నా పాటను మార్చేశారు, రూపాయి కూడా అక్కర్లేదు: కల్కి మ్యూజిక్‌ డైరెక్టర్‌ | Santhosh Narayanan: Andhagan Anthem Is Not What I Delivered, Don't Want a Penny | Sakshi
Sakshi News home page

Santhosh Narayanan: ఆడియో సంస్థ గుడ్డిగా ప్రవర్తించడం చరిత్రలోనే మొదటిసారి..

Published Thu, Jul 25 2024 5:54 PM | Last Updated on Thu, Jul 25 2024 6:28 PM

Santhosh Narayanan: Andhagan Anthem Is Not What I Delivered, Don't Want a Penny

ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణన్‌ సోషల్‌ మీడియా వేదికగా తన అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను అందించిన అంధగన్‌ సినిమా టైటిల్‌ సాంగ్‌ను ఇష్టమొచ్చినట్లుగా మార్చేశారని ఆగ్రహించాడు. కాగా బాలీవుడ్‌ హిట్‌ మూవీ అంధదున్‌ను తమిళంలో అంధగన్‌గా రీమేక్‌ చేస్తున్నారు. హీరో ప్రశాంత్‌ అంధుడిగా నటిస్తున్న ఈ సినిమా నుంచి అంధగన్‌ యాంథెమ్‌ రిలీజ్‌ చేశారు. దళపతి విజయ్‌ చేతుల మీదుగా ఈ పాటను విడుదల చేశారు.

అంతా మార్చేశారు: సంతోష్‌ నారాయణన్‌
ఈ సాంగ్‌కు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందించినట్లుగా క్రెడిట్స్‌ ఇచ్చారు. అయితే ఈ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తన సాంగ్‌ను ఇష్టారీతిన మార్చేశారంటున్నాడు. 'చరిత్రలో మొట్టమొదటిసారి.. ఒక ఆడియో సంస్థ కళ్లులేనట్లుగా నటిస్తోంది. ఈ పాటలో ఉన్న సంగీతం, లిరిక్స్‌, అరేంజ్‌మెంట్‌, ఆ మిక్సింగ్‌ అన్నీ కూడా నేను కంపోజ్‌ చేసినట్లుగా లేనే లేదు. కాబట్టి ఈ సాంగ్‌కు ఒక్క రూపాయి కూడా తీసుకోను' అని ట్వీట్‌ చేశాడు. 

అప్పుడే రిలీజ్‌
ఇకపోతే చెన్నైలో జరిగిన ప్రమోషనల్‌ సాంగ్‌ ఈవెంట్‌కు సంతోష్‌ నారాయణన్‌ హాజరవలేదు. అంధగన్‌ సినిమా విషయానికి వస్తే సిమ్రాన్‌, ప్రియా ఆనంద్‌,కార్తీక్‌, సముద్రఖని, ఊర్వశి, యోగి బాబు, కేఎస్‌ రవికుమార్‌, వనితా విజయకుమర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది. సంతోష్‌ నారాయణన్‌ చివరగా కల్కి 2898 ఏడీ సినిమాకు సంగీతం అందించాడు.

 

చదవండి: మందు తాగితే నాలోని రాక్షసుడు బయటకు వస్తాడు: సినీరచయిత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement