అనూష కృష్ణ.. పేరుకు కన్నడమ్మాయే కానీ తెలుగు స్పష్టంగా మాట్లాడగలదు. పక్కింటమ్మాయిలా కనిపించే ఈమె ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివింది. యాక్టింగ్ కోసం ఉద్యోగాన్ని మానేసింది. ఇంట్లోవాళ్లు తిట్టినా సరే ఇండస్ట్రీలో ప్రయత్నిద్దామన్న బలమైన కోరికతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పేకమేడలు సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకుంది.
అవకాశాల కోసం అన్నీ చేయలేను
'నేను 70కి పైగా ఆడిషన్స్‌కు వెళ్లాను. కన్నడలో రెండు సినిమాలు చేశాను. కానీ ఇంకా రిలీజవ్వలేదు. కొన్ని ఆడిషన్స్‌లో మీరిలాగే చిన్న సినిమాలు చేస్తారా? పెద్ద చిత్రాలు చేస్తారా? అని ఆప్షన్స్ ఇస్తారు. వాళ్లు చెప్పినవాటికి తలూపి పెద్ద సినిమాలు నేను చేయలేను. నాకంటూ కొన్ని పరిమితులున్నాయి. వాటిని దాటలేను. చిన్న సినిమాలతోనే గుర్తింపు తెచ్చుకుంటానని చెప్పేదాన్ని.
చేదు అనుభవం
ఒకసారైతే భయంకరమైన సంఘటన జరిగింది. దర్శకనిర్మాతలు మాకు నచ్చేశావన్నారు. అయితే ఆ నిర్మాత వయసు సుమారు 60 ఏళ్లుంటుంది. ఆయన మీరు కాంప్రమైజ్ అయితే సినిమా చేసేద్దామన్నారు. భయంతో వణికిపోయాను. నాకు ఎంగేజ్‌మెంట్ అయిందని అబద్ధం చెప్పాను. అయినా పర్లేదన్నాడు. వెంటనే నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోయాను. నేను బోరుమని ఏడుస్తుంటే ఆ కారు డ్రైవర్ ఏమైంది మేడమ్.. అంతా బానే జరుగుతుందని ఓదార్చాడు. పేకమేడలు షూటింగ్ అయిపోయాకే ఈ సంఘటన జరిగింది' అని అనూష తెలిపింది.
చదవండి: మోసపోయా.. ఇప్పటికీ నాకు పారితోషికం చెల్లించలేదు: స్టార్ హీరో
Comments
Please login to add a commentAdd a comment