![Dhadak actress Janhvi Kapoor makes her Instagram account public - Sakshi - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/17/janvi%20kapoor.jpg.webp?itok=Rgms_v_O)
అందాల తార శ్రీదేవిని నాటి సౌందర్యారాధులకు ఆరాధిస్తే.. ఆమె కుమార్తె జాన్వి నేటి తరాన్ని తన అందంతో మత్తెక్కిస్తోంది. ముగ్ధమోహన సౌందర్యానికి మారుపేరుగా మారిన జాన్విని వెండితెరమీద ఆవిష్కరించేందుకు ప్రఖ్యాత దర్శకుడు కరణ్ జోహార్ సిద్ధమైన విషయం తెలిసిందే. ధడక్ పేరుతే రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులైలో విడుదల కానుంది. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కట్టర్ హీరోగా నటిస్తున్నాడు.
తాజాగా జాన్వీ కపూర్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను పోస్ట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్వి ఫొటోలు చూసిన సౌందర్య ప్రేమికులు.. అమ్మకన్నా అందంగా ఉందంటూ.. కామెంట్లు పెడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్వి ఫొటోలను కరణ్ జోహార్ షేర్ చేశారు. అంతేకాక ఇప్పటివరకూ ప్రయివేట్‌గా ఉన్న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఆమె పబ్లిక్‌గా మార్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్వి కపూర్ ఫొటోలు చూసిన వారంతా.. హార్ట్‌బీట్ పెరుగుతోందంటూ.. కామెంట్లు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment