Health Check-Up
-
నిమ్స్ లో వైఎస్ భాస్కర్ రెడ్డికి వైద్య పరీక్షలు
-
తమిళనాడు సీఎంకు హెల్త్ చెకప్
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్య మంత్రి ఎంకే స్టాలిన్ చెన్నై పోరూరులోని శ్రీ రామచంద్ర మెడికల్ కళాశాల, ఆసుపత్రిలో శనివారం ఆరోగ్య పరీక్షలు చేసుకున్నారు. ఉదయం 7 గంటలకు ఆసుపత్రికి చేరుకున్న స్టాలిన్‌కు సుమారు ఒకటిన్నర గంటలపాటు అక్కడే గడిపారు. వివిధ వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం ఇంటికి వెళ్లిపోయారు. ఆసుపత్రి వైద్యులు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం స్టాలిన్‌కు సాధారణ పరీక్షలు చేసినట్లు తెలిపారు. సీఎం ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రెండేళ్లకు ఒకసారిగా రొటీన్‌గా సాగే హెల్త్చెకప్ అని స్పష్టం చేశారు. -
వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు రజనీ
కాలా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ అమెరికా వెళ్లనున్నారు. గతంలో తీవ్ర ఆరోగ్య సమస్యతో అమెరికాలోని హాస్పిటల్లో చేరిన రజనీ తరువాత తరుచూ చెకప్ కోసం అక్కడికే వెళ్తున్నారు. సోమవారం రాత్రి మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా బయలుదేరి వెళ్లనున్నారు. రజనీ రెండు వారాల పాటు అమెరికాలోనే ఉండే అవకాశం ఉంది. సూపర్ స్టార్ హీరోగా తెరకెక్కిన కాలా జూన్ 7న రిలీజ్ కు రెడీ అవుతుండగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 2.ఓ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించారు రజనీ. ఈ సినిమా త్వరలో ప్రారంభంకానుంది. -
అమెరికాకు పయనమైన సోనియా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వైద్య పరీక్షలకోసం అమెరికాకు పయనమయ్యారు. కుమార్తె ప్రియాంక వెంటరాగా సోనియా సోమవారం మధ్యాహ్నం అమెరికాకు బయల్దేరి వెళ్లారు. ఆమె కుమారుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాత్రం ఇక్కడే ఉండిపోయారు. పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది మాట్లాడుతూ.. ప్రతి ఆరునెలలకు ఒకసారి సోనియా సాధారణ వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్లాల్సి ఉంటుందని, ఇందులో భాగంగా సోమవారం బయల్దేరి వెళ్లారని తెలిపారు. ఆమె చివరిసారిగా గతేడాది సెప్టెంబర్‌లో వైద్య పరీక్షలకోసం అమెరికా వెళ్లారు. అనంతరం ఈ ఏడాది ప్రథమార్థంలో వెళ్లాల్సి ఉండగా.. తీవ్రమైన పనుల ఒత్తిడి వల్ల జాప్యం జరిగిందని ఆయన వివరించారు. ప్రస్తుతం అమెరికా వెళ్లిన సోనియా ఏడెనిమిది రోజుల్లో దేశానికి తిరిగి వస్తారని తెలిపారు. 66 ఏళ్ల సోనియా 2011, ఆగస్టు 5న అమెరికాలో శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. అయితే జబ్బేమిటన్నది వెల్లడి కాలేదు.