
రజనీకాంత్, ధనుశ్
ఒకవైపు రజనీకాంత్ తాజా చిత్రం ‘పేట్టా’ (తెలుగులో ‘పేట’) విడుదల పనులు జోరుగా సాగుతుంటే అంతే జోరుగా యూఎస్‌లో హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు సూపర్ స్టార్. అక్కడికి ఫ్యామిలీతో కలిసి రజనీకాంత్ వెళ్లిన సంగతి తెలిసిందే. క్రిస్మస్ వేడుకలను రజనీ ఫ్యామిలీ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్‌లోని ఓ ఫొటోను ఆయన అల్లుడు దర్శక–నిర్మాత–నటుడు ధనుశ్ ‘‘హ్యాపీ హాలీడేస్.. ఫ్యామిలీ టైమ్’’ అంటూ షేర్ చేశారు. ఇక ‘పేట్టా’ దగ్గరకు వస్తే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా విడుదల తేదీ గురువారం అధికారికంగా వెల్లడైంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. వల్లభనేని అశోక్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమా ట్రైలర్ నేడు విడుదల కానుందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
Comments
Please login to add a commentAdd a comment