
తమిళసినిమా: రజనీకాంత్ ఈ పేరే అభిమానులకు ఒక మంత్రం. సూపర్‌స్టార్ రాజకీయాల్లోకి రావాలని వారు జపం చేస్తున్నారు. ఎట్టకేలకు అభిమానుల తపం ఫలించింది. రజనీకాంత్ రాజకీయ పయనానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే సినీప్రియులు మాత్రం ఆయన నటించిన కాలా, 2.ఓ చిత్రాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గ్రాఫిక్స్ పనులు పూర్తికాకపోవడంతో ముందుగా తెరపైకి రావలసిని 2.ఓ వెనక్కు, ఆ తరువాత రావలసిన కాలా ముందుకు వస్తోంది. అన్నీ బాగుంటే ఈ శుక్రవారం కాలా చిత్రం ప్రేక్షకులకు విందు అయ్యేది. కోలీవుడ్ సమ్మె కారణంగా జూన్ 7వ తేదీకి వాయిదా పడింది. రజనీకాంత్‌తో పాటు ప్రముఖ బాలీవుడ్ నటుడు నానాపటేకర్, నటి హ్యూమ ఖురేషి, ఈశ్వరిరావు, అంజలిపటేల్, అరుంధతి, సాక్షి అగర్వాల్, సుకన్య సముద్రకని, సంపత్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకత్వం వహించారు. కబాలి తరువాత ఆయన రజనీకాంత్‌తో చేసిన రెండవ చిత్రం కాలా.
సంతోష్ నారా యణన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని నటుడు ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించారు. కాలా చిత్రం వ్యా పార పరంగా ఇప్పటికే ధనుష్‌కు భారీ లా భాలను అందించి పెట్టింది. తాజాగా శాటిలైట్ హక్కులను భారీ మొత్తంలో విజయ్ టీవీ దక్కించుకుందన్నదని సమాచారం. ఒక ఈ విషయం ఇలా ఉంటే రజనీకాంత్ మరో చిత్రానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రెగ్యులర్ వైద్య పరీక్షలకు అమెరికా వెళ్లిన రజనీకాంత్ చెన్నైకి తిరిగి రాగానే రాజకీయ పార్టీ ఏర్పాటు కార్యక్రయంతో పాటు, కొత్త చిత్ర షూటింగ్‌లోనూ పాల్గొననున్నారనే ప్ర చారం జరుగుతోంది. రజనీ కాంత్ కొత్త చిత్రానికి యువదర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వం వహించనున్నాన్న విషయం తెలిసిందే. ఇది రాజకీయ నేపథ్యంలో సాగుతుందనే ప్రచారం జ రుగుతున్న విషయం తెలి సిందే. కొత్తగా వెలువడ్డ విషయం ఏమిటంటే ఇది అదిరే యాక్షన్ కథా చిత్రంగా ఉంటుందట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియడానికి ఎంతో దూరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment