' అనే మరో యాక్షన్ డ్రామా సినిమా చేస్తున్నాడు. చదవండి: విక్రమ్‌కు సవాలు విసురుతున్న ఇర్ఫాన్ పఠాన్ అఖిల్ పేరు ఛాతీ మీద పచ్చబొట్టు వేయించుకున్న ఫ్యాన్ -
ఒక్క పాటలో పది లక్షల గొంతులు
రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కాలా. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కబాలి ఫేం పా రంజిత్ దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 7న రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ వెల్లడించారు. ఈ సినిమాలోని ఒక పాటను ఏకంగా పది లక్షల మందితో రికార్డ్ చేసినట్టుగా తన సోషల్ మీడియా పేజ్ ద్వారా వెల్లడించారు సంతోష్. ‘నాకు ఎప్పటి నుంచో ఒక పాటు పది లక్షల గొంతులను రికార్డ్ చేయాలన్న కల ఉంది. కాలా సినిమాలోని పాటకు ఆ అవకాశం దక్కింది. అన్ని వర్గాలకు చెందిన ప్రజలతో రికార్డింగ్ చేయడం గౌరవంగా భావిస్తున్నా. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తాం.’ అంటూ ట్వీట్ చేశారు సంతోష్ నారాయణన్. రజనీకాంత్ డాన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నానా పటేకర్, ఈశ్వరీ రావు, హుమా ఖురేషీ, సముద్రఖనిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. I have always had this dream of recording a million voices in a song & have the perfect opportunity in a song from #kaala. It would be a great honour recording people from all walks of life. We are so excited and will update details very shortly.Peace! #kaala1million — Santhosh Narayanan (@Music_Santhosh) 29 April 2018