మోసపోయా.. ఇప్పటికీ నాకు పారితోషికం చెల్లించలేదు: స్టార్‌ హీరో | Akshay Kumar: Payment From Some Producers Still Pending | Sakshi
Sakshi News home page

Akshay Kumar: నాకు ఇవ్వాల్సిన డబ్బు ఆపేశారు.. వాళ్లు నన్ను మోసం చేశారు!

Jul 25 2024 12:31 PM | Updated on Jul 25 2024 12:59 PM

Akshay Kumar: Payment From Some Producers Still Pending

రెమ్యునరేషన్‌.. సమయానికి ఇవ్వకుండా నిర్మాతలు వేధిస్తున్నారని పలువురు సెలబ్రిటీలు సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉన్నారు. కొందరైతే డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టారని, ఎన్నిసార్లు వారి చుట్టు తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. అందుకు తాను కూడా మినహాయింపు కాదంటున్నాడు బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌.

మోసపోయా..
ఈయన ప్రధాన పాత్రలో నటించిన సర్ఫిరా మూవీ థియేటర్లలో ఆడుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అక్షయ్‌ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నేను కొన్నిసార్లు మోసపోయాను. అలాంటప్పుడు ఏం చేస్తానంటే వారితో మాట్లాడటం మానేస్తాను. కొందరు నిర్మాతలు నాకు ఇవ్వాల్సిన పారితోషికాన్ని పూర్తిగా చెల్లించలేదు. ఇది మోసమే కదా! ఇప్పటికీ నాకు అందాల్సిన డబ్బు చేతికి రాలేదు' అన్నాడు.

ఆ రోజే రిలీజ్‌
కాగా అక్షయ్‌ ప్రస్తుతం ఖేల్‌ ఖేల్‌ మే సినిమా చేస్తున్నాడు. తాప్సీ పన్ను, వాణి కపూర్‌, అమ్మీ విర్క్‌, ఆదిత్య సీల్‌, ప్రగ్యా జైస్వాల్‌, ఫర్దీన్‌ ఖాన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. అదే రోజు స్త్రీ 2 కూడా రిలీజవుతోంది.

చదవండి: Pranitha: రెండోసారి గుడ్‌ న్యూస్‌ చెప్పిన హీరోయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement