Sridevi daughter
-
అమ్మ బతికుండగా పట్టించుకోలేదు.. కానీ: జాన్వీ కపూర్
దేవర భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావుకు జంటగా కనిపించనుంది. క్రికెట్ నేపథ్యంలో అపూర్వ మోహతా, కరణ్‌జోహార్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. మే 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా జాన్వీ కపూర్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన తల్లి మరణం తర్వాత నా లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వచ్చాయని వెల్లడించారు. అంతే కాకుండా తిరుమలకు తరచుగా వెళ్లడానికి గల కారణాన్ని వివరించారు.జాన్వీ కపూర్ మాట్లాడుతూ..'అమ్మకు దైవ భక్తి ఎక్కువ. కొన్ని విషయాలను బాగా నమ్మేది. స్పెషల్ డేస్‌లో కొన్ని పనులు చేయనిచ్చేది కాదు. శుక్రవారం జుట్టు కత్తిరించుకోకూడదని అని చెప్పేది. అలా చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదని చెప్పేది. అంతే కాదు ఆ రోజు నల్ల దుస్తులు వేసుకోవద్దనేది. కానీ అమ్మ బతికి ఉండగా ఇలాంటివన్నీ నేను పట్టించుకోలేదు. మూఢనమ్మకాలు అని లైట్ తీసుకున్నా. కానీ అమ్మ దూరమయ్యాక నమ్మడం మొదలుపెట్టా. ఇప్పుడు నేనే నేనే ఎక్కువగా విశ్వసిస్తున్నానని' తెలిపింది.జాన్వీ కపూర్ తిరుమలరు వెల్లడంపై మాట్లాడుతూ..' అమ్మ తిరుమల దేవుడి పేరును ఎక్కువగా తలచేది . షూటింగ్ గ్యాప్‌లో కూడా నారాయణ, నారాయణ అనుకుంటూ ఉండేది. ప్రతి ఏటా పుట్టినరోజు స్వామి వారిని దర్శించుకునేది. అమ్మ చనిపోయిన తర్వాత తన పుట్టినరోజుకి నేను తిరుమల సన్నిధికి వెళ్లాలని నిర్ణయించుకున్నా. అమ్మ లేకుండా మొదటిసారి తిరుమల వెళ్లినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యా. కానీ తిరుమలకు వెళ్లిన ప్రతిసారి ఏదో మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందుకే తరచుగా వెళ్తుంటానని' చెప్పుకొచ్చింది. కాగా.. మరోవైపు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో కనిపించనుంది. -
శ్రీదేవి చిన్నకూతురు ఖుషీ కపూర్ ఫోటోలు
-
పెళ్లికి కంచిపట్టు చీర కట్టుకుంటా
అబ్బాయి ఇలా ఉండాలి. అలా ఉండాలని కాబోయే భర్త గురించి అమ్మాయిలకు చాలా కలలు ఉంటాయి. పెళ్లి ఎలా చేసుకోవాలో కూడా కొంతమంది ఊహించుకుంటారు. మీ పెళ్లి ఎలా జరగాలని మీరు కోరుకుంటున్నారు? అన్న ప్రశ్నను శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ముందుంచితే.. పెళ్లికొడుకు లక్షణాలు ఎలా ఉండాలో ప్రస్తుతానికి చెప్పలేదు కానీ ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయంపై మాత్రం మనసు విప్పారు. ‘‘కొన్నేళ్ల క్రితం ఫ్లోరెన్స్ (ఇటలీ)ప్రాంతానికి వెళ్లాను. పెళ్లి చేసుకుంటే అక్కడే చేసుకోవాలి అనేంతలా అక్కడి ప్రదేశాలు నన్ను ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ అదే ఫీలింగ్ ఉంది. అలాగే పెళ్లికి బంగారు జరీ ఉన్న కంచిపట్టు చీర కట్టుకోవాలనుకుంటున్నాను’’ అని చెప్పారు జాన్వీ. మరి.. జాన్వీ చేయి పట్టుకుని ఏడడుగులు వేసే అబ్బాయి ఎవర్నది అందరికీ తెలియాలంటే కాస్త టైమ్ పడుతుంది. ఎందుకంటే ఈ బ్యూటీ వయసు జస్ట్ 21 మాత్రమే. ఇక సినిమాల విషయానికి వస్తే.. ‘ధడక్’ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ప్రస్తుతం కరణ్ జోహార్ దర్శకత్వంలో రూపొందనున్న మల్టీస్టారర్ మూవీ ‘తక్త్’ కోసం రెడీ అవుతున్నారు. అలాగే సౌత్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి జాన్వీ ఆలోచిస్తున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. -
ఆయన నటనంటే చాలా ఇష్టం: జాన్వీ
సాక్షి, చెన్నై: వర్ధమాన హీరోయిన్ జాన్వీ. ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చేది అతిలోక సుందరి శ్రీదేవి. తమిళం, తెలుగు, హిందీ ఈ మూడు భాషల్లోనూ నంబర్‌వన్ హీరోయిన్గా రాణించింది శ్రీదేవి. ఆమె వారసురాలుగా పెద్ద కూతురు జాన్వీ తెరంగేట్రం చేసింది. శ్రీదేవి కోలీవుడ్‌లో నటనకు శ్రీకారం చుట్టగా, జాన్వీ బాలీవుడ్లో పరిచయం కానుంది. హీరోయిన్ జాన్వీ తనకు ఇష్టమైన హీరో ధనుష్ అని చెప్పింది. భవిష్యత్‌లో దక్షిణాది చిత్రాల్లో నటిస్తుందో? లేదో? వేచి చూడాలి. జాన్వీ నటించిన తొలి హిందీ చిత్రం ‘దడాక్’ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం కోసం సినీ ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోందనే చెప్పాలి. అలాంటి ‘దడాక్’ చిత్రం జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. దీంతో జాన్వీ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. చిత్ర దర్శకుడు కరణ్ జోహార్ ఒక పత్రిక కోసం జాన్వీని ఇంటర్వ్యూ చేశారు. ఆ సందర్భంగా ఆమె పలు విషయాలను పంచుకున్నారు. చివరిగా ఉత్తరాది, దక్షిణాదిలో మీకు నచ్చిన హీరో ఎవరని ప్రశ్న అడిగారు. జాన్వీ మాత్రం టక్కున హీరో ధనుష్ అని చెప్పింది. ధనుష్ చిత్రాలు, ఆయన నటన తనను ఎంతగానో ఆకట్టుకుంటాయని చెప్పడం విశేషం. -
ధడక్.. ధడక్.. జాన్వీ
అందాల తార శ్రీదేవిని నాటి సౌందర్యారాధులకు ఆరాధిస్తే.. ఆమె కుమార్తె జాన్వి నేటి తరాన్ని తన అందంతో మత్తెక్కిస్తోంది. ముగ్ధమోహన సౌందర్యానికి మారుపేరుగా మారిన జాన్విని వెండితెరమీద ఆవిష్కరించేందుకు ప్రఖ్యాత దర్శకుడు కరణ్ జోహార్ సిద్ధమైన విషయం తెలిసిందే. ధడక్ పేరుతే రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులైలో విడుదల కానుంది. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కట్టర్ హీరోగా నటిస్తున్నాడు. తాజాగా జాన్వీ కపూర్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను పోస్ట్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్వి ఫొటోలు చూసిన సౌందర్య ప్రేమికులు.. అమ్మకన్నా అందంగా ఉందంటూ.. కామెంట్లు పెడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్వి ఫొటోలను కరణ్ జోహార్ షేర్ చేశారు. అంతేకాక ఇప్పటివరకూ ప్రయివేట్‌గా ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను ఆమె పబ్లిక్‌గా మార్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్వి కపూర్ ఫొటోలు చూసిన వారంతా.. హార్ట్‌బీట్ పెరుగుతోందంటూ.. కామెంట్లు పెడుతున్నారు. 🌴 gonna miss home A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on Aug 5, 2017 at 2:34pm PDT A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on Jul 29, 2017 at 7:22am PDT Wedding season got me like 🤒 A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on Feb 26, 2017 at 5:12am PST 💋 A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on Feb 7, 2017 at 12:01am PST 👀 A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on May 8, 2016 at 3:50am PDT -
శ్రీదేవి కూతురి ఫొటోలపై దుమారం
ప్రఖ్యాత నటి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ పెద్ద కూతురు జాహ్నవి కపూర్ తన సినిమా అరంగేట్రానికి సంబంధించిన సమాచారం కంటే బాయ్‌ఫ్రెండ్ (బాయ్‌ఫ్రెండ్స్?) వల్లే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. 19 ఏళ్ల జాహ్నవి పార్టీలు, పబ్‌లలో బాయ్‌ఫ్రెండ్స్‌తో కలసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మాయి కౌగిలింతలు, లిప్ లాక్ దృశ్యాలతో ఉన్న ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రముఖ రాజకీయ నాయకుడు సుశీల్‌కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో జాహ్నవి లవ్‌లో పడినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ కార్యక్రమానికి జాహ్నవి తన లవర్ శిఖర్‌తో పాటు తల్లిదండ్రులతో కలసి ఒకే కారులో రావడం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. కూతురి ప్రేమకు శ్రీదేవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరో ట్విస్ట్ ఏంటంటే జాహ్నవి అక్షత్ రాజన్ అనే మరో కుర్రాడితో చాలా సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు రావడం దుమారం రేపుతోంది. అక్షత్ జాహ్నవిని ముద్దు పెట్టుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అక్షత్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో జాహ్నవితో కలిసున్న ఫొటోలను ఈ మధ్య తరచూ పోస్ట్ చేస్తున్నాడు. ఈ ఫొటోలను చూసిన నెటిజెన్లు జాహ్నవి అక్షత్‌తో డేటింగ్ చేస్తుందా అని షాక్ తిన్నారు. ఇంతకీ జాహ్నవి డేటింగ్ చేస్తోంది శిఖర్తోనా లేక అక్షత్తోనా? అని అయోమయంలో పడ్డారు. జాహ్నవి లవర్ ఎవరన్నది ఆ అమ్మాయికే తెలియాలి..!