
కాలా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ అమెరికా వెళ్లనున్నారు. గతంలో తీవ్ర ఆరోగ్య సమస్యతో అమెరికాలోని హాస్పిటల్‌లో చేరిన రజనీ తరువాత తరుచూ చెకప్ కోసం అక్కడికే వెళ్తున్నారు. సోమవారం రాత్రి మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా బయలుదేరి వెళ్లనున్నారు.
రజనీ రెండు వారాల పాటు అమెరికాలోనే ఉండే అవకాశం ఉంది. సూపర్ స్టార్ హీరోగా తెరకెక్కిన కాలా జూన్ 7న రిలీజ్ కు రెడీ అవుతుండగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 2.ఓ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించారు రజనీ. ఈ సినిమా త్వరలో ప్రారంభంకానుంది.