
మందుకు బానిసగా మారి తన జీవితంలో పదేళ్లు వృథా చేసుకున్నానంటున్నాడు సినీరచయిత జావేద్ అక్తర్. ఒకప్పుడు తాగుడుకు బానిసైన ఈయన తర్వాత ఆల్కహాల్ మానేశాడు. తాజాగా అతడు ఈ విషయం గురించి మాట్లాడుతూ.. అదేంటో గానీ తాగితే నేను నేనులా ఉండను. ఈ మందు బాటిల్స్‌లో ఏం కలుపుతారో కానీ అది తాగగానే కోపంగా మారిపోతాను.
నాలో మృగం బయటకు..
అంత కోపంతో నేనెప్పుడూ ఊగిపోను. కానీ తాగినప్పుడు మాత్రం నాకు తెలీకుండానే ప్రమాదకరంగా మారిపోతాను. నాలోని ఓ రాక్షసుడు బయటకు వస్తాడు. మందు మానేయడం నేను చేసిన మంచిపనుల్లో ఒకటి. 1991 జూలై 31న చివరిసారిగా తాగాను. అప్పటినుంచి ఇప్పటివరకు దాని జోలికే వెళ్లలేదు. కానీ యుక్తవయసులో మందుకు బానిసవ్వకుండా ఉండాల్సింది. మద్యపానానికి అలవాటు పడి నా జీవితంలో దశాబ్దకాలం వృథా చేసుకున్నాను.
సమయం వృథా చేసుకున్నా
ఫ్రెంచ్, పర్షియన్ వంటి భాష నేర్చుకోవడమో, సంగీతం నేర్చుకోవడమో.. ఇలా ఏవైనా కొత్తగా ప్రయత్నించాల్సింది. కానీ సమయాన్ని వేస్ట్ చేసుకున్నాను అని చెప్పుకొచ్చాడు. ఈయన చివరగా గతేడాది వచ్చిన ద ఆర్చీస్, డుంకీ, కో గయే హమ్ కహాన్ వంటి చిత్రాలకు పాటరచయితగా పని చేశాడు.
చదవండి: 70కి పైగా ఆడిషన్స్.. కాంప్రమైజ్ అడగడంతో ఏడ్చేశా: హీరోయిన్