
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం కాలా. కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కోలీవుడ్ హీరో, రజనీ అల్లుడు ధనుష్ నిర్మిస్తున్నారు. మంగళవారం కర్ణాటక హైకోర్టు కాలా రిలీజ్‌కు లైన్ క్లియర్ చేసింది. సినిమాను రిలీజ్ చేసేందుకు థియేటర్ల యజమానులు ముందుకు వస్తే ప్రభుత్వం భద్రత కల్పించాలని ఆదేశించింది. తాజాగా సుప్రీం కోర్టులోనూ కాలా కు ఊరట లభించింది.
‘అందరూ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో రిలీజ్ విషయంలో మేం జోక్యం చేసుకోలేం’ అంటూ సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది. కాపీరైట్ విషయంలో దాఖలైన పిటీషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
పలు వాయిదాల తరువాత ఈ గురువారం విడుదలకు రెడీ అయిన ఈ సినిమాకు కర్ణాటకలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో రజనీ చేసిన వ్యాఖ్యలు కారణంగా పలు కన్నడ సంఘాలు కాలా రిలీజ్‌ను వ్యతిరేఖిస్తున్నాయి. కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కాలా సినిమాను రజనీ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment